Emmanuel Macron: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్‌పై ఓ మహిళ దాడి చేసిన వీడియో వైరల్ అవుతోంది. అధ్యక్షుడి దగ్గరకు వచ్చిన మహిళ సడెన్‌గా ఆయన చెంప చెళ్లుమనిపించింది. వెంటనే తేరుకున్న భద్రతా సిబ్బంది ఆమెను అదుపులోకి తీసుకున్నారు.


ఇదీ జరిగింది


ఈ వీడియోలో అధ్యక్షుడు మేక్రాన్ ఎక్కడికో వెళ్తున్నారు. అదే సమయంలో ఆలివ్‌ గ్రీన్‌ టీ షర్ట్‌ ధరించిన మహిళ ఎదురుపడి మేక్రాన్‌పై దాడి చేసింది. ఒక్కసారిగా దాడి జరగడంతో మేక్రాన్‌తో పాటు భద్రతా సిబ్బంది షాకయ్యారు. అయితే, ఈ ఘటన ఎక్కడ జరిగింది ? అధ్యక్షుడిపై దాడి చేయడానికి గల కారణాలు ఏంటీ ? అనే వివరాలు తెలియరాలేదు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.






గతేడాది జూన్‌లో కూడా మేక్రాన్‌పై ఇలానే దాడి జరిగింది. ఓ యువకుడు.. మేక్రాన్‌కు షేక్ హ్యాండ్ ఇస్తున్నట్లు చేసి, ఆయన చెంపపై కొట్టాడు. ఆ యువకుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు.


Also Read: AWS Infrastructure: అమెజాన్ ఇన్‌ఫ్రా రీజైన్‌గా హైదరాబాద్- ఏటా 48 వేల ఉద్యోగాలకు అవకాశం!