Bharat Brand Rice: 



భారత్ రైస్..


దేశవ్యాప్తంగా బియ్యం ధరలు (Rice Price Hike) అనూహ్యంగా పెరుుతున్నాయి. ఈ ధరల్ని కట్టడి చేసేందుకు కేంద్రం అన్ని విధాలుగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే మార్కెట్‌లోకి Bharat rice ని అందుబాటులోకి తీసుకొచ్చే యోచనలో ఉంది. కిలో రూ.25 చొప్పున వీటిని విక్రయించనుంది. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈలోగా బియ్యం ధరలు పెరగడంపై ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎన్నికలపై ప్రభావం పడకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇప్పటికే Bharat atta,Bharat dal తో తక్కువ ధరకే గోధుమలు, పప్పులు విక్రయిస్తోంది. ఇది బాగానే సక్సెస్ అయింది. అందుకే రైస్ విషయంలోనూ ఇదే విధంగా స్కీమ్ తీసుకురావాలని భావిస్తోంది కేంద్రం.  National Agricultural Cooperative Marketing Federation of Indiaతో పాటు National Cooperative Consumers’ Federation of India Ltd, కేంద్రీయ భండార్ ఔట్‌లెట్స్, మొబైల్ వ్యాన్స్ ద్వారా ఈ రాయితీని అందించనుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రిటైల్ రైస్‌ ధర కిలోకి రూ.43 దాటింది. గతేడాదితో పోల్చి చూస్తే..ఇది 14.1% ఎక్కువ. ఆహార ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకోనున్నట్టు ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. ప్రస్తుతానికి రాయితీ కింద కిలో గోధుమలను రూ.27.50కి, పప్పులను రూ.60 చొప్పున విక్రయిస్తోంది కేంద్రం. దేశవ్యాప్తంగా దాదాపు 2 వేల రిటైల్ పాయింట్స్ వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. ఈ ఏడాది ఒక్క నవంబర్‌లోనే బియ్యం ధర 10.3% మేర పెరిగింది. ఫలితంగా...Food Inflation ఒక్కసారిగా 8.7% పెరిగింది. తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలకు బియ్యం అందుబాటు ధరలో ఉండేలా చూడనుంది ప్రభుత్వం. 


15 ఏళ్ల రికార్డుని బద్దలు కొట్టే స్థాయిలో రైస్ ధరలు నమోదయ్యాయి. రానున్న రోజుల్లో ఈ ధరలు మరింత పెరగొచ్చని హెచ్చరిస్తున్నారు మార్కెట్‌ నిపుణులు. రైస్‌కి డిమాండ్‌ పెరుగుతోంది. ఆ స్థాయిలో సరఫరా లేకుండా పోయింది. Consumer Affairs డిపార్ట్‌మెంట్‌కి చెందిన Price Monitoring Division లెక్కల ప్రకారం చూస్తే...ఏడాది కాలంలోనే బియ్యం ధరలు 15% మేర (Rice Price Hike) పెరిగాయి. అధికారిక లెక్కల ప్రకారం గతేడాది డిసెంబర్ 21 నాటికి బియ్యం రిటైల్ ధర కిలోకి రూ.37.99గా ఉంది. ఇదే ఈ ఏడాది డిసెంబర్ 20 నాటికి ఇది రూ.43.51 కి పెరిగింది. కొన్ని చోట్ల ఇది రూ.50 వరకూ ఉంది. ఈ పెరుగుదల ఎక్కడి వరకూ వెళ్తుందో ఇప్పుడప్పుడే చెప్పలేని పరిస్థితి. సెప్టెంబర్, అక్టోబర్‌లో ధరలు కాస్త అదుపులోనే ఉన్నప్పటికీ నవంబర్ నుంచి పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పటికిప్పుడు బియ్యం ధరల్ని తగ్గించాలని తేల్చి చెప్పింది కేంద్రం. లాభాల కోసం ఎవరైనా ధరలు పెంచి విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. మరో నాలుగు నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి కీలక సమయంలో బియ్యం ధరలు పెరగడం మోదీ సర్కార్‌కి సమస్యగా మారింది.


Also Read: Bharat Nyay Yatra: జనవరి 14 నుంచి రాహుల్ భారత్‌ న్యాయ్ యాత్ర, ఈ సారి మణిపూర్ నుంచి మొదలు