ABP  WhatsApp

PM Narendra Modi: రాజస్థాన్‌లో నాలుగు వైద్య కళాశాలలకు మోదీ శంకుస్థాపన

ABP Desam Updated at: 30 Sep 2021 04:03 PM (IST)
Edited By: Murali Krishna

రాజస్థాన్‌ జైపుర్‌లో పెట్రోకెమికల్స్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్‌ను ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు.

వైద్య కళాశాలలను ప్రారంభించిన మోదీ

NEXT PREV

రాజస్థాన్‌లో నాలుగు వైద్య కళాశాలలకు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. బన్​స్వారా, సిరోహి, హనుమాన్​గఢ్​, దౌసా జిల్లాల్లో ఈ కళాశాలలు నిర్మించనున్నారు. జైపుర్ సితాపురాలో పెట్రోకెమికల్స్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్‌ను కూడా ప్రారంభించారు. దేశ ఆరోగ్య రంగంలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు నూతన జాతీయ ఆరోగ్య విధానం కోసం కృషి చేస్తున్నామని ఈ సందర్భంగా మోదీ అన్నారు.



ప్రస్తుత పరిస్థితుల్లో తమ బలాన్ని, స్వశక్తిని పెంచుకోవాలని భారత్​ నిర్ణయించింది. స్వచ్ఛ భారత్​ అభియాన్​ నుంచి ఆయుష్మాన్​ భారత్,  ఇప్పుడు ఆయుష్మాన్​ భారత్​ డిజిటల్​ మిషన్​ నూతన జాతీయ ఆరోగ్య విధానంలో భాగమే. ఒక్క క్లిక్​ దూరంలోనే మంచి ఆసుపత్రులు, ల్యాబ్​లు ఎక్కడున్నాయో ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ద్వారా తెలుస్తుంది. -                                  ప్రధాని నరేంద్ర మోదీ


ఈ శంకుస్థాపన కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయా, రాజస్థాన్​ సీఎం అశోక్​ గహ్లోత్​, లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లా వర్చువల్​గా హాజరయ్యారు.


డిజిటల్ హెల్త్ ఐడీలు..


ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్‌లో భాగంగా ప్రతి భారతీయుడికీ హెల్త్ ఐడీ  కేటాయిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆయుష్మాన్ భారత్ ప్రారంభించి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టినట్లు వెల్లడించారు. 


ఆరు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇప్పటికే పైలట్​ ప్రాజెక్టుగా పీఎండీహెచ్​ఎం అమలవుతోంది. టెక్నాలజీ ఆధారంగా దేశ ప్రజలందరికీ వైద్య సేవలు అందించడం కోసం కేంద్రం ఈ కార్యక్రమం చేపడుతోంది.


ఎలా పనిచేస్తుంది?



  • ఈ పథకంలో భాగంగా దేశ ప్రజలకు హెల్త్‌ కార్డ్‌లతో పాటు హెల్త్‌ ఐడీలను అందించనున్నారు.

  • వీటి ఆధారంగా ప్రజలు తమ ఆరోగ్య సమాచారాన్ని ఆయుష్మాన్‌ భారత్‌ డిజిటల్‌ వెబ్‌సైట్‌లో అప్‌డేట్‌ చేయలి.

  • ఎవరైనా అనారోగ్య సమస్యలతో ఆస్పత్రికి వెళ్లినా, ట్రీట్మెంట్‌ రికార్డ్‌లను పోగొట్టుకున్నా సంబంధిత సమాచారం ఈ వెబ్‌సైట్‌లో భద్రంగా ఉంటుంది.

  • హెల్త్ ఐడీ చెబితే మన ఆరోగ్య వివరాలు మొత్తం తెలుస్తాయి.


Also Read: ISIS Terrorist: కబాబ్ మార్చిన కథ.. ఏకంగా ఐసిస్ ఉగ్రవాదినే పట్టించేసింది!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at: 30 Sep 2021 03:41 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.