ATM Cash Withdrawal Fees: ATM నుంచి డబ్బులు డ్రా చేయాలనుకునే వారికి షాక్ తగలనుంది. ఊహించని స్థాయిలో ఛార్జీల మోత మోగనుంది. ఇంటర్‌చేంజ్ ఫీ పెంచాలని కోరుతూ ATM ఇండస్ట్రీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి అర్జీ పెట్టుకుంది. RBI తోపాటు National Payments Corporation of India (NPCI) కీ విజ్ఞప్తి చేసింది. కస్టమర్స్ ATM నుంచి డబ్బు విత్ డ్రా చేసిన ప్రతిసారీ ఈ ఛార్జీల బాదుడు తప్పదు. అంటే...ప్రతి లావాదేవీకి రూ.23 మేర ముక్కు పిండి వసూలు చేస్తారు. సాధారణంగా మనం ఓ బ్యాంక్ నుంచి ATM కార్డ్ తీసుకుంటాం. మనకు అందుబాటులో మరో బ్యాంక్ ATM ఉంటుంది. అక్కడికి వెళ్లి మనీ డ్రా చేసుకుంటాం. ఈ సర్వీస్ అందించినందుకు కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. దీన్నే Interchange fees అంటారు. ప్రస్తుతానికి బ్యాంకులు సేవింగ్స్ అకౌంట్ ఉన్న వారికి 5 లావాదేవీల వరకూ ఎలాంటి చెల్లింపులు లేకుండానే మనీ డ్రా చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నాయి. అదే వేరే బ్యాంక్ ATM నుంచి అయితే మూడు లావాదేవీల వరకూ ఉచితంగా సర్వీస్‌ అందిస్తుంది. ఆ తరవాత నుంచి బాదుడు మొదలవుతుంది. ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్, కోల్‌కత్తా, ముంబయి, బెంగళూరులో ఇది అమల్లో ఉంది. అయితే...ఇప్పుడు ఈ ఫీని పెంచాలని ATM ఇండస్ట్రీ వాళ్లు కోరుతున్నారు. 


రెండేళ్లి క్రితం చివరిసారి ఈ ఇంటర్‌చేంజ్ ఫీ పెంచారు. అందుకే ఈ సారి ఈ రుసుముని రూ.21 పెంచాలని కొందరు రిక్వెస్ట్ చేస్తుండగా మరి కొందరు మాత్రం దీన్ని రూ.23కి పెంచాలని కోరుతున్నారు. గతంలో ఈ రుసుము పెంచాలంటే ఏళ్ల పాటు ఆలోచించే వాళ్లని కానీ ఇప్పుడు ఆ స్థాయిలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదని తేల్చి చెబుతున్నారు. 2021లో ATM లావాదేవీలపై ఇంటర్‌చేంజ్ ఫీ రూ.15 నుంచి రూ.17కి పెంచారు. గరిష్ఠంగా ఒక్కో కస్టమర్‌ నుంచి రూ.20-21 వరకూ వసూలు చేసుకునే వెసులుబాటు కల్పించారు. 


Also Read: Kuwait Fire Tragedy: కువైట్‌ అగ్ని ప్రమాదం - బిల్డింగ్‌ ఓనర్‌ని అరెస్ట్‌ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు