Ex-Google Employee:


లింక్డ్‌ఇన్‌లో పోస్ట్..


టెక్‌ కంపెనీలన్నీ ఇప్పుడు లేఆఫ్‌ల మంత్రం జపిస్తున్నాయి. కారణం అడిగితే "ఖర్చులు తగ్గించుకోవాలంటే తప్పదు" అని చెబుతున్నాయి. గూగుల్‌తో పాటు దాదాపు అన్ని బడా కంపెనీలు భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇలా ఉద్యోగాలు కోల్పోయిన వాళ్లు సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్‌లు పెడుతున్నారు. ఈ క్రమంలోనే లేఆఫ్‌కు గురైన ఓ గూగుల్‌ మాజీ ఉద్యోగి పెట్టిన పోస్ట్‌ వైరల్ అవుతోంది. అందరిలా ఎమోషనల్‌గా కాకుండా కాస్త ఫన్నీగా పెట్టాడు. ముంబయికి చెందిన ఈ ఎంప్లాయ్‌...జాబ్  లాస్‌ను బ్రేకప్‌తో పోల్చుతూ ఓ పెద్ద పోస్ట్ చేశాడు. కాపీరైటర్‌గా పని చేసిన ప్రియాంగ్ దవే లింక్డ్‌ఇన్‌లో ఈ పోస్ట్ పెట్టాడు. 


"చాలా ఆందోళనగా ఉంది. అదే సమయంలో సంతోషంగానూ ఉంది. నాకు నచ్చిన వ్యక్తులతో, నచ్చినట్టుగా పని చేసుకునే అవకాశం దొరికింది. అలాంటి టాలెంటెడ్ వ్యక్తులతో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది. తొలిసారి ఇలా జాబ్ పోగొట్టుకున్నాను. ఎందుకో నాకిది బ్రేకప్‌లా అనిపిస్తోంది. కానీ ఇలాంటి టైమ్‌లో మనం నెక్స్ట్ పార్ట్‌నర్‌ని (ఉద్యోగాన్ని) తెలివిగా ఎంచుకోవాలి. కేవలం ఓ టెక్స్ట్ మెసేజ్‌ (మెయిల్‌)తో బ్రేకప్‌ చెప్పే వాళ్లతో కాకుండా తెలివైన వాళ్లతో ప్యాచప్ అవ్వాలి" 


-గూగుల్ మాజీ ఉద్యోగి 


ఇదే సమయంలో తన కంపెనీ నుంచి వచ్చే ముందు ఒకటి దొంగిలించాలనంటూ ఫన్నీగా చెప్పాడు. కానీ అది వస్తువు కాదని, తాను దొంగిలించింది "నైపుణ్యాన్ని" అంటూ చమత్కరించాడు. 


"గూగుల్‌ కంపెనీ నుంచి వచ్చే ముందు నేనొకటి దొంగిలించాను. మీరనుకుంటున్నట్టుగా అది వస్తువు కాదు. నేను అక్కడి నుంచి చోరీ చేసింది నైపుణ్యాన్ని. డిజిటల్ అడ్వర్‌టైజింగ్‌ నేర్చుకోగలిగాను. ఇంటర్నెట్ సోర్స్‌ కోడ్ ద్వారా ఇది నేర్చుకున్నాను. వీటితో పాటు బయట మార్కెట్‌కు అవసరమైన స్కిల్స్‌ను సంపాదించగలిగాను"


-గూగుల్ మాజీ ఉద్యోగి 




సోషల్ మీడియాలో ఈ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. చాలా మంది యూజర్లు ఈ ఫన్నీ పోస్ట్‌ని లైక్ చేయడమే కాకుండా కామెంట్లు కూడా పెడుతున్నారు. మీ స్పిరిట్‌కు హ్యాట్సాఫ్ అంటూ పొగుడుతున్నారు. మీ టాలెంట్‌పై నమ్మకముంచండి, దాన్ని ఎవరూ తొలగించలేరు అంటూ మరి కొందరు పాజిటివ్‌గా రెస్పాండ్ అవుతున్నారు. 


డెస్క్ షేరింగ్...


ఈ మధ్యే ట్విటర్‌ ఇండియాలోని రెండు ఆఫీస్‌లకు తాళం వేసేసింది. ఖర్చులు తగ్గించుకోడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడిదే బాటలో నడుస్తోంది గూగుల్. ఆఫీస్‌ల సంఖ్యను తగ్గించే పనిలో పడింది. ఆ మేరకు కాస్ట్‌ కటింగ్ చేసుకోవచ్చని భావిస్తోంది. ఫలితంగా ఉద్యోగులు ఇకపై డెస్క్‌లు షేర్ చేసుకోక తప్పదు. అంటే...ఒకే డెస్క్‌లో ఇద్దరు కలిసి పని చేసుకోవాలన్నమాట. అమెరికాలో మొత్తంగా 5 Google Cloud ఆఫీస్‌లున్నాయి. న్యూయార్క్, కిర్క్‌లాండ్, వాషింగ్టన్, సన్నీవేల్, శాన్ ఫ్రాన్సిస్కో, సియాటెల్‌లోని ఆఫీస్‌లలో ఉద్యోగులు డెస్క్ షేరింగ్ చేసుకోక తప్పేలా లేదు. ఈ మోడల్‌ను అమలు చేసేందుకు గూగుల్ ఇప్పటికే టీమ్‌లను తయారు చేస్తోంది. 200-300 మంది ఉద్యోగులను కలిపి ఓ టీమ్‌గా డివైడ్ చేస్తోంది. "నైబర్‌హుడ్స్" పేరుతో వీళ్లంతా డెస్క్ షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ టీమ్‌కి ఓ లీడర్ ఉంటారు. డెస్క్‌ షేరింగ్‌కి సంబంధించిన రూల్స్‌ అన్నీ చెబుతారు. 


Also Read: Live-in Relationships: లివిన్‌ రిలేషన్‌షిప్‌లకూ రిజిస్ట్రేషన్‌ రూల్ పెట్టండి, సుప్రీంకోర్టులో పిటిషన్