Heroin Seized in Gujarat:
యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఆధ్వర్యంలో..
దేశవ్యాప్తంగా యాంటీ డ్రగ్స్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఎక్కడ ఈ మత్తు పదార్థాలున్నాయని సమాచారం వచ్చినా వెంటనే సీజ్ చేసేస్తున్నారు. ఈ మధ్య కాలంలో కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్‌ని సీజ్ చేశారు. ఇప్పుడు గుజరాత్‌లోనూ ఇండియన్ కోస్ట్ గార్డ్, యాంటీ టెర్రరిజం స్క్వాడ్ సంయుక్తంగా ఓ ఆపరేషన్ నిర్వహించి హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నాయి. International Maritime Boundary Line (IMBL)కిసమీపంలో పాకిస్థాన్‌లో బోట్‌ను స్వాధీనం చేసుకుని 6గురిని అరెస్ట్ చేశారు. ఆ పడవలో రూ.350 కోట్ల విలువైన 50 కిలోల హెరాయిన్‌ను సీజ్ చేశారు. కచ్ జిల్లాలోని జకావ్ జిల్లాకు ఆ పడవను తరలించి విచారణ చేపట్టనున్నారు. "తీరప్రాంత రక్షణా దళం, యాంటీ టెర్రరిజం స్క్వాడ్ పాకిస్థాన్‌కు చెందిన పడవను స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురు సిబ్బందిని అరెస్ట్ చేశారు. తెల్లవారుజామున ఈ పడవను గుర్తించారు. అందులో 50 కిలోల హెరాయిన్ ఉంది" అని ఇండియన్ కోస్ట్ గార్డ్ ఉన్నతాధికారులు వెల్లడించారు.
గతంలోనూ గుజరాత్‌లో ఇలాంటి ఘటనలు జరిగాయి. సెప్టెంబర్ 14న పాకిస్థాన్‌కు చెందిన ఓ పడవను స్వాధీనం చేసుకున్నారు. అందులో రూ.200 కోట్ల విలువైన 40 కిలోల హెరాయిన్ దొరికింది. అరేబియన్ సముద్ర మధ్యలో ఈ పడవను స్వాధీనం చేసుకున్నారు. ఈ పడవలో ఉన్న ఆరుగురు పాకిస్థానీలను అరెస్ట్ చేశారు. సముద్రం మధ్యలో ఈ ఫిషింగ్ బోట్‌పై దాడి చేసిన ఇండియన్ కోస్ట్ గార్డ్, ఏటీస్ బృందాలు...కచ్ జిల్లాలోని జకావ్ హార్బర్ వద్ద గుర్తించారు. గుజరాత్‌లో అన్‌లోడ్ చేసి అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా పంజాబ్‌కు తరలించారని ప్లాన్ వేసుకున్నారు నిందితులు.
గతంలోనూ ఎన్నో ఘటనలు..
అంతకు ముందు కూడా యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, కోస్ట్ గార్డ్ బృందాలు కలిసి డ్రగ్ స్మగ్లింగ్‌ను అడ్డుకున్నాయి. భారీ మొత్తంలో డ్రగ్స్‌ను సీజ్ చేశారు. నిందితులను అరెస్ట్ చేశారు. ఈ ఏడాది జులైలో...75.3 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.376.5 కోట్లు. ఫ్యాబ్రిక్ రోల్స్‌లో హెరాయిన్‌ను దాచి పెట్టి గుట్టుచప్పుడు కాకుండా తరలించేందుకు ప్రయత్నించారు నిందితులు. యూఏఈ నుంచి వచ్చిన హెరాయిన్‌ను...పంజాబ్‌కు తరలించాలని నిందితులు ప్లాన్ చేసినట్టు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ వెల్లడించింది. గతేడాది సెప్టెంబర్ నుంచి Directorate of Revenue Intelligence (DRI) కోట్ల రూపాయల డ్రగ్స్‌ను సీజ్ చేసింది. గతేడాది సెప్టెంబర్‌లో దాదాపు రూ.21,000కోట్ల విలువైన 3 వేల కిలోల హెరాయిన్‌ను పట్టుకున్నారు. ఇక ఈ ఏడాది మేలో 56 కిలోలు, అంతకు ముందు ఏప్రిల్‌లో 205 కిలోల హెరాయిన్ సీజ్ చేశారు. ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సమక్షంలో దాదాపు 30 వేల కిలోల డ్రగ్స్‌ను నాశనం చేసింది నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో-NCB.దాదాపు నాలుగు చోట్ల దొరికిన ఈ డ్రగ్స్‌ను సీజ్ చేశారు.హోం మంత్రి అమిత్‌షా వీడియో కాన్ఫరెన్స్‌లో ఉండగా, NCB అధికారులు ఆ డ్రగ్స్‌ను ధ్వంసం చేశారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా ఎన్‌సీబీ ఓ లక్ష్యం పెట్టుకుంది.