Just In





Guinness World Record: వారెవ్వా, ఒక్క కోన్‌పై 125 ఐస్ స్కూప్‌లు- గిన్నిస్ రికార్డ్!
Guinness World Record: ఒక్క కోన్‌పై ఏకంగా 125 ఐస్ స్కూప్‌లు పెట్టి గిన్నిస్ రికార్డ్ సృష్టించాడు ఓ వ్యక్తి.

Guinness World Record: ఒక్క కోన్‌పై ఎన్ని ఐస్ స్కూప్‌లు పెట్టగలరు? మహా అయితే రెండో, మూడో పెట్టగలరు అంటారా? కానీ ఓ వ్యక్తి ఏకంగా ఒక్క కోన్‌పై 125 ఐస్ స్కూప్‌లు ఉంచి రికార్డ్ సృష్టించాడు. దీంతో ఆయనను గిన్నిస్ ప్రపంచ రికార్డ్ వరించింది.
వైరల్
ఇటలీకి చెందిన దిమిత్రీ పాన్‌సియేరా ఒక కోన్‌పై 125 రంగురంగుల ఐస్ స్కూప్‌లను ఒకదానిపై మరొకటి పెట్టి రికార్డు సృష్టించారు. దీంతో ఆయనుకు గిన్నిస్‌బుక్‌లో చోటు కూడా దక్కింది. ఇందుకు సంబంధించిన వీడియోను గిన్నిస్‌వరల్డ్ రికార్డు తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
దిమిత్రీ గతంలో ఒకే కోన్‌పై 121 ఐస్ స్కూప్‌లను ఉంచి అప్పట్లో రికార్డు సృష్టించాడు. తాజాగా ఆ రికార్డును ఆయనే బద్దలు కొట్టినట్లైంది.
Also Read: G20 Summit: రిషి సునక్‌తో ప్రధాని మోదీ భేటీ- ఆ ఒప్పందం గట్టెక్కేనా?