Gujarat Election 2022:


పదేపదే ప్రచారమెందుకు..? 


రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోట్...ప్రధాని నరేంద్ర మోడీని టార్గెట్ చేశారు. గుజరాత్‌లో ప్రధాని నరేంద్ర మోడీ పదేపదే పర్యటిస్తూ ప్రచారం చేయడంపై విమర్శించారు. "ప్రధాని మోడీ పదేపదే గుజరాత్‌కు వచ్చి ప్రచారం చేసుకోవాల్సిన అవసరం ఏముంది..?" అని ప్రశ్నించారు. బీజేపీలో భయం మొదలైందని అన్నారు. "బీజేపీ భయపడుతోంది. బీజేపీ నేతలు నిజంగా అంత సమర్థులే అయితే...ప్రధాని మోదీ ఇక్కడికి వచ్చి ప్రచారం చేయడమెందుకు..?" అని విమర్శించారు. గుజరాత్‌లో బీజేపీ ఓడిపోతే...ఆ ఓటమికి "ద్రవ్యోల్బణం, నిరుద్యోగం" కారణాలవు తాయని వెల్లడించారు. ఇటీవలే గుజరాత్‌లో మూడు ర్యాలీలు నిర్వహించారు ప్రధాని. ఆ మరుసటి రోజే గహ్లోట్ ఈ వ్యాఖ్యలు చేశారు. ద్రవ్యోల్బణం కారణంగా...రాష్ట్రంలో ఆర్థిక స్థితిగతులు దిగజారిపోయాయని అన్నారు. గుజరాత్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైతే..దాని వల్ల దేశానికీ మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. "బీజేపీ ఓడిపోయాక కానీ తెలియదు..ద్రవ్యోల్బణం వారిని ఓటమి పాలు చేసిందని" అని అన్నారు. ఈ ఓటమి తరవాతైనా మోడీ...ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు చర్యలు చేపడతారేమో అని సెటైర్లు వేశారు. "మోడీ అనే పేరొక్కటి చాలు కదా. ఊరికే ప్రచారం చేసుకోడం ఎందుకో" అని అన్నారు. మోడీ, అమిత్‌షా గుజరాత్‌కు తరచూ వస్తున్నారంటే...ఇక్కడ ఓడిపోతామే మోనన్న భయం మొదలైందని స్పష్టమవుతోందని చెప్పారు. 


మాటల దాడులు..


గుజరాత్ ఎన్నికల వేళ రాజకీయ నేతల మధ్య ఇలాంటి కౌంటర్‌లు,విమర్శలు పెరుగుతున్నాయి. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, వివాదాస్పద నేత శంకర్‌ సిన్హ్ వగేలా రామ్ మందిర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. "రామ మందిరం పేరు చెప్పుకుని బీజేపీ మార్కెటింగ్ చేసుకుంటుంది. పేదవాళ్లకు ఆహారం, ఉద్యోగం దొరుకుతుందో లేదోనన్న పట్టింపెక్కడుంది" అని విమర్శించారు.  ఈ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. దేవుడిని అవమానించారంటూ మండి పడింది. బీజేపీనే కాదు. ఆప్‌ను కూడా విమర్శించారు..శంకర్ సిన్హ్. "అరవింద్ కేజ్రీవాల్ ఎప్పటికీ రాజకీయ నేత కాలేరు. ఓ IAS,IPS అధికారి మంచి లీడర్ ఎలా అవుతాడు. కేజ్రీవాల్ సంఘ్ మనిషి. బీజేపీ కోసమే పని చేస్తాడు. RSS ఎప్పుడో బీజేపీలో విలీనమైపోయింది. సొంతగా ఆలోచించే స్వేచ్ఛ కోల్పోయింది" అని అన్నారు. 1996-97 మధ్య కాలంలో శంకర్ సిన్హ్ వగేలా గుజరాత్ సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. 1977లో తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యారు. గుజరాత్ లోని జామ్ నగర్ ప్రజలు ప్రస్తుతం క్రికెటర్ రవీంద్ర జడేజాను తరచుగా చూస్తున్నారు. అయితే ఈ ఆల్ రౌండర్ ను వారు మైదానంలో కాకుండా తమ గల్లీల్లో వీక్షిస్తున్నారు. జడేజా భార్య రివాబా ఆ నియోజకవర్గం నుంచి భాజపా తరఫున అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఆమె తరఫున జడేజా ప్రచారం చేస్తున్నారు. రివాబా పోటీ చేస్తున్న జామ్ నగర్  క్రికెటర్ల భూమిగా ప్రసిద్ధి. భారత దేశవాళీలో ముఖ్యమైన టోర్నీ రంజీ ట్రోఫీ. దానికి ఆ పేరును అదే నియోజకవర్గానికి చెందిన క్రికెటర్ కే.ఎస్. రంజిత్ సిన్హీ గౌరవార్ధం పెట్టారు.


Also Read: Covid Outbreak: బ్రేక్ ఇచ్చి మళ్లీ భయపెడుతున్న కరోనా, పలు దేశాల్లో ఆంక్షలు, లాక్‌డౌన్‌లు