ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్స్ సబ్ సర్వీసులో 60 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (గ్రేడ్-3) పోస్టుల భర్తీకి సంబంధించి ఫిబ్రవరి 17న నిర్వహించిన ఆన్‌లైన్ మెయిన్ పరీక్ష ఫలితాలను ఏపీపీఎస్సీ ఏప్రిల్ 12న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. మెయిన్ పరీక్ష రాసిన అభ్యర్థుల నుంచి మొత్తం 59 మంది అభ్యర్థులను ధ్రువపత్రాల పరిశీలనకు కమిషన్ ఎంపికచేసింది. ఫలితాలతో పాటు తుది కీని కూడా ఏపీపీఎస్సీ విడుదల చేసింది. వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.
ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థులు ఏప్రిల్ 26న ఉదయం 10 గంటలకు విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు కావాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఏయే సర్టిఫికెట్లను తీసుకురావాలో ఆయా వివరాలను సూచించింది. ఏ అభ్యర్థి అయినా వెరిఫికేషన్‌కు హాజరుకాకపోతే, మెరిట్ జాబితాలో తదుపరి అభ్యర్థిని పిలుస్తారు.
అవసరమైన డాక్యుమెంట్లు..
➥ పదోతరగతి మార్కుల మెమో (వయసు నిర్దారణ కోసం)
➥ వయోపరిమితికి సంబంధించిన ఆధారం.
➥ విద్యార్హత ధ్రువపత్రాలు
➥ స్టడీ సర్టిఫికేట్లు (IV - X వరకు)
➥ క్యాస్ట్ సర్టిఫికేట్ (రిజర్వేషన్లు వర్తించేవారికి)
➥ నాన్-క్రీమిలేయర్ సర్టిఫికేట్ (బీసీలకు)
➥ మైగ్రేషన్ సర్టిఫికేట్ (తెలంగాణ నుంచి ఏపీకి వచ్చినవారికి)
➥పీహెచ్ సర్టిఫికేట్ (దివ్యాంగులైతే)
➥ ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా ఒరిజినల్ గుర్తింపుకార్డు (ఆధార్ కార్డు, ఓటరుకార్డు తదితరాలు) తీసుకెళ్లడం మంచిది.
అభ్యర్థులు హాజరుకావాల్సిన చిరునామా:
O/o A.P.P.S.C., New HODs
Building, 2nd Floor, M.G. Road,
Opp. Indira Gandhi Municipal stadium,
Vijayawada, Andhra Pradesh-520010.
సమయం: ఉదయం 10.00 గం.
➥ Web Note
➥ Memo
➥ Non-Creamy Layer Certificate for BC candidates
➥ Declaration by the Unemployed
Also Read:
తెలంగాణ ట్రాన్స్‌కోలో 92 గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అప్రెంటిస్ ఖాళీలు!
హైదరాబాద్‌లోని ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్, కార్పొరేట్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్, అప్రెంటిస్‌షిప్ శిక్షణ కోసం అర్హులైన ఇంజినీరింగ్ డిగ్రీ/ డిప్లొమా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఏప్రిల్ 11లోగా ఆన్‌లైన్ ద్వావరా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఏడాది పాటు అప్రెంటిస్ శిక్షణ కొనసాగనుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఇండోర్ ఐఐటీలో 34 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు- అర్హతలివే!
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇండోర్ (ఐఐటీ ఇండోర్) వివిధ విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 34 పోస్టులను భర్తీ చేయనున్నారు. పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు బోధన, పరిశోధన అనుభవం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఏప్రిల్ 21 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఎన్‌పీడీసీఎల్‌లో 100 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు, అర్హతలివే!
వరంగల్ కేంద్రంగా పనిచేస్తున్న ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(ఎన్‌పీడీసీఎల్)లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దీనిద్వారా మొత్తం 100 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. రెగ్యులర్ ప్రాతిపదికన ఈ నియామకాలు చేపట్టనున్నారు. రాతపరీక్ష, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. ఎంపికైనవారికి వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్ సర్కిళ్ల పరిధిలో నియమిస్తారు. ఎంపిక విధానంలో తెలంగాణ విద్యుత్ సంస్థల్లో ఆర్టీసియన్స్‌గా పనిచేస్తున్న వారికి 20 శాతం వెయిటేజీ వర్తిస్తుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..