Force Motors Gurkha 5 Door Review: భారత్‌కు చెందిన ప్రముఖ కమర్షియల్ వాహనాల తయారీదారు ఫోర్స్ మోటర్స్ (బజాజ్ టెంపో మోటర్స్) గుర్ఖా పేరుతో ఓ ఎస్‌యూవీని లాంఛ్ చేసిన సంగతి తెలిసిందే. ఆటో పరిశ్రమలో ఉన్న అన్ని ఎస్‌యూవీలతో పోలిస్తే గుర్ఖా మాత్రం చాలా ప్రత్యేక కనబర్చింది. దీని లాకింగ్ డిఫరెన్షియల్స్, గ్రౌండ్ క్లియరెన్స్‌తో బీస్ట్ తరహాలో ఉండి.. ఇది ఇతర ఎస్‌యూవీల కంటే మరింత ఎత్తుగా కనిపిస్తోంది. 


దీని 700 ఎంఎం వాటర్ వాడింగ్ కెపాసిటీతో చాలా సునాయసంగా వర్షాలు భారీగా ఉన్నప్పుడు కూడా వెళ్లవచ్చు. పైగా ఇది చూసేందుకు చాలా బాగుండడమే కాకుండా.. 5-డోర్స్‌తో ఈ గుర్ఖా మరింత భారీగా కనిపిస్తుంది. ఈ కొత్త గూర్ఖా గత మోడల్స్‌తో పోల్చితే బాగా మెరుగుపర్చినట్లుగా కంపెనీ చెబుతోంది. పైగా ఇప్పుడు 5-డోర్ వెర్షన్ లో మరింత స్పేస్ ఉంది. బేసిక్స్ పరంగా ఇది ఇప్పుడు మరింత మెరుగైన కారు అని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. 




ధర ఎంతంటే..
దీని ధర రూ.18 లక్షల రేంజ్ లో ఉంది. ఈ రేంజ్ అంటే గూర్ఖా 5-డోర్ కారు అంత చౌక ఏం కాదు. కానీ, దీని షీర్ లుక్స్ బీస్ట్ లాంటి వాహనం, పైగా ఫీచర్ల కోసం ఆ ధర సబబుగాన ఉందని అంటున్నారు. ఈ రేంజ్‌లో దీని రైవల్ మోడల్స్ కంటే మరింత ప్రత్యేకంగా కనిపిస్తోంది. గూర్ఖాక 18 - ఇంచ్‌ల వీల్స్, జాక్ అప్ 233mm గ్రౌండ్ క్లియరెన్స్‌తో పాటు స్నార్కెల్‌ దీన్ని బీస్ట్‌గా మార్చాయి. ఇది మన రోడ్లపై అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఫోర్స్ మోటార్స్ 140 బీహెచ్‌పీ, 320 Nm టార్క్ తో ఇంజిన్ ను మరింత మెరుగుపర్చి, గత మోడల్స్‌లో ఎదుర్కొన్న సమస్యలను కూడా పరిష్కరించింది. పైగా దీని క్లచ్‌ కూడా ట్రాఫిక్ జామ్ సందర్భాల్లో చాలా సులభంగా ఉన్నట్లుగా చెబుతున్నారు.


5-స్పీడ్ మాన్యువల్ వేరియంట్ లో క్లచ్ చాలా లైట్ గా ఉంటుంది. ఇక ఇంజిన్ సౌండ్ కాస్త ఎక్కువే. గేర్లు లాంగ్ త్రో కలిగి ఉంటాయి. స్టీరింగ్ వీల్ కూడా కమర్షియల్ వెహికిల్స్ తరహాలో చాలా పెద్దగా ఇచ్చారు. టార్క్ మాత్రం పుష్కలంగా ఉంది. మెరుపర్చిన మార్పుల కారణంగా ఈ కొత్త ఫోర్స్ గూర్ఖా ఇప్పుడు గతంలో కంటే బాగా ప్రయాణిస్తుందని కంపెనీ చెబుతుంది. వేగం, రిలాక్సింగ్ విషయాల్లో చాలా మార్పులు చేసినట్లు చెబుతున్నారు. మైలేజీ మాత్రం లీటరుకు 15 కిలో మీటర్లు అని కంపెనీ చెబుతోంది.




గుర్ఖా ఫీచర్స్ 
ఇక డ్రైవింగ్ పొజిషన్ బస్ డ్రైవర్ల మాదిరిగానే కాస్త ఎత్తులోనే ఉండేలా ఉంది. తద్వారా రోడ్డుపై విజన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంతకుముందు గూర్ఖాలో ఇన్‌సైడ్ ఫ్యూయల్ లిడ్ ఓపెనర్, డెడ్ పెడల్, రేర్ కెమెరా, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే వంటివి లేవు. కానీ, కొత్త దాంట్లో అవన్నీ పొందుపర్చారు. ఇది పవర్డ్ మిర్రర్‌లను కూడా కలిగి ఉంది. సన్ రూఫ్, హీట్ సీట్ల విషయంలోనూ వినియోగదారులు సంతృప్తి చెందుతారని అంటున్నారు. కానీ, ఆటోమెటిక్ వేరియంట్లో మరిన్ని ఫీచర్స్ జోడించి ఉండాల్సిందన్న అభిప్రాయం ఉంది. దాంట్లో 6 ఎయిర్‌బ్యాగ్స్ కూడా ఉండే బాగుంటుందన్న వాదన ఉంది. 


5-డోర్ అంటే వెనుక వైపు డోర్ తీసి అక్కడున్న సీట్లలో కూర్చోవచ్చు. ఇది చాలా సులభంగా ఉంటుంది. హెడ్‌రూమ్ లో రూఫ్ బ్లోవర్‌తో పాటు సెకండ్ రో ను కూడా బాగా చల్లబరుస్తుంది. కానీ, నీ రూం (Knee Room) స్పేస్ తక్కువగా ఉంది. కానీ, ఆర్మ్‌రెస్ట్‌ ఇచ్చారు. అయినా పొడవు ఎక్కువగా ఉన్న వ్యక్తులకు కాస్త ఇబ్బందే. మూడో వరుస సీట్లలోకి ప్రవేశించడం.. రేర్ డోర్ ద్వారా మాత్రమే ఉంటుంది. రేర్ సీట్స్ ను వాడితే లగేజీ స్పేస్ వాడుకోలేకుండా ఉంది.


ఇది కూల్ లుక్స్‌తో, బీభత్సమైన బేసిక్స్ తోఆఫ్-రోడ్ విషయంలో కూడా గూర్ఖా ఇప్పుడు మరింత మెరుగ్గా ఉందని ఆటోమొబైల్ పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇది నిజమైన ఎస్‌యూవీ లవర్స్‌ అంచనాలకు మాత్రం అందుకోలేకపోయిందని అభిప్రాయం ఉంది. ఇది అధిక ఫీచర్లను ఇంకా ఆటోమేటిక్‌ ఫీచర్స్ కూడా అందించదు. అందువల్ల, ఇది ఇప్పటికీ హార్డ్‌కోర్ ఆఫ్-రోడర్ మాత్రమే అని అంటున్నారు. కానీ, ఫ్యామిలీ మొత్తం ప్రయాణించడానికి మాత్రం ఈ ఫోర్స్ మోటర్స్ వారి గుర్ఖా మంచిదని అంటున్నారు.