Susan Wojcicki Son Found Dead: యూట్యూబ్ మాజీ సీఈవో సుసాన్ వోజ్సికి ( Susan Wojcicki) కొడుకు మార్కో ట్రాపర్ (Marco Troper) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గత వారమే చనిపోయినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. బెర్కెలీలోని University of Californiaలో డార్మిటరీలో మృతి చెందినట్టు వివరించారు. ట్రాపర్‌ ఉంటున్న గదిలో నుంచి ఎలాంటి శబ్దాలు రాకపోవడం వల్ల అనుమానంతో ఫైర్ డిపార్ట్‌మెంట్‌ సిబ్బంది వచ్చి తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లింది. అప్పటికే మార్కో ట్రాపర్ చనిపోయినట్టు గుర్తించారు. అయితే...ఈ మరణానికి కారణమేంటన్నది మాత్రం ఇంకా తెలియలేదు. మార్కోకి డ్రగ్స్ తీసుకునే అలవాటుందని...బహుశా ఆ డోస్ ఎక్కువై చనిపోయి ఉంటాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. పోలీసులు విచారణ మొదలు పెట్టారు. కుటుంబ సభ్యులు చెప్పిన వివరాల ఆధారంగా toxicology  రిపోర్ట్‌ని సిద్ధం చేస్తున్నారు. ఎందుకు చనిపోయాడన్నది ఈ రిపోర్ట్ ఆధారంగానే తెలిసే అవకాశాలన్నాయి. అయితే...ఇందుకు కనీసం 30 రోజుల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. ట్రాపర్‌ మ్యాథ్స్ జీనియస్‌ అని, ఇలా అయిపోతాడని అనుకోలేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. బెర్కెలీ యూనివర్సిటీలో సెకండ్ సెమిస్టర్ చదువుతున్నాడని వెల్లడించారు.