Pakistan FATF Grey List:


గ్రే లిస్ట్‌ నుంచి తొలగింపు..


ఉగ్రవాదులకు నిధులు అందిస్తోందన్న ఆరోపణలు ఎదుర్కొంటూ...దాదాపు నాలుగేళ్లుగా Financial Action Task Force (FATF) గ్రే లిస్ట్‌కి పరిమితమైంది పాకిస్థాన్. అప్పటి నుంచి ఆ దేశానికి కష్టాలు మొదలయ్యాయి. తమపై కక్ష కట్టి ఇలా ఇబ్బందులు పెడుతున్నారని పాకిస్థాన్ ఎన్నో సార్లు అసహనం వ్యక్తం చేసింది. ఈ లిస్ట్‌లో ఉన్న దేశానికి IMF రుణం అందించదు. ఆర్థికంగా ఏ దేశమూ సహకారం అందించేందుకు
ముందుకు రాదు. ఫలితంగా...నాలుగేళ్లుగా ఆర్థికంగానూ దెబ్బ తింది దాయాది దేశం. ఇన్నాళ్లకు కాస్త ఊరట లభించింది. పారిస్‌లో జరిగిన FATF సమావేశంలో పాకిస్థాన్‌ను Gray List నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించారు. ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఆ దేశానికి ఇది పెద్ద రిలీఫ్‌ ఇవ్వనుంది. కానీ...ఈ నాలుగేళ్ల కాలంలో ఆ దేశం చాలానే కోల్పోయింది. దాదాపు రూ.3 లక్షల కోట్ల ఆర్థిక నష్టాల్ని చవి చూసింది. అసలే ఆర్థిక మాంద్యంలో ఉన్న దేశం ఆ స్థాయిలో నష్టపోతే పరిస్థితులు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. 2018లో పాకిస్థాన్‌ను గ్రే లిస్ట్‌లో చేర్చారు. ఆసియా పసిఫిక్‌ గ్రూప్‌తో కలిసి పని చేస్తూ...మనీ లాండరింగ్‌ను అరికట్టడం, ఉగ్రవాదులకు నిధులు అందించడంపై నిఘా ఉంచడం లాంటి చర్యలతో ఈ గ్రే లిస్ట్ నుంచి పాక్‌ను తొలగిస్తున్నట్టు FATF వెల్లడించింది. ఈ వార్త తెలిశాక పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ (Shebaz Sharif)  ట్విటర్ వేదికగా ఆనందం వ్యక్తం చేశారు. "ఇన్నేళ్లుగా పాకిస్థాన్ పడ్డ కష్టం వృథా కాలేదు. ఈ విజయానికి కారణమైన సివిల్, మిలిటరీ లీడర్‌షిప్‌కు అభినందనలు. మీ అందరికీ శుభాకాంక్షలు" అని ట్వీట్ చేశారు. 






ఎంత నష్టం జరిగిందంటే..


1. గ్రే లిస్ట్‌లో ఉండటం వల్ల పాకిస్థాన్ ఏటా 10 బిలియన్ డాలర్ల మేర నష్టపోవాల్సి వచ్చింది. 
2. ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే ఈ నష్టం విలువ రూ.75 వేల కోట్లు. 
3. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి పాకిస్థాన్ మొత్తంగా రూ.3 లక్షల కోట్లు నష్టపోయింది. 


ఎందుకు గ్రే లిస్ట్‌లో ఉంచారు..? 


ఉగ్రవాదంపై ప్రత్యేక నిఘా ఉంచటం FATF విధి. వాళ్లకు నిధులు ఎక్కడి నుంచి అందుతున్నాయో పసిగడుతుంది ఈ సంస్థ. 2018లో పాకిస్థాన్‌ ఉగ్రవాదులకు పెద్ద ఎత్తు నిధులు అందించిందన్న కారణంతో గ్రే లిస్ట్‌లో చేర్చింది. ఈ కారణంగా...పాకిస్థాన్‌కు ఎవరూ రుణాలు అందించ లేదు. IMF,ప్రపంచ బ్యాంక్, ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్,ఐరోపా సమాఖ్య సంస్థలు పాకిస్థాన్‌కు లోన్ ఇవ్వలేదు. ఇప్పుడు గ్రే లిస్ట్‌లో నుంచి తొలగించటం వల్ల ఆ సంస్థల నుంచి ఆర్థిక సహకారం పొందనుంది పాక్. 


Also Read: Supreme Court on Hate Speech : మతం పేరుతో ఎటువెళ్తున్నాం, రెచ్చగొట్టే ప్రసంగాలపై సుప్రీం కీలక వ్యాఖ్యలు