Elon Musk Vs BBC Reporter:
బీబీసీ ఇంటర్వ్యూ
ట్విటర్ సీఈవో ఎలన్ మస్క్ BBC రిపోర్టర్‌పై అసహనం వ్యక్తం చేశారు. ట్విటర్‌లో హేట్‌స్పీచ్ పెరుగుతోందంటూ ఆ రిపోర్టర్ చేసిన ఆరోపణలపై ఫైర్ అయ్యారు. "అబద్ధాలు ఆడుతున్నారు" అంటూ మండి పడ్డారు. బీబీసీకి ఇంటర్వ్యూ ఇచ్చిన క్రమంలో ఇదంతా జరిగింది. రిపోర్టర్ వేసిన ప్రశ్నపై ఆగ్రహించారు మస్క్.
BBC రిపోర్టర్: ట్విటర్‌లో హేట్ స్పీచ్ పెరుగుతోంది. దీన్ని మీరెలా డీల్ చేశారు..? అంతే కాదు. సిబ్బంది కొరత కూడా ఉంది. అలాంటప్పుడు హేట్ కంటెంట్‌ను మానిటర్ చేయడం కష్టంగా అనిపించలేదా?
ఈ ప్రశ్న విన్న వెంటనే ఎలన్ మస్క్ హేట్ స్పీచ్ అంటే అర్థం ఏంటి..? ఉదాహరణలు చెప్పగలరా అని ప్రశ్నించారు.
ఎలన్ మస్క్: ఏ హేట్‌స్పీచ్ గురించి మీరు మాట్లాడుతున్నారు..? మీరు ట్విటర్ వాడుతున్నారుగా. మీరెప్పుడైనా విద్వేష పూరిత ప్రసంగాలను చూశారా..? ఇది జస్ట్ నా పర్సనల్ క్వశ్చన్ అంతే. నేనైతే ఎప్పుడూ అలాంటి కంటెంట్ చూడలేదు
బీబీసీ రిపోర్టర్: నిజంగా చెప్పాలంటే నేనెప్పుడూ అలాంటి కంటెంట్ చూడలేదు. నాకు అలాంటి వాటిపైన ఆసక్తి ఉండదు. అందుకే దూరంగా ఉంటాను. నేను కేవలం నా ఫాలోవర్లు పెట్టే కంటెంట్ మాత్రమే చూస్తాను
ఎలన్ మస్క్: నేను జస్ట్ ఒకటే ఒక ఉదాహరణ అడిగాను. అది కూడా చెప్పలేరా..? అలాంటప్పుడు మీరేం మాట్లాడుతున్నారో మీకే అర్థం కావడం లేదని నాకు అర్థమవుతోంది. హేట్‌ఫుల్ కంటెంట్‌కు సంబంధించి కనీసం ఒక్క ట్వీట్ కూడా మీరు చూపించలేరు. కానీ ఆ కంటెంట్ ట్విటర్‌లో పెరుగుతోందని చెబుతున్నారు. ఇదంతా అబద్ధం. మీరు అబద్ధాలాడుతున్నారు.
ఇలా వాళ్లిద్దరి మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.