రాష్ట్రంలో ఉన్నత విద్య పరీక్ష విధానంలో గుణాత్మక మార్పులు చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ)తో రాష్ట్ర ఉన్నత విద్యామండలి, కమిషరేట్ ఆఫ్ కాలేజీయేట్ ఎడ్యుకేషన్ అక్టోబరు 21న ఓ అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. విద్యార్థి నైపుణ్యాన్ని పరీక్షించేందుకు నిర్వహించే పరీక్ష విధానం భవిష్యత్‌లో అతనికి గుర్తింపునిచ్చేదిగా, ఉపాధికి బాటలు వేసే విధంగా ఉండాలన్నదే ఈ ఎంవోయు లక్ష్యమని ఉన్నత విద్య మండలి పేర్కొంది.
ఇప్పుడున్న పరీక్షల విధానంలో తీసుకురావాల్సి మార్పులపై ఐఎస్‌బీ అధ్యయనం చేసి, ఆరు నెలల్లో నివేదిక ఇవ్వనుంది. విద్యార్థి నైపుణ్యాన్ని అంచనా వేయడానికి అవసరమైన పరీక్షలు ఎలా ఉండాలనేది క్షేత్రస్థాయి అధ్యయనం ద్వారా తెలుసుకోబోతున్నారు. అంతర్గత పరీక్షలతో సహా కాలేజీ విద్యలో జరిగే అన్ని పరీక్షల విధానాలను పరిశీలించి, సరికొత్త ఫ్రేమ్‌వర్క్‌తో కొన్ని సిఫార్సులు చేయాలని ఒప్పందంలో పేర్కొన్నారు. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా విద్యార్థి నైపుణ్యాన్ని ఎలా అంచనా వేయాలనేది సూచిస్తుంది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాలేజీయేట్ విద్య కమిషనర్ నవీన్ మిట్టల్ మాట్లాడుతూ.. నూతన ఆలోచన విధానం, భవిష్యత్ మార్పుల విషయంలో తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉందని, తాజా ఎంవోయు ఇందుకు నిదర్శనం అని అన్నారు. విద్యావిధానంలో విద్యార్థి నైపుణ్యతను సరికొత్తగా వెలికి తీసేందుకు అధ్యయనం తోడ్పడుతుందని ఆయన తెలిపారు.
ఉన్నత విద్యామండలి ఛైర్మన ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి మాట్లాడుతూ.. ప్రస్తుత పరీక్ష, మూల్యాంకన విధానంలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. మంచి మార్కులు సాధించిన విద్యార్థి కూడా ఉపాధి విషయంలో సవాళ్ళు ఎదుర్కొంటున్నారని తెలిపారు. విద్యార్థుల్లోని లోతైన ఆలోచన విధానాన్ని, సమస్యలు పరిష్కరించే సామర్థ్యాన్ని అంచనా వేయాలని భావిస్తున్నామని, కానీ ప్రస్తుతం ఉన్న పరీక్ష విధానంలో వారి జ్ఞాపకశక్తిని మాత్రమే అంచనా వేస్తున్నామని తెలిపారు. ఐఎస్‌బీ దీనిపై సమగ్ర అధ్యయనం చేసి, సరైన మూల్యాంకన విధానం, బోధన ప్రణాళిక తీరు, టీచింగ్ మెథడ్స్‌లో తీసుకురావాల్సిన మార్పులను సూచిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఐఎస్‌బీ డీన్ మదన్ పిల్లుట్ల, తదితరులు పాల్గొన్నారు.
:: Also Read ::
గురుకుల సైనిక మహిళా కళాశాలలో ఇంటిగ్రేటెడ్ ఎంఏ కోర్సు, అర్హతలివే!
యాదాద్రి భువనగిరి జిల్లాలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సైనిక మహిళా డిగ్రీ కళాశాల అందిస్తున్న ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఏ ఎకనామిక్స్ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్ వెలువడింది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంట్రెన్స్ ఎగ్జామ్, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్‌లు, సైకో అనలిటికల్ టెస్ట్‌లు, మెడికల్ టెస్ట్‌లు, షార్ట్ లెక్చర్, ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. చివరితేది అక్టోబరు 25.
కోర్సు, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..
Degree Courses: డిగ్రీలో కొత్త కోర్సులు, వచ్చే ఏడాది నుంచి అమల్లోకి!
తెలంగాణలోని యూనివర్సిటీల్లో మూస విద్యావిధానానికి స్వస్తి పలకాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. వచ్చే ఏడాదికల్లా కొలువులిచ్చే కోర్సుల రూపకల్పనకు చర్యలు చేపట్టింది. ఇందుకోసం ముగ్గురు వైస్‌చాన్స్‌లర్లతో త్రిసభ్య కమిటీని నియమించింది. శాతవాహన వర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఎస్.మల్లేశ్ చైర్మన్‌గా, ఉస్మానియా వీసీ ప్రొఫెసర్ డి.రవీందర్, మహత్మాగాంధీ వర్సిటీ వీసీ ప్రొఫెసర్ గోపాల్‌రెడ్డి సభ్యులుగా కమిటీ వేసింది.
కోర్సుల వివరాల కోసం క్లిక్ చేయండి..
Cyber Security: సైబర్ సెక్యూరిటీ కోర్సుల్లో శిక్షణ, అర్హతలివే!
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని 'నేషనల్ అకాడమీ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ' సైబర్ సెక్యూరిటీ కోర్సుల్లో శిక్షణను దరఖాస్తులు కోరుతోంది. సైబర్ సెక్యూరిటీ ఆఫీసర్, డిప్లొమా, పీజీ డిప్లొమా ఇన్ సైబర్ సెక్యూరిటీ మేనేజ్‌మెంట్, సైబర్ సెక్యూరిటీ ఎథికల్ హ్యాకింగ్, సర్టిఫికెట్ ఇన్ సైబర్ సెక్యూరిటీ కోర్సుల్లో శిక్షణ ఇస్తారు. ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసినవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆసక్తి ఉన్నవారు అక్టోబరు 27 లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు 7893141797 ఫోన్ నంబరులో సంప్రదించవచ్చు.
కోర్సుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
CLISC: సీఎల్‌ఐఎస్సీ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం, ఇంటర్ అర్హత!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర గ్రంధాలయాల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో గుర్తింపు పొందిన మూడు సంస్థల ద్వారా నిర్వహించనున్న 5 నెలల కాలపరిమితితో కూడిన సర్టిఫికెట్ కోర్స్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్పర్మేషన్ సైన్స్ కోర్సులో చేరేందుకు ఆసక్తిగల అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతుంది.
కోర్సులకు సంబంధించిన పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..