ABP  WhatsApp

Hanuman Chalisa Row: నవనీత్ రాణా దంపతులపై అరెస్ట్ వారెంట్ జారీ చేసిన కోర్టు

ABP Desam Updated at: 01 Dec 2022 03:46 PM (IST)
Edited By: Murali Krishna

Hanuman Chalisa Row: ఎంపీ నవనీత్ రాణా, ఆమె భర్త ఎమ్మెల్యే రవి రాణాపై మహారాష్ట్రలోని సెషన్స్ కోర్టు అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది.

(Image Source: PTI)

NEXT PREV

Hanuman Chalisa Row: అమరావతి ఎంపీ నవనీత్ రాణాకు షాక్ తగిలింది. హనుమాన్ చాలీసా కేసు విచారణకు హాజరుకాకపోవడంతో ఎంపీ నవనీత్ రాణా, ఆమె భర్త ఎమ్మెల్యే రవి రాణాపై మహారాష్ట్రలోని సెషన్స్ కోర్టు గురువారం బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది.


ఎంపీ నవవీత్ రాణా, ఆమె భర్త ఎమ్మెల్యే రవి రాణాను ఏప్రిల్‌లో ముంబయిలోని వారి నివాసంల నుంచి పోలీసులు అరెస్ట్ చేశారు. శాంతికి విఘాతం కలిగించేందుకు, మతపరమైన శత్రుత్వాన్ని ప్రోత్సహించేందుకు ప్రయత్నించారనే ఆరోపణలపై వారిని అరెస్టు చేశారు.


ఇదీ వివాదం


శివసేనకు హిందుత్వ సూత్రాలను గుర్తుచేసేందుకు గతంలో అప్పటి సీఎం ఉద్ధవ్ ఠాక్రే నివాసం మాతోశ్రీ వెలుపల హనుమాన్ చాలీసా పఠిస్తామని వారు చెప్పారు. అనంతరం ఆ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు.


కానీ ఈ జంటపై భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 153 (A) (మతం, జాతి, పుట్టిన ప్రదేశం, నివాసం, భాష మొదలైన వాటి ఆధారంగా వివిధ సమూహాల మధ్య శత్రుత్వాన్ని పెంపొందించడం, సామరస్య పరిరక్షణకు విఘాతం కలిగించే చర్యలు చేయడం) ముంబయి పోలీసు చట్టంలోని 135 (పోలీసుల నిషేధ ఉత్తర్వుల ఉల్లంఘన) సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. దాదాపు రెండు వారాల పాటు జైలు జీవితం గడిపిన తర్వాత ఈ జంట మే లో విడుదలైంది.


విడుదలైన తర్వాత నవనీత్ రాణా.. ఉద్ధవ్ ఠాక్రేకు సవాల్ విసిరారు. ఆయన ఏ నియోజకవర్గం చెప్పిన సరే అక్కడ పోటీ చేయడానికి రెడీగా ఉన్నట్లు తెలిపారు.


నేను ఏ తప్పు చేశానని నన్ను జైల్లో పెట్టారు? హనుమాన్ చాలీసా చదవడం తప్పా? హనుమాన్ చాలీసా చదవడం నేరమైతే 14 రోజులు కాదు 14 ఏళ్లైనా జైలుకెళ్లేందుకు సిద్ధం. దమ్ముంటే ఉద్ధవ్ ఠాక్రే నాపై పోటీ చేసి గెలవాలి. రాష్ట్రంలో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేసినా ఫర్లేదు. మహిళా శక్తి అంటే ఏంటో ఠాక్రేకు చూపిస్తా.                                                                     "


-నవనీత్ రాణా, అమరావతి ఎంపీ 

స్పీకర్‌కు


ఈ వివాదం తర్వాత లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు నవనీత్‌ ఓ లేఖ రాశారు.



ఠాక్రే వ్యక్తిగత నివాసం ముందు హనుమాన్ చాలీసా జపించాలన్న నా నిర్ణయం సీఎంకు వ్యతిరేకం కాదు. వాస్తవానికి, హనుమాన్ చాలీసా పఠించడంలో నాతో కలిసి రావాలని నేను ముఖ్యమంత్రిని ఆహ్వానించాను. ఉద్ధవ్ ఠాక్రే ఆధ్వర్యంలో శివసేన.. కాంగ్రెస్, ఎన్‌సిపితో సంకీర్ణ సర్కార్‌ను ఏర్పాటు చేయడానికి తన హిందుత్వ సూత్రాల నుంచి పూర్తిగా దూరమైంది.                                        -     నవనీత్ రాణా, అమరావతి ఎంపీ


Also Read: PM Modi on Kharge: కాంగ్రెస్ 'రావణ' వ్యాఖ్యలకు 'రామాయణం'తో మోదీ కౌంటర్!

Published at: 01 Dec 2022 03:28 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.