దీపావళికి ముందు దిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్నిరకాల బాణసంచాల అమ్మకాలు, స్టోరేజీపై పూర్తిస్థాయి బ్యాన్ విధించింది. ఈ మేరకు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ట్వీట్ చేశారు.
ట్రేడర్లు బాణసంచాను నిల్వ చేసుకోవద్దని ఈ సందర్భంగా సీఎం సూచించారు. గతేడాది స్టోరేజీ చేసుకోవడం వల్ల వ్యాపారులు నష్టపోయారని గుర్తుచేశారు.
ఈ ఏడాది నవంబర్ 4న దీపావళి జరుపుకోనున్నారు. దిల్లీలో కాలుష్యాన్ని తగ్గించేందుకు ఆప్ సర్కార్ వివిధ చర్యలు చేపడుతోంది. ముఖ్యంగా శీతాకాలంలో దిల్లీలో కాలుష్యం మరింత ఎక్కువ ఉంటుంది. ఈ నేపథ్యంలో కాలుష్య నివారణ, వాయుకాలుష్యం పెరగడంపై వివిధ ఏజెన్సీలతో పలు నివేదికలు దిల్లీ ప్రభుత్వం తెప్పించుకుంది.
వీటిని పరిశీలించిన అనంతరం కాలుష్యాన్ని తగ్గించేందుకు పూర్తి స్థాయి ప్లాన్‌ను విడుదల చేస్తామని దిల్లీ ఆరోగ్య మంత్రి వెల్లడించారు.