Gujarat News: 'ఫైర్ హెయిర్ కట్' (Fire Hair Cut) విదేశాల్లోనే కాదు భారత్‌లో కూడా కొన్నాళ్లు ట్రెండింగ్‌లో ఉంది. కుర్రాళ్లు ఈ హెయిర్ కట్ చేయించుకునేందుకు ఇష్టపడేవారు. అయితే ఈ ఫైర్ హెయిర్ కట్ వల్ల ఒక్కోసారి ప్రమాదానికి గురైన సందర్భాలూ ఉన్నాయి. తాజాగా గుజరాత్‌లో అదే జరిగింది. ఓ యువకుడు ఈ హెయిర్ కట్ చేయించుకునే సమయంలో గాయపడ్డాడు.
ఇదీ జరిగింది
వల్సాద్ జిల్లా వాపి పట్టణంలో బుధవారం ఓ సెలూన్‌లో 18 ఏళ్ల యువకుడు ఫైర్ హెయిర్‌కట్ (Fire Hair Cut) చేయించుకోవడానికి వచ్చాడు. అయితే జుట్టుకు మంట పెట్టే సమయంలో ప్రమాదం జరిగింది. సెలూన్ షాప్ వ్యక్తి మంటలను ఆర్పే ప్రయత్నం చేసినా అదుపు కాలేదు. దీంతో యువకుడు.. సెలూన్ షాప్ నుంచి బయటకు పరుగులు తీశాడు. మొత్తానికి ఎలాగోలా మంటలను ఆర్పారు. కానీ అప్పటికే బాధితుడి మెడ, ఛాతీపై కాలిన గాయలయ్యాయి.
బాధితుడ్ని వెంటనే స్థానికులు వాపిలోని ఆసుపత్రికి. తీసుకెళ్లారు. అక్కడ నుండి యువకుడ్ని వల్సాద్‌లోని సివిల్ ఆసుపత్రికి రిఫర్ చేసినట్లు వాపి టౌన్ పోలీస్ స్టేషన్ అధికారులు తెలిపారు. ప్రస్తుతం యువకుడి పరిస్థితి మెరుగ్గానే ఉందని పోలీసులు తెలిపారు.
రసాయనం వల్ల
ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, హెయిర్‌కట్ కోసం అతని తలపై ఒక రకమైన రసాయనాన్ని పూయడంతో బాధితుడి శరీర పైభాగాలు తీవ్రంగా కాలిపోయాయని పోలీసు అధికారులు తెలిపారు. హెయిర్ కట్ కోసం ఏ రసాయనాన్ని ఉపయోగించారనే దానిపై దర్యాప్తు కొనసాగుతోందని వారు తెలిపారు ఈ ఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో కింద నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
Also Read: Lingayat Seer Death Case: స్వామీజీ కేసులో సంచలన విషయాలు- మహిళతో వీడియో ఛాట్, హనీట్రాప్!