Gold Crores Of Cash And 3 Crocodiles Inside Tax Raid At Ex BJP MLAs Home : మధ్యప్రదేశ్‌లో బీజేపీకి చెందిన రాథోడ్ అనే మాజీ ఎమ్మెల్యేతో పాటు ఆయన సహచరులు, బినామీలుగా గుర్తించిన వారిపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. వీరంతా కలిసి బీడీల వ్యాపారం చేస్తున్నారు. బీడీ తయారీ పరిశ్రమ, అమ్మకాల్లో ఉన్నారు. ఈ బిజినెస్‌లో అడ్డోగలుగా సంపాదించి పన్నులు కట్టడం లేదని ఫిర్యాదులు రావడంతో ఐటీ అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో పెద్ద ఎత్తున నగదు స్వాధీనం చేసుకున్నారు. మాజీ ఎమ్మెల్యేతో పాటు ఆయన వ్యాపార భాగస్వాముల ఇళ్లల్లో కోట్ల కొద్ది నగదు, బంగారం, ఇంపోర్టెడ్ కార్లను పట్టుకున్నారు. వాటి విలువ మదింపు చేశారు.
అయితే మాజీ ఎమ్మెల్యే ఇంట్లో సోదాలు చేసిన తర్వాత ఇంటి వెనుకకు వెళ్లినప్పుడు అక్కడ ఉన్న వాటిని చూసి అదిరి పడ్డారు. అక్కడ చిన్న ఈత కొలనులాంటిది ఉంది. అందులో మూడు మొసళ్లు ఉన్నాయి. వాటిని తాను పెంచుకుంటున్నారని చెప్పారు. దాంతో ఫారెస్ట్ అధికారులకు ఐటీ అధికారులు సమాచారం ఇచ్చారు. మొసళ్లు పెంపుడు జంతువులు కాదు. వాటిని పెంచుకోవడానికి అనుమతులు ఉండవు. అయినా బీజేపీ మాజీ ఎమ్మెల్యే తన ఇంట్లో మూడు మొసళ్లను పెంచుతున్నారు.
మధ్యప్రదేశ్ లో బీడీ తయారీ పరిశ్రమ కొంత మంది వ్యక్తుల చేతుల్లో ఉంటుంది. కోట్ల రూపాయల్లో వ్యాపారం చేస్తూంటారు కానీ.. పన్నులు కట్టరన్న ఆరోపణలు ఉన్నాయి. బీడీ పరిశ్రమ ఇప్పటికీ అవ్యవస్థీకృత రంగంలోనే ఉంది. ఇతర స్మోకింగ్ వస్తువుల తయారీ పరిశ్రమలా విస్తరించలేదు. ఈ కారణంగా పన్నుల ఎగవేత చాలా ఎక్కువగా ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. బీడీల తయారీకి యంత్రాలు ఉండవు. కార్మికులే ఉంటారు. వారి శ్రమను దోపిడీ చేస్తారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో ఈ మాజీ ఎమ్మెల్యే ఇంటిపై దాడుల్లో దొరికిన నగదు, బంగారం, కార్లు అంతా పన్నులు కట్టకుండా సంపాందించివే.
అయితే ఈ మాజీ ఎమ్మెల్యే మురళ్లను ఎందుకు పెంచుతున్నాడన్నది మాత్రం సస్పెన్స్ గా మారింది. ఐటీ అధికారులకు ఈ మొసళ్లను పెంచడానికి కారణాలేమిటో చెప్పలేదు కానీ.. ఎప్పుడైనా తన ఇంటిపై ఇలాంటి దాడులు జరుగుతాయని ఊహించి పూల్ కట్టేసి.. అందులో ఇంకా పెద్ద ఎత్తున నగదు దాచి ఉంచి ఉంటాడని.. ఈ కోణంలో ఐటీ అధికారులు ఆలోచించలేదా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. లేకపోతే ఎందుకు మొసళ్లను పెంచుకుంటాడని అంటున్నారు.
Also Read: క్షమాపణలు చెప్పడానికి నామోషీ ఎందుకు? టీటీడీని ప్రశ్నించిన పవన్ కల్యాణ్