గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ నేతృత్వంలోని మంత్రివర్గం గురువారం మధ్యాహ్నం కొలువుదీరింది. గాంధీనగర్‌లోని రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారం కార్యక్రమం జరిగింది.
రాజేంద్ర త్రివేది, జితు వాఘనీ, రిషికేశ్ పటేల్, పునేశ్ మోదీ, రాఘవ్ పటల్ సహా మొత్తం 24 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. డిప్యూటీ సీఎంగా రిషికేశ్ పటేల్ బాధ్యతలు స్వీకరించనున్నట్లు ఏబీపీ సమాచారం. ప్రస్తుతం నితిన్ పటేల్ ఆ స్థానంలో కొనసాగుతున్నారు.
ఈరోజు సాయంత్రం కొత్త కేబినెట్ తొలిసారి సమావేశం కానుంది. సీఎం భూపేంద్ర పటేల్ నేతృత్వంలో ఈ సమావేశం జరగనుంది. బుధవారం ఈ ప్రమాణస్వీకారం జరగాల్సి ఉండగా రెండుసార్లు వాయిదా పడింది. కొత్త కేబినెట్‌లో పూర్తి స్థాయి మార్పుల కోసం భూపేంద్ర పటేల్ ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.
Also Read: Cancers: వారానికి 150 నిమిషాలు వ్యాయామం చేస్తే... క్యాన్సర్ల ముప్పు నుంచి కాస్త తప్పించుకోవచ్చు
అసెంబ్లీ ఎన్నికలు..
15 నెలల తర్వాత గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికలకు కొత్త ఫేస్‌తో వెళ్లాలని భాజపా నిర్ణయించింది. ఇటీవల భాజపా పాలిత రాష్ట్రాల్లో సీఎంలను మారుస్తూ వస్తోంది పార్టీ అధిష్ఠానం.
Also Read: Central Vista Project: నూతన రక్షణ భవనాలను ప్రారంభించిన ప్రధాని