Florida Man Walked Without Clothes: 



ఫ్లోరిడాలో ఘటన..


ఆమిర్ ఖాన్ పీకే సినిమా చూసే ఉంటారుగా. వేరే గ్రహం నుంచి భూమి మీదకు వచ్చి రోడ్లపై నగ్నంగా తిరుగుతుంటాడు. అదంటే సినిమా కాబట్టి చెల్లింది. ఇప్పుడు నిజంగానే ఓ వ్యక్తి ఇలా రోడ్లపై నగ్నంగా తిరుగుతూ కనిపించాడు. ఇది చూసి స్థానికులు షాక్ అయ్యారు. ఇదేంటని ఆ వ్యక్తిని ప్రశ్నిస్తే "నేను వేరే గ్రహం నుంచి వచ్చాను" అని సమాధానమిచ్చాడు. ఇది విని ఇంకా కంగు తిన్నారు స్థానికులు. ఫ్లోరిడాలోని పామ్‌ బీచ్‌ ప్రాంతంలో మార్చి 8న జరిగిన ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 44 ఏళ్ల ఓ వ్యక్తి ఇలా నగ్నంగా రోడ్లపై తిరిగినట్టు అక్కడి మీడియా వెల్లడించింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. రకరకాల ప్రశ్నలు అడిగారు. ఎందుకిలా చేస్తున్నావని అడిగితే "నా బట్టలు ఎక్కడ విడిచిపెట్టానో నాకే తెలియదు" అని సమాధానమిచ్చాడు. వ్యక్తిగత వివరాలు అడిగినా చెప్పలేదు. అంతే కాదు. తన వద్ద ఎలాంటి ఐడెంటిటీ కార్డ్ లేదని, తాను వేరే గ్రహం నుంచి వచ్చానని చెప్పాడు. ఏం చేయాలో అర్థం కాక పోలీసులు పామ్  బీచ్‌ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విచారించిన తరవాత అతడి పేరు జాసన్ స్మిత్ అని తేలింది. పామ్‌ బీచ్‌లోనే తాను నివాసం ఉంటున్నట్టు వెల్లడించాడు. అతడి మూడు క్రిమినల్ కేసు నమోదు చేశారు. 


యూపీలోనూ..


ఇటీవల యూపీలోని రాంపూర్‌లో ఓ మహిళ రాత్రంతా నగ్నంగా రోడ్లపై తిరగడం సంచలనం సృష్టించింది. ఈ తిరిగే క్రమంలో కనబడిన తలుపునల్లా కొడుతూ పోయింది. కాలింగ్ బెల్‌ కొడుతూ అర్ధరాత్రి పూట అందరినీ డిస్టర్బ్ చేసింది. ఇది గమనించిన ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఆ మహిళను గుర్తించారు. సోషల్ మీడియాలోనూ ఈ ఘటన వైరల్ అవుతోంది. రాంపూర్‌కు చెందిన ఓ మహిళ రోడ్లపై రాత్రి పూట నగ్నంగా తిరుగుతున్నట్టు తెలిపారు. ఆ మహిళను గుర్తించిన పోలీసులు ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఆమెకు మతిస్థిమితం లేదని విచారణలో తేలింది. దాదాపు 5 ఏళ్లుగా ఆమెకు బరేలిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్టు కుటుంబ సభ్యులు వివరించారు. ఆమెను జాగ్రత్తగా చూసుకోవాలని, రాత్రి పూట ఇంట్లోనే ఉండేలా చూడాలని కుటుంబ సభ్యులను మందలించారు పోలీసులు. రాంపూర్‌లోని మాలిక్ గ్రామంలో ఆమె రోడ్లపై తిరుగుతున్నట్టు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. అంతకు ముందు ట్విటర్‌లో పోస్ట్ చేశారు పోలీసులు. ఆ మహిళను ఎవరు గుర్తించినా వెంటనే సమాచారం అందించాలని కోరారు. చివరకు ఆమెను గుర్తించారు. పోలీస్ పాట్రోలింగ్ సరిగా లేకపోవడం వల్లే ఇలాంటివి జరుగుతున్నాయంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అర్ధరాత్రి పూట ఆ మహిళ చాలా మందిని డిస్టర్బ్ చేసిందని అన్నారు. 


Also Read: Same Gender Marriage: స్వలింగ వివాహాలకు గుర్తింపునివ్వడం కుదరదు, సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్