Gujarat Exit Poll 2022: గుజరాత్‌ మళ్లీ బీజేపీ ఖాతాలోకే! ఏబీపీ సీ ఓటర్ ఎగ్జిట్‌ పోల్స్‌లో కాషాయానిదే హవా

Gujarat Exit Poll 2022: గుజరాత్ ఎన్నికలకు సంబంధించిన ఏబీపీ సీ ఓటర్ ఎగ్జిట్‌ పోల్స్‌ విడుదలయ్యాయి.

Continues below advertisement

Gujarat Exit Poll 2022: 

Continues below advertisement

బీజేపీకే ఎక్కువ సీట్లు..

గుజరాత్‌లో రెండు విడతల పోలింగ్ ముగిసింది. భాజపా, కాంగ్రెస్, ఆప్‌ మధ్య నెలకొన్న ముక్కోణపు పోరులో ఎవరు విజయం సాధిస్తారన్న ఉత్కంఠ ఇప్పటి నుంచే మొదలైంది. 2024 ఎన్నికల ముందు జరుగుతున్న ఈ అసెంబ్లీ ఎన్నికలు ఎంతో ప్రాధాన్యత సంతరిచుకున్నాయి. పైగా..బీజేపీ కంచుకోట అయిన గుజరాత్‌లో గెలవడాన్ని కాంగ్రెస్, ఆప్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. అటు బీజేపీ మాత్రం "మేమే గెలుస్తాం" అని మొదటి నుంచి ధీమాగా చెబుతోంది. పార్టీలన్నీ గెలుపుపై ఇలా ధీమాగానే ఉన్నా..ప్రజా తీర్పు ఎలా ఉంటుందన్నదే ఉత్కంఠ
కలిగించే అంశం. దీనిపైనే ABP C Voter Survey Exit Polls ని విడుదల చేసింది. గుజరాత్‌లో గెలిచేదెవరో అంచనా వేసింది. దక్షిణ గుజరాత్‌లో బీజేపీకి 48%, కాంగ్రెస్‌కు 23%,ఆప్‌నకు 27% ఓట్లు దక్కుతాయని అంచనా వేసింది. కాంగ్రెస్, బీజేపీ మధ్య ఓటు షేర్‌లో దాదాపు రెండు రెట్ల తేడా ఉంది. వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలుస్తామని చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పిన ఆమ్‌ఆద్మీ పార్టీ 27%ఓట్లను రాబట్టుకోగలిగింది. 

అన్ని ప్రాంతాల్లోనూ బీజేపీదే ఆధిపత్యం..?

దక్షిణ గుజరాత్‌లో బీజేపీ 24-28 సీట్లు రాబట్టుకుంటుందని, కాంగ్రెస్‌ 4-8 స్థానాలకు పరిమితమవుతుందని తేలింది. ఇక ఆప్‌ ఖాతాలో 1 లేదా 2 స్థానాలు పడనున్నట్టు ABP C Voter Exit Polls తెలిపింది. ఉత్తర గుజరాత్‌లో బీజేపీకి 21-25 సీట్లు, కాంగ్రెస్‌కు 6-10,ఆప్‌నకు 0-1 సీట్లు వస్తాయని అంచనా వేసింది. సౌరాష్ట్రలో బీజేపీకి 43%,కాంగ్రెస్‌కు 37%, ఆప్‌నకు 17% ఓట్ షేర్ దక్కుతుందని వెల్లడించింది. ఇక సీట్ల పరంగా
చూస్తే...బీజేపీకి 36-40 సీట్లు, కాంగ్రెస్‌కు 8-12,ఆప్‌నకు 4-6 స్థానాలు వస్తాయని తెలిపింది. మధ్య గుజరాత్‌లో బీజేపీకి 47 సీట్లు, కాంగ్రెస్‌కు 13 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఆప్‌నకు ఈ ప్రాంతంలో ఒక్క సీటు కూడా రాదని తెలిపింది. మొత్తంగా బీజేపీకి 49%, కాంగ్రెస్‌కు 33%,ఆప్‌నకు 15% ఓటు షేర్ దక్కుతుందని అంచనా వేసింది. ఇక సీట్ల పరంగా చూస్తే...బీజేపీకి 128-140 సీట్లు, కాంగ్రెస్‌కు 31-43,ఆప్‌నకు 3-11 సీట్లు వచ్చే అవకాశమున్నట్టుఈ ఎగ్జిట్‌పోల్స్‌లో తేలింది. 





2017లో ఫలితాలివీ..

2017లో కాంగ్రెస్‌కు 41.4% ఓట్లు షేర్ దక్కగా..77 స్థానాల్లో విజయం సాధించింది. ఈ సారి మాత్రం అంతకన్నా తక్కువ ఓటు షేర్ దక్కుతుందని C Voter Exit Polls తేలింది. ఇక బీజేపీ విషయానికొస్తే...2017లో 49.1% ఓటు షేర్‌తో 99 స్థానాల్లో విజయం సాధించింది. ఈ సారి అంతకు మించి సీట్లలో విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసింది. ప్రాంతాల వారీగా చూస్తే...మధ్య గుజరాత్‌లో 2017లో కాంగ్రెస్ 39.1% ఓట్లతో 22 స్థానాల్లో గెలిచింది. బీజేపీ 50.9% ఓట్ల రాబట్టుకుని..37 స్థానాలు తన ఖాతాలో వేసుకుంది. ఆప్‌నకు ఒక్క సీటు కూడా రాలేదు. ఉత్తర గుజరాత్‌లో 2017లో 44.9% ఓట్లు రాబట్టుకున్న కాంగ్రెస్...17 స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ 45.1% ఓట్లతో 14 స్థానాలు గెలుచుకుంది. దక్షిణ గుజరాత్‌లో 2017లో 36.4% ఓట్లతో 8 స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీకి 54.1% ఓట్లు రాగా...25 స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. గుజరాత్‌లో ఎంతో కీలకంగా భావించే కచ్ సౌరాష్ట్ర ప్రాంతంలో 2017లో కాంగ్రెస్ 45.5% ఓట్లతో 30 సీట్లు సాధించింది. బీజేపీకి 45.9% ఓట్లు రాగా...23 స్థానాలు గెలుచుకుంది. 


([Note: ఈ సర్వే ఫలితాలు, అంచనాలు CVoter Exit Poll / Post Poll పై పోలింగ్ రోజున గుజరాత్ రాష్ట్రవ్యాప్తంగా 18 ఏళ్లు దాటిన వారు చెప్పిన అభిప్రాయాల ఆధారంగా పేర్కొన్న వివరాలు మాత్రమే. కొన్ని సందర్భాలలో ఈ సర్వే ఫలితాలు, అంచనాలు నూటికి నూరు శాతం నిజం కాకపోవచ్చు. ఈ లెక్కలు ఎన్నికల ఫలితాల ట్రెండ్‌కు దాదాపు దగ్గరగా ఉంటాయని భావిస్తున్నాం. ఫలితాలకు, అంచనాలకు మధ్య నియోజకవర్గాల వారీగా సీట్ల సంఖ్యలోనూ, ఓట్ షేర్‌లోనూ 3-5% మేర అంతరం ఉండొచ్చని సీ ఓటర్ ఎగ్జిట్ పోల్ సర్వే ద్వారా తెలియజేస్తున్నాం])

Also Read: Forced Religious Conversion: బలవంతపు మత మార్పిడి చాలా సీరియస్ అంశం: సుప్రీం కోర్టు

Continues below advertisement
Sponsored Links by Taboola