Father's Day 2024: ఫాదర్స్‌డే వచ్చేస్తోంది. మీ నాన్నకి ఏం గిఫ్ట్ ఇద్దాం (Father's Day 2024) అనుకుంటున్నారు..? ఇప్పటికే ఏదో ప్లాన్ చేసే ఉంటారు. కానీ...ఎప్పుడూ ఏదో గిఫ్ట్ ఇచ్చే బదులు ఈ సారి కొత్తగా ఏమైనా చేయాలని ఆలోచిస్తున్నారా...అయితే తప్పకుండా ఇది మీ కోసమే. ఆరోగ్యమే మహాభాగ్యం (Father's Day 2024 Gift Ideas) అని మనం చాలా సార్లు చాలా సందర్భాల్లో గుర్తు చేసుకుంటూనే ఉంటాం. మరి నాన్నకి ఆ ఆరోగ్యాన్నే గిఫ్ట్‌గా ఇస్తే ఎలా ఉంటుంది. అవును. పిల్లల కోసం కష్టపడే క్రమంలో తన (Happy Father's Day 2024) గురించి తన ఆరోగ్యం గురించీ నాన్న పెద్దగా ఆలోచించడు. "నాకేమైంది బాగానే ఉన్నా కదా" అని సింపుల్‌గా కొట్టి పారేస్తాడు. 40 ఏళ్లు దాటితే అన్ని రోగాలూ వచ్చి మీద పడిపోతున్న రోజులివి. ఎప్పుడు ఎలాంటి జబ్బు పట్టి పీడిస్తుందో తెలియదు. అందుకే ఈ సారి ఫాదర్స్‌ డే గిఫ్ట్‌గా మీ నాన్నకి హెల్త్ చెకప్ చేయించండి. నాన్న ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోండి. ఎంత విలువైన గిఫ్ట్ ఇచ్చినా ఇది వాటి సాటి రాదని గుర్తుంచుకోండి. 


ఏం టెస్ట్‌లు చేయిస్తే బాగుంటుంది..? 


ఇప్పుడున్న లైఫ్‌ స్టైల్‌ కారణంగా ఎలా పడితే అలా తినేస్తున్నాం. వయసులో ఉన్నప్పుడు ఏమీ తెలియదు కానీ 50 ఏళ్లు దాటాయంటే ఆ ప్రభావం కనిపిస్తుంది. కొలెస్ట్రాల్‌ శరీరంల పేరుకుపోతూ ఉంటుంది. అది ఒకేసారి ఎఫెక్ట్ చూపిస్తుంది. అందుకే మీ నాన్నకి మొట్ట మొదట మీరు చేయించాల్సింది Cholesterol Test. ఈ కొవ్వు కారణంగానే గుండె జబ్బులు వచ్చి ఏటా కోటి 70 లక్షల మంది చనిపోతున్నారని అంచనా. అందుకే ఈ లిపిడ్ ప్రొఫైల్ చేయించాలి. అంటే ఇందులో ట్రైగ్లిజరైడ్స్ లెవెల్స్ ఎలా ఉన్నాయో తెలుస్తుంది. HDL, LDL కొలెస్ట్రాల్‌ ఎంత ఉందో ఈ టెస్ట్‌లో తెలిసిపోతుంది. ఆ మేరకు జాగ్రత్తలు తీసుకోవచ్చు. కొలెస్ట్రాల్‌ టెస్ట్‌తో పాటు బీపీ కూడా చెక్ చేయించాలి. లోబీపీ ఉన్నా హైబీపీ ఉన్నా ప్రమాదమే. 



ఇవి కూడా..


ఇక అత్యంత ముఖ్యమైంది Bone density test. 50 ఏళ్లు పైబడ్డాయంటే ఎముకల అరుగుదల మొదలవుతుంది. అందుకే మీ నాన్నకి తప్పనిసరిగా ఈ టెస్ట్ చేయించాలి. ఎముకల్లో కాల్షియం తగ్గిపోతే క్రమంగా అవి అరిగిపోయి విరిగిపోయే ప్రమాదముంది. అందుకే ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. బోన్ టెస్ట్ చేయాలంటే dual-energy X-ray తీయించాలి. వెన్నెముకతో పాటు తుంటి ఎముకలనూ పరీక్షిస్తారు. డెంటల్ చెకప్ కూడా తప్పనిసరి. Oral Hygine పాటిస్తే చాలా మంచిది అని వైద్యులు తరచూ చెబుతుంటారు. ఏళ్లు పెరిగే కొద్ది పళ్లు పుచ్చిపోవడం, వదులు కావడం లాంటి సమస్యలు వస్తాయి. ఇలాంటి వాటిని నిర్లక్ష్యం చేస్తే అవే రేపు పెద్ద ముప్పుగా మారతాయి. బీపీ టెస్ట్‌తో పాటు డయాబెటిస్ టెస్ట్ తప్పనిసరి. ఈ జబ్బుని ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. కళ్ల పరీక్ష కూడా చేయించాలి. ఇక ముఖ్యమైన టెస్ట్‌లలో మరోటి ప్రోస్టేట్ క్యాన్సర్ టెస్ట్. వయసు పెరిగే కొద్ది ప్రొస్టేట్ గ్రంథులు వ్యాకోచిస్తుంటాయి. ఇది సహజమేనా లేదంటే ఏదైనా సమస్యతో ఇలా అవుతోందా అన్నది కచ్చితంగా చెక్ చేయించాలి. నిర్లక్ష్యం చేస్తే యూరినరీ సమస్యలు వస్తాయి. థైరాయిడ్, కంప్లీట్ బ్లడ్ కౌంట్, యూరిన్ అనాలసిస్ లాంటి పరీక్షలు చేయించడం ఇంకా మంచిది. 


Also Read: Fathers Day Gift Ideas: ఫాదర్స్ డే వచ్చేస్తోంది.. ఎప్పుడో తెలుసా? ఈ గిఫ్టులతో నాన్నను సర్‌ప్రైజ్‌ చెయ్యండి