Reel Shoot Sparks Panic: కర్ణాటకలోని హుమ్నాబాద్ రింగ్ రోడ్. జనం మరీ ఎక్కవగా లేరు. ఆలాగని నిర్మానుష్యంగా కూడా లేదు. ఎవరి పనులు వారు చేసుకుంటున్న సమయంంలో హఠాత్తుగా ఇద్దరు యువకులు పరుగులు పెడుతూ కనిపించారు. ఓ వ్యక్తి చేతిలో కత్తి ఉంది. అతను రౌడీలా కనిపిస్తున్నాడు. మరో వ్యక్తి ప్రాణభయంతో పరుగులు తీస్తున్నాడు. కాసేపటికి ఎదుట ఉన్న వ్యక్తిని పట్టుకుని అడ్డంగా నరికేశాడు రైడీ. అంతా రక్తం పారింది. తర్వాత అని గుండెల మీద కూర్చుని పొలికేక పెట్టాడు. ఓ విజయం సాధించాన్నట్లుగా వికటాట్టహాసం చేశాడు. దీన్ని చూసిన జనం హడలిపోయారు.చాలా దూరం వెళ్లిపోయారు. అక్కడ హత్య జరిగిందని ఎవరో పోలీసులకు సమాచారం ఇచ్చి వెళ్లిపోయారు. 

కాసేపటికి పోలీసులు సైరన్ మోగించుకుంటూ అక్కడికి వచ్చారు. కానీ అక్కడ హత్యకు గురైన వ్యక్తి కానీ.. హంతకుడు కానీ లేరు. పోలీసులు అక్కడున్న వారిని ఆరా తీస్తే అసలు విషయం తెలిసింది. అక్కడ అసలు హత్యే జరగలేదని అర్థమైంది. హత్యా సన్నివేశం మాత్రం జరిగింది. ఇద్దరు యువకులు హత్యకు గురైనట్లుగా.. హత్య చేసినట్లుగా డ్రామా ఆడారు. ఈరకనే కాదు దాన్ని దూరం నుంచి షూట్ చేసుకోవడానికి ఏర్పాట్లు  చేసుకున్నారు. ఎక్కడా కట్ లేకుండా తమ పని తాము పూర్తి చేసుకున్నారు. అయితే రక్తం వచ్చింది కదా.. రక్తం మరకలు ఉన్నాయి కదా అని  పోలీసులు పరిశీలించారు. అది నిజం రక్తం కాదని పట్టుకోాగనే అర్ధమైపోయింది.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.  

తమనే ఫూల్స్ చేసిన వారిని పోలీసులు ఊరుకుంటారా...మొత్తం బయటకు లాగారు. ఆ మర్డర్ రీల్ చేసిన వారిని పట్టుకున్నారు. వారి పేర్లు సచిన్, సల్బానా, వారిద్దరినీ అరెస్టు చేసిన కలబురిగి పోలీసులు రిమాండ్ కు తరలించారు.  

రీల్స్ పిచ్చితో న్యూసెన్స్ చేస్తే ఊరుకునేది లేదని కర్ణాటక పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.