Fathers Day 2024 Gift Ideas: ఈ ప్రపంచంలో నాన్న ఇచ్చినంత సపోర్ట్ ఎవరి దగ్గర దొరకదు. చిన్నప్పటి నుంచి మీరు ఉద్యోగం చేస్తూ జీవితంలో స్థిరపడేంత వరకు నాన్న మీకు ప్రతిచోటా సపోర్టుగా నిలుస్తుంటారు. మీరు వేసే ప్రతీ అడుగులోనూ ఆయన అండగా నిలుస్తారు. అన్నివేళలోనూ వెన్నుతట్టి ముందుకు నడిపిస్తూ వెన్నుదన్నుగా ఉంటారు. వయస్సులో ఎంత ఎదిగినా.. జీవితంలో అడుగుదొడుకులు ఎదుర్కొంటున్న సమయంలో మనకు అండగా నిలుస్తాడు. మన లక్ష్యాలను సాధించేంత వరకు మన వెనకాలే ఉంటారు. అమ్మ మనపై ప్రేమ చూపిస్తే... నాన్న తన భుజాలపై మన బాధ్యతలను మోస్తుంటాడు. ఎక్కడ కిందపడితారేమోనని జాగ్రత్త పడుతుంటారు. నువ్ తప్పటడుగులు వేయకుండా మనకు కావాల్సినవన్నీ అందిస్తుంటాడు. మనం కనే కలలను నాన్న నిజం చేస్తుంటాడు. అమ్మగా లాలించడం తెలుసు.. గురువుగా పాఠాలు నేర్పడం తెలుసు. అలాంటి నాన్నకు ఫాదర్స్ డే రోజు మీరు ఇచ్చే బహుమతి ప్రత్యేకంగా ఉండాలి. ఫాదర్స్ డే సందర్భంగా తేదీ, చరిత్ర, గురించి తెలుసుకుందాం. 


తేదీ:


ఫాదర్స్ డే రోజు జరుపుకునేందుకు తేదీ అంటూ ప్రత్యేకంగా ఏమీ లేదు. చాలా దేశాలు జూన్ లో ఏదొక ఆదివారం జరుపుకుంటారు. మన దేశంలో మాత్రం ఫాదర్స్ డే ను జూన్ 16న జరుపుకోనున్నారు. క్రొయేషియా, ఇటలీ, పోర్చుగల్, స్పెయిన్ వంటి దేశాల్లో, ఫాదర్స్ డే మార్చి 19న జరుపుకుంటారు. థాయిలాండ్‌లో, మాజీ రాజు భూమిబోల్ అదుల్యదేజ్ పుట్టినరోజు అయిన డిసెంబర్ 5న ఫాదర్స్ డే వేడుకలు జరుగుతుండగా, తైవాన్ లో ఆగస్టు 8న  ఈ వేడుకను జరుపుకుంటారు. 


చరిత్ర:


ఫాదర్స్ డే వెనక కథ గురించి చూస్తే.. 1908వ సంవత్సరంలో వెస్ట్ వర్జీనియాలోని ఫెయిర్ మౌంట్ లో జరిగిన మైనింగ్ ప్రమాదంలో 362 మంది పురుషులు మరణించారు. వారి  జ్ఞాపకార్థం ఈ ఫాదర్స్ డేను జరుపుకుంటున్నారు. సోనోరాకి ఐదుగురు తోబుట్టువులు. ఆమె తల్లి ప్రసవంలోనే మరణించింది. అప్పటి నుంచి ఆమె తండ్రి సోనోరా, ఆమె తోబుట్టువులను ప్రేమతో పెంచారు. 1909లో సోనోరా మదర్స్ డే సందర్భంగా ఒక స్పీచ్ విన్నది. అప్పుడే ఆమెకు తండ్రి కూడా తల్లిలా అన్ని సేవలు చేయడం గుర్తుకు వచ్చింది. తన తండ్రి నిస్వార్థ సేవకు చిహ్నంగా ఫాదర్స్ డే జరుపుకోవాలనుకుంది. దీంతో స్థానిక మత పెద్దలను కలిసి మాట్లాడింది. వారి సహాయం తీసుకుని 1910లో జూన్ 19వ తేదీన ప్రపంచంలో మొదటిసారిగా ఫాదర్స్ డేను జరుపుకున్నారు. జూన్ సోనోరా తండ్రి పుట్టినరోజు. ఈ కల్చర్ కాస్త నెమ్మదిగా విస్తరించింది. 1972లో అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ ఫాదర్స్ డే ను జాతీయ సెలవురోజుగా ప్రకటించాడు. జూన్ మూడో ఆదివారం ఫాదర్స్ డే జరుపుకోవాలని పేర్కొంటూ చట్టంపై సంతకం చేశారు. 


మీ నాన్నకు ఈ బహుమతులు ఇవ్వండి: 


⦿ గౌర్మెట్ గిఫ్ట్ బాస్కెట్
⦿ హెడ్‌ఫోన్‌లు
⦿ స్మార్ట్ వాచ్
⦿ స్మార్ట్ హోమ్ డివైజులు
⦿ సన్ గ్లాసెస్
⦿ రిలాక్సేషన్ కిట్
⦿ బెల్ట్
⦿ పెర్ఫ్యూమ్
⦿ ట్యాబ్
⦿ స్మార్ట్ ఫోన్
⦿ వాకింగ్ షూస్ 


ఇలా శుభాకాంక్షలు తెలియజేయండి: 


❤ నాన్న మీరే నా సూపర్ హీరో..ఐ లవ్ యూ నాన్న..హ్యాపీ ఫాదర్స్ డే 


❤ నాన్నా...నా మొదటి గురువు, నా బెస్ట్ ఫ్రెండ్ మీరు..హ్యాపీ ఫాదర్స్ డే 


❤ మనం తినే తిండి, కట్టుకునే బట్ట, చదివే చదువు..తనవల్లే వచ్చాయని ఒక్కరోజు కూడా భావించని ప్రత్యక్షదైవమే నాన్న..హ్యాపీ ఫాదర్స్ డే. 


❤ ఓడినప్పుడు ప్రపంచమంతా నీకు వ్యతిరేకంగా ఉన్నా నేనున్నా అంటూ ధైర్యం చెప్పే ఒకే ఒక వ్యక్తి నాన్న. ఫాదర్స్ డే శుభాకాంక్షలు. 


❤ ఓర్పుకు, సహనానికి మారుపేరు నాన్న.. హ్యాపీ ఫాదర్స్ డే


❤ దేవుడు నాకు ఇచ్చిన గొప్ప బహుమతి నాన్న. మీరెప్పుడూ సంతోషంగా ఉండాలి. హ్యాపీ ఫాదర్స్ డే. 


Read Also: నాన్​వెజ్​ ఎక్కువగా తింటున్నారా? అయితే మీ లివర్ మటాషే.. న్యూ స్టడీలో షాకింగ్ విషయాలు