Anantapuram Political News: సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కుటుంబం.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితులు బిఎన్‌ఆర్ అన్నదమ్ములు. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో తిరుగులేని కుటుంబం. ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా విజయం వారిదే అన్నట్టుగా అనంతపురంలో సాగేది. అది గతం.. ప్రస్తుతం టికెట్ కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు ఎందుకు బిఎన్నార్ అన్నదమ్ములకు ఈ పరిస్థితి వచ్చింది.
అనంతపురం ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుంచి బి నారాయణ రెడ్డి 3సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1989, 1999, 2004 ఎన్నికల్లో వరుసగా విజయం సాధించారు. నారాయణరెడ్డి ఆరోగ్య పరిస్థితుల వల్ల 2009లో నారాయణరెడ్డి సోదరుడు గుర్నాథ్ రెడ్డికి కాగ్రెస్ పార్టీలో చోటు కల్పించారు. గుర్నాథ్ రెడ్డి అనుకున్నట్లుగానే 2009లో అనంతపురం అర్బన్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. అనంతరం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మృతి చెందిన తర్వాత రాష్ట్రంలో అనుకొని రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. జగన్ పార్టీ పెట్టిన అనంతరం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి గురునాథ్ రెడ్డి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ తరపున ఉపఎన్నికల్లో పోటీ చేశారు. అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. అనంతరం 2014 ఎన్నికల్లో గురునాథ్ రెడ్డి ఓటమి చవిచుశారు.
అనంతపురం జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా బిఎన్ఆర్ కుటుంబం ఉండేది. రాజశేఖర్ రెడ్డి మరణం అనంతరం జగన్ మోహన్ రెడ్డితో కలిసి నడిచారు. రాజకీయాలు ఎప్పుడు ఎలా ఉంటాయో ఎటువంటి టర్న్ తీసుకుంటాయో తెలియని పరిస్థితి. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉంటూ గురునాథ్ రెడ్డి టిడిపి కండువా కప్పుకున్నారు. అక్కడ కొనసాగలేక మళ్లీ సొంతగూటికి వచ్చేశారు.
ప్రస్తుతం ఎన్నికల సమీపిస్తుండడంతో ఈసారి ఎలాగైనా అనంతపురం వైసీపీ నుంచి బరిలోకి దిగేందుకు గుర్నాథ్ రెడ్డి పావులు కదుపుతున్నారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో బిఎన్ఆర్ కుటుంబానికి పటిష్టమైన క్యాడర్ ఉంది. గురునాథ్ రెడ్డి సోదరుడు ఎర్రిస్వామిరెడ్డి అనంతపురం రాజకీయాల్లో తెర వెనక కీలక భూమిక పోషిస్తుంటారని నాయకులు చర్చించుకుంటున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి నుంచి టికెట్ దక్కించుకోవాలని బిఎన్నార్ సోదరులు జోరుగానే ఎత్తుగడలు వేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం అనంతపురం అర్బన్ ఎమ్మెల్యేగా అనంత వెంకట్రామిరెడ్డి కొనసాగుతున్నారు.
Also Read: 25 ఎమ్మెల్యే సీట్లు, రెండు ఎంపీ స్థానాలు- ఏమంటారు? చంద్రబాబు, పవన్ చర్చల్లో ఇదే హైలెట్
Also Read: ఈ నెల 20న నారా లోకేశ్ 'యువగళం' ముగింపు సభ - హాజరుకానున్న టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్