బుల్లితెరపై నెంబర్ వన్ రియాలిటీ షోగా దూసుకుపోతుంది బిగ్ బాస్(Bigg Boss). అన్ని భాషల్లో ఈ షో సూపర్ హిట్ అయింది. తెలుగులో కూడా ఈ షోకి మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పటివరకు ఐదు సీజన్లను పూర్తి చేసుకుంది. అలానే ఈ ఏడాది ఓటీటీ వెర్షన్ తో ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయాలనుకున్నారు. హాట్ స్టార్ లో 24 గంటల కాన్సెప్ట్ తో ఈ షోని నడిపించారు. కానీ ఆశించిన స్థాయిలో ఓటీటీ వెర్షన్ క్లిక్ అవ్వలేదు.
 
ఇదిలా ఉండగా.. బిగ్ బాస్ సీజన్ 6(Bigg Boss 6) కోసం సన్నాహాలు చేస్తున్నారు. సెప్టెంబర్ 4 నుంచి ఈ షో మొదలవుతుందని వెల్లడించారు. ఇప్పటికే ఈ షోకి సంబంధించిన చాలా ప్రోమోలు వచ్చాయి. ఈసారి కూడా నాగార్జునే హోస్ట్ గా వ్యవహరించనున్నారు. ఈసారి మొత్తం 18 మంది కంటెస్టెంట్స్ కనిపించనున్నారు. ఇప్పటికే బిగ్ బాస్ షో కోసం సెలెక్ట్ చేసిన కంటెస్టెంట్స్ ను హోటల్ రూమ్స్ కి తరలించారు. 


శుక్రవారం రాత్రి నుంచి వాళ్ల దగ్గర మొబైల్స్ కూడా తీసేసుకున్నారు. దీంతో చాలా మంది కంటెస్టెంట్స్ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తున్నట్లు పోస్ట్ లు పెట్టారు. సింగర్ రేవంత్ అయితే బిగ్ బాస్ షో పేరు చెప్పకుండా ఒక ఎమోషనల్ పోస్ట్ ను షేర్ చేశారు. హౌస్ లోకి వెళ్లకముందే టైటిల్ నాదే అంటూ కన్ఫర్మ్ చేశారు. ఇదే సమయంలో తనకు ఓట్లు వేసి గెలిపించమని కోరారు. 


'జీవితంలో కొన్నింటిని సాక్రిఫైజ్ చేయడం కష్టంగా ఉంటుంది. నా భార్యతో పాటు నాకిష్టమైన మ్యూజిక్ ను కూడా మిస్ అవుతున్నాను. కానీ ఒక భగీరధుడు సాధనలా గెలిచి మంచి పేరుతో బయటకు వస్తా.. మీ ఓట్లతో నన్ను గెలిపించండి. ఎంటర్టైన్మెంట్ కి అంతా రెడీ. మీ సపోర్ట్ తో టైటిల్ గెలిచి వస్తా..' అంటూ ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పెట్టుకున్నారు. ఆ విధంగా తాను ముందే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తున్నట్లు చెప్పకనే చెప్పారు రేవంత్. 


నిజానికి ఈ షోలోకి వెళ్లేముందు ఇలా లీకులు ఇవ్వడం బిగ్ బాస్ రూల్స్ కి వ్యతిరేకం. కానీ మరింత బజ్ రావడానికి ఈసారి రూల్స్ ను పక్కన పెట్టినట్లున్నారు. దీంతో చాలా మంది కంటెస్టెంట్స్ పేర్లు బయటకొచ్చాయి. యూట్యూబర్ ఆదిరెడ్డి అయితే ఇన్స్టాగ్రామ్ లైవ్ పెట్టారు. టీవీ9 యాంకర్ ఆరోహి రావు కూడా ఇన్ డైరెక్ట్ గా బిగ్ బాస్ షోలోకి వెళ్తున్నట్లు చెప్పుకొచ్చింది. 


ఇప్పటివరకు బయటకొచ్చిన వివరాల ప్రకారం కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదే..


1. బాలాదిత్య (హీరో)
2. అభినయ శ్రీ (నటి)
3. రోహిత్, మెరీనా (రియల్ కపుల్)
4. రేవంత్ (సింగర్)
5. నేహా (యాంకర్)
6. చలాకీ చంటి (కమెడియన్)
7. సుదీప (నటి, నువ్వు నాకు నచ్చావ్ ఫేమ్)
8. శ్రీ సత్య (సీరియల్ నటి)
9. ఇనయా సుల్తానా (నటి)
10. శ్రీహాన్ (యూట్యూబర్)
11. ఆరోహి రావ్
12. వాసంతి
13. అర్జున్
14. ఆర్జే సూర్య
15. కీర్తి భట్ (కార్తీకదీపం హీరోయిన్)
16. రాజశేఖర్
17. గీతూ (యూట్యూబర్)
18. ఫైమా (కమెడియన్)
19. తన్మయ్ (జబర్దస్త్ లేడి గెటప్) 
20. ఆది రెడ్డి (యూట్యూబర్) 


Also Read : ఎన్టీఆర్‌ను టార్గెట్ చేసిన కేసీఆర్? - దెబ్బకు రెండున్నర కోట్ల నష్టం


Also Read : ఫ్లాప్‌ల‌తో క‌ట్టిన స్టార్‌డ‌మ్ కోట - ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ క్రేజ్ వేరే లెవల్