Ram Mandir Opening:
రామ మందిరం రెప్లికా..
అయోధ్య రామ మందిరాన్ని (Ram Mandir) పోలిన మరో ఆలయం సిద్ధమైపోయింది. కాకపోతే ఆ మందిరాన్ని సందర్శించుకోలేం. ఊరికే చూసి మురిసిపోవాలంతే. నాగ్‌పూర్‌లో ఓ సివిల్ ఇంజనీర్ అచ్చం అయోధ్య రాముల వారి ఆలయాన్ని పోలిన మందిరాన్ని కట్టాడు. 11 అడుగుల ఎత్తైన ఆలయమిది. ఇంట్లోనే ఈ రెప్లికాని తయారు చేసుకున్నాడు. అయోధ్య ఉత్సవం సందర్భంగా తన వంతుగా ఇలా ఆలయాన్ని ఇంట్లోనే నిర్మించుకున్నాడు. రామ మందిర రెప్లికాని (Ram Mandir Replica) కొనుగోలు చేసిన ఈ ఇంజనీర్ అచ్చం అలాంటి ఆకృతి ఇంట్లో ఎందుకు ఉండకూడదు అనుకున్నాడు. అలా అనుకున్నాడో లేదో వెంటనే పని మొదలు పెట్టాడు.
ఈ సమయంలోనే దీన్ని తయారు చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందో చెప్పాడు. 1990లో karseva కార్యక్రమంలో తన భార్య పాల్గొందని, ఆ సమయంలో 16 రోజుల పాటు జైల్లో ఉందని గుర్తు చేసుకున్నాడు. అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం ఆమె ఎంతో ఆరాటపడ్డారని చెప్పాడు. అయితే..తాను మాత్రం ఇలాంటి పోరాటం ఏమీ చేయలేదని అన్నాడు. అందుకే...ఇలా అయినా అయోధ్య ఉత్సవానికి తన మద్దతునివ్వాలనుకున్నట్టు వివరించాడు. ఇంటర్నెట్‌లో అయోధ్య మందిరానికి సంబంధించిన సమాచారం అంతా తెలుసుకుని అచ్చం అలాంటి డిజైన్‌నే తయారు చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిపాడు.
"అయోధ్య రామాలయానికి సంబంధించి ఇంటర్నెట్‌లో చాలా సమాచారం సేకరించాను. ఆ డిజైన్‌ని పరిశీలించాను. ఓ సివిల్ ఇంజనీర్‌గా వాటిని చాలా త్వరగానే అర్థం చేసుకోగలిగాను. ముందుగా ఓ గ్రాఫికల్ డిజైన్ తయారు చేశాను. ఆ తరవాత అవసరమైన మెటీరియల్‌తో నిర్మించడం మొదలు పెట్టాను. గతేడాది దీపావళి నుంచి ఈ నిర్మాణం మొదలైంది"
- ప్రఫుల్లా, సివిల్ ఇంజనీర్, మహారాష్ట్ర
అయోధ్య ఉత్సవంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. యూపీలోని 7 జిల్లాల్లో సెక్యూరిటీ అలెర్ట్ ప్రకటించారు. నేపాల్‌తో సరిహద్దు పంచుకునే ప్రాంతాల్లోనూ అప్రమత్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. అందుకే భద్రతా లోపాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో నిఘా మరింత పెంచారు. స్మగ్లింగ్ జరగకుండా అడ్డుకోనున్నారు. కొన్ని చోట్ల పోలీసులు డ్రోన్ కెమెరాలతో నిఘా పెడుతున్నారు. అనుమానాస్పదంగా ఎవరు కనిపించినా వెంటనే అలెర్ట్ అయ్యేందుకు వీటిని వినియోగించనున్నారు.
Also Read: Ram Mandir Inauguration: అయోధ్య ఉత్సవం కోసం రైళ్ల షెడ్యూల్ మార్చేసిన రైల్వే, పూర్తి వివరాలివే