Twitter Single Word Trend : మీరు ట్విట్టర్ యూజర్ అయితే ఖచ్చితంగా సింగిల్ వర్డ్ ట్వీట్లు చాలా చూసే ఉంటారు. ఇదో ట్రెండ్ అని సహజంగానే తెలిసిపోతుంది. కానీ అసలు ఈ ట్రెండ్ వెనుక ఉన్న కాన్సెప్ట్ ఏమిటి ? అసలెందుకిలా సింగిల్ వర్డ్ ట్వీట్ చేస్తున్నారు అన్నది చాలా మందికి సస్పెన్స్‌గానే ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెలబ్రిటీలు అందరూ ఇదేదో బాగుందని ట్రైచేస్తున్నారు. సినీ, క్రీడా, రాజకీయ, వ్యాపార ప్రముఖులు కూడా ఈ వన్ వర్డ్ ట్రెండ్ ను ఫాలో అవుతున్నారు.



నాసా, ది వాషింగ్టన్ పోస్ట్, మెయిల్ చింప్ వంటి సంస్థలు, దేశాధ్యక్షుడు జో బైడెన్ వంటి ప్రముఖలు కూడా సింగిల్ వర్డ్ ట్వీట్లు చేసి ఆ ఒరవడిలో పాలుపంచుకోవడం విశేషం. భారత్ లోనూ ఈ వన్ వర్డ్ పంథా బాగానే పాపులర్ అయింది. ఇక, భారత బ్యాటింగ్ మ్యాస్ట్రో సచిన్ టెండూల్కర్ తనకెంతో ఇష్టమైన 'క్రికెట్' అనే పదాన్ని ట్వీట్ చేశారు. 



తెలుగులోనూ ఈ ట్రెండ్ ఊపందుకుంది. ఆర్ఆర్ఆర్ సినిమా టీమ్ 'రామరాజు' అంటూ ఒక ట్వీట్, 'భీమ్' అంటూ మరో ట్వీట్ చేసింది. ఎన్టీఆర్ ఆర్ట్స్ 'ఫియర్', 'జగత్ జ్జరిక' అంటూ విడివిడిగా ట్వీట్లు చేసింది. 



రాజకీయ నాయకులు కూడా ఫాలో అవుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా తెలుగు అని ట్వీట్ చేశారు. 



అసలు ఈ ట్రెండ్ చాలా యాధృచ్చికంగా క్రియేట్ అయింది. దీనికో అర్థం పర్థం లేదు.  అమెరికా రైల్వే కంపెనీ ఆమ్ ట్రాక్ సెప్టెంబరు 1న పొరబాటున 'ట్రైన్స్' అంటూ ఒకే ఒక్క పదాన్ని ట్వీట్ చేసింది. అదేదో బాగుందని రీట్వీట్ చేయడం ప్రారంభించారు.  ఆమ్ ట్రాక్ చేసిన తొలి ట్వీట్ 'ట్రైన్స్' కు వేల కొద్దీ రీ ట్వీట్లు వచ్చాయి. ఆ ట్రెండ్ అలా కొనసాగుతోంది.  





తాము పొరపాటున పెట్టిన ట్వీటే ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ కావడంతో యామ్‌ట్రాక్ రైల్వే ట్విట్టర్ హ్యాండిల్.. తమ ట్రైన్స్ అనే పొరపాటున పెట్టినట్వీట్‌ను పిన్ చేసేసుకుంది.