Govt School Girls Punches: బీహార్‌లోని పూనియా అనే ఊళ్లో ఉన్న గవర్నమెంట్ స్కూల్లో ఆడపిల్లలు పెద్ద ఎత్తున కొట్లాటకు దిగారు. వారి భుజాలకు బ్యాగులు ఉన్నాయి. అయినా జుట్లు పట్టుకుని...కొట్టుకున్నారు. వారు కొట్టుకుంటున్న దృశ్యాలను ఆ స్కూల్ పిల్లలే వీడియోలు తీసి వైరల్ చేశారు.
ఎందుకు ఈ గొడవ అని ఆరా తీసిన వారికి షాకింగ్ విషయాలు తెలిశాయి. ఈ స్కూల్ లో చదివే ఓ విద్యార్థి ఒకే సమయంలో ఇద్దరితో డేటింగ్ చేస్తున్నాడట. ఒకరికి తెలియకుండా ఒకరితో చాటింగ్ లు చేస్తున్నాడు. అప్పుడప్పుడు బయటకు వెళ్తున్నాడు . ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. స్కూల్లో ఉన్నప్పుడే ఇద్దరు లవర్స్ కు తెలిసింది. అంతే ఇద్దరూ ఎవరికి వారు నా బాయ్ ఫ్రెండ్ ను వలలో వేసుకుంటావా అని ఎదురుదాడికి దిగారు. ఇద్దరూ మొదట ఘర్షణకు దిగారు. తర్వాత వారికి మద్దతుగా వారి ఫ్రెండ్స్ వచ్చారు. అలా ఇది ఓ గ్యాంగ్ వార్ లా మారిపోయింది.
విచిత్రం ఏమిటంటే వీడియో రికార్డు చేస్తున్నవారు గొడవను అపుతున్నట్లుగా నటిస్తూ వీడియో రికార్డు చేశారు. చాలా సేపు వీడియో రికార్డు చేసిన తర్వాత గొడవను ఆపేందుకు ప్రయత్నించారు. కానీ అంత సీరియస్ మేటర్ లో తాము ఎందుకు వెనక్కి తగ్గుతామని వారంతట వారు గొడవపడుతూనే ఉన్నారు. ఈ గొడవలో లేని విద్యార్థులు సినిమా చూసినట్లుగా గొడవను చూశారు. హాయిగా నవ్వుకున్నారు.
అయినా చదువుకోమని పంపిస్తే.. ఉచితంగా చదువులు చెబుతున్న ప్రభుత్వాన్ని.. అటు తల్లిదండ్రులను కూడా మోసం చేస్తూ వీరు ఇంకా స్కూల్ కూడా దాటని వయసులో బాయ్ ఫ్రెండ్స్ అని గొడవలకు దిగుతున్న వైనంపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.