Gujarat AAP chief Detained: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్ చీఫ్ గోపాల్ ఇతాలియను దిల్లీ పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నారు. అనంతరం గోపాల్‌ను సరితా విహార్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఇదే కారణం
ప్రధాని నరేంద్ర మోదీపై అవమానకర వ్యాఖ్యలు చేసిన వీడియోకు సంబంధించి జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సీడబ్ల్యూ) ఇటీవల ఆప్ నేత గోపాల్ ఇతాలియకు సమన్లు జారీ చేసింది. అనంతరం గోపాల్ ట్విట్టర్‌లో ఎన్‌సీడబ్ల్యూను ట్యాగ్ చేస్తూ ఓ ట్వీట్ చేశారు.
గోపాల్ ఇటాలియా నిరుపేద కుటుంబం నుండి వచ్చినందున మరియు పాటిదార్ కమ్యూనిటీకి చెందినందున అతనిని లక్ష్యంగా చేసుకోవడానికి బిజెపి పాత వీడియోను ఉపయోగిస్తోందని ఆప్ తన గుజరాత్ యూనిట్ చీఫ్‌ను సమర్థించింది.
ఎన్‌సీడబ్ల్యూ ట్వీట్
గోపాల్ ఇతాలియకు మహిళా కమిషన్ సమన్లు జారీ చేసిన తర్వాత తమ కార్యాలయం వెలుపల గొడవ జరుగుతోందని ఎన్‌సీడబ్ల్యూ చీఫ్ రేఖా శర్మ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ అనంతరం ఆయనను దిల్లీ పోలీసులు నిర్బంధించారు.
ఆప్ విమర్శలు
గోపాల్‌ను అదుపులోకి తీసుకోవడంపై దిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. మొత్తం భాజపా.. గోపాల్ ఇతాలియ వెనుక ఎందుకు పడుతుందని? ఆయన ప్రశ్నించారు.
గోపాల్ ఇతాలియ నిరుపేద కుటుంబం నుండి వచ్చినందుకు, పాటిదార్ కమ్యూనిటీకి చెందినందునే ఆయన్ను భాజపా లక్ష్యంగా చేసుకుందని ఆప్ ఆరోపించింది. పాత వీడియోను ఇప్పుడు సర్క్యులేట్ చేసి గోపాల్‌ను అరెస్ట్ చేశారని విమర్శించింది.
అసెంబ్లీ ఎన్నికలు
రానున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాకు షాక్ ఇవ్వాలని ఆమ్ ఆద్మీ వ్యూహాలు రచిస్తోంది. ఆప్‌ను గెలిపిస్తే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగిస్తామని కేజ్రీవాల్ అన్నారు. పలు హామీలు ప్రకటించారు.
- 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తాం.
- రాబోయే ఐదేళ్లలో ప్రతి నిరుద్యోగ యువకుడికి ఉద్యోగం కల్పిస్తాం
- అందరికీ ఉద్యోగాలు కల్పించేంత వరకూ నిరుద్యోగులకు నెలకు రూ.3,000 చొప్పున నిరుద్యోగ భృతి
- 300 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ కల్పిస్తాం.
- ప్రభుత్వ రిక్రూట్‌మెంట్ పరీక్షల్లో ప్రశ్నాపత్నం లీక్ కాకుండా చూడటంతో పాటు ఇందుకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఒక చట్టం తీసుకువస్తాం.
Also Read: Anil Vij On Hijab Ban: కంట్రోల్ లేని పురుషులే మహిళలను హిజాబ్ ధరించమంటారు: భాజపా మంత్రి