వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతున్న ఓ ఫేక్ మేసేజ్ పై ప్రెస్ ఇన్ఫ్మరేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ చేసింది.  ఇంటి నుంచి పని(వర్క్ ఫ్రమ్ హోం) ఉద్యోగాల కోసం భారత ప్రభుత్వం ఓ సంస్థతో ఒప్పందం చేసుకుందని  ఓ వాట్సాప్ మేసేజ్ షేర్ అవుతుంది. దీనిపై ప్రెస్ ఇన్ఫ్మరేషన్ బ్యూరో వివరణ ఇచ్చింది. కేంద్రం ఏ సంస్థతో ఉద్యోగాల విషయంలో ఒప్పందం చేసుకోలేదని పేర్కొంది. ఇటువంటి సందేహాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పీఐబీ హెచ్చరించింది. కేంద్రం ప్రభుత్వం ఎవరితోనూ ఒప్పందం చేసుకోలేదని స్పష్టం చేసింది. 


వర్క్ ఫ్రమ్ హోం అంటూ ఫేక్ మేసేజ్ 


కరోనా కల్లోలం కారణంగా చాలా సంస్థలు వర్క్ ఫ్రమ్ హోం పద్ధతి అవలంభిస్తున్నాయి. ముఖ్యంగా ప్రైవేట్ సంస్థలు దాదాపు సంవత్సరం నుంచి వర్క్ ఫ్రమ్ హోం ఇచ్చాయి. దీంతో వర్క్ ఫ్రమ్ హోం విధానానికి మద్దతు పెరిగింది. దీన్ని ఆధారంగా మోసాలకు పాల్పడేందుకు సైబర్ కేటుగాళ్లు ఫేక్ సందేశాలు పంపుతున్నారు. 


Also Read: Covid Third Wave: అక్టోబర్ లో కోవిడ్ థర్డ్ వేవ్... పిల్లలపై ఎక్కువ ప్రభావం... కేంద్రానికి జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ నివేదిక


అధికారిక వెబ్ సైట్ లలో మాత్రమే...


కరోనా వల్ల ఉద్యోగాలు కోల్పోయిన వారిని ఆకర్షించి, పైగా వర్క్ ఫ్రమ్ హోం కేటగిరిపై మోసాలకు తెర తీస్తున్నారు. ఇటువంటి సందేశాల పట్ల ఉద్యోగార్థులు అప్రమత్తంగా వ్యవహరించాలి. 'అధికారిక ప్రకటనలు ఎప్పుడూ సంబంధిత మంత్రిత్వ శాఖల వెబ్ సెట్ లలో పెడతారు. జాబ్ నోటిఫికేషన్లు అధికారిక సైట్ల మాత్రమే ఉంచుతారు. సోషల్ మీడియాలో ఎప్పుడు పోస్టు చేయరని' పీఐబీ తెలిపింది.  


 


 





ఇటువంటి సందేశాల పట్ల అప్రమత్తంగా కలిగి ఉండాలని పీఐబీ  హెచ్చరించింది. కేంద్రం ప్రభుత్వం ఎవరితోనూ ఒప్పందం చేసుకోలేదని స్పష్టం చేసింది. 


 


Also Read: Panjshir Taliban: తాలిబన్లకు పంజ్ షీర్ భయం.. 300 మంది తాలిబన్లు హతం ... బాగ్లాన్‌, అంద్రాబ్ ప్రాంతాలు తిరిగి కైవసం!