నవరస రాయ డా. నరేష్ విజయకృష్ణ (Naresh Vijaya Krishna) కథానాయకుడిగా రూపొందిన సినిమా 'మళ్ళీ పెళ్లి' (Malli Pelli Telugu Movie 2023). చిత్ర పరిశ్రమలో నటుడిగా నరేష్ 50 వసంతాలు పూర్తైన సందర్భంలో ఈ చిత్రాన్ని అనౌన్స్ చేశారు. 


ఎంఎస్ రాజు దర్శకత్వంలో...
మెగా మూవీ మేకర్ ఎంఎస్ రాజు (MS Raju) రచన, దర్శకత్వంలో 'మళ్ళీ పెళ్లి'  సినిమా రూపొందుతోంది. ఇందులో నరేష్ జోడిగా ప్రముఖ నటి పవిత్రా లోకేష్ (Pavitra Lokesh) నటించారు. చిత్రీకరణ పూర్తి చేసినట్లు తెలిసింది. తెలుగు, కన్నడ భాషల్లో రూపొందుతున్న ఈ ద్విభాషా చిత్రానికి నరేష్ నిర్మాత. దీంతో లెజెండరీ ప్రొడక్షన్ హౌస్ విజయ కృష్ణ మూవీస్‌ సంస్థను పున:ప్రారంభించారు.


'మళ్ళీ పెళ్లి' టీజర్ విడుదల వాయిదా
'మళ్ళీ పెళ్లి' టీజర్ (Malli Pelli Movie Teaser)ను ఈ రోజు విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే... సాంకేతిక కారణాలతో వాయిదా వేసినట్లు తెలిపారు. త్వరలో టీజర్ విడుదల చేయబోయే కొత్త తేదీ చెబుతామని పేర్కొన్నారు.  


Also Read : దేవుడి దయ వల్ల బావున్నా, గాయాలు కాలేదు - స్పందించిన సంజయ్ దత్






కుటుంబంతో చూసే సినిమా!
సకుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా 'మళ్ళీ పెళ్లి' అని నరేష్ తెలిపారు. ఇది పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ అని ఆయన పేర్కొన్నారు. ఆల్రెడీ విడుదల అయిన గ్లింప్స్, ప్రచార చిత్రాల్లో నరేష్, పవిత్ర జోడీ కెమిస్ట్రీ హైలైట్ అయ్యింది. వేసవిలో ఈ సినిమా విడుదల కానుంది. 


జయసుధ, శరత్‌బాబు కీలక పాత్రలు పోషిస్తున్న 'మళ్ళీ పెళ్లి' సినిమాలో వనితా విజయ్ కుమార్, అనన్య నాగెళ్ల, రోషన్, రవివర్మ, అన్నపూర్ణ, భద్రం, యుక్త, ప్రవీణ్ యండమూరి, మధు తదితరులు ఇతర తారాగణం. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి  స్వరాలు, అరుల్ దేవ్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి కూర్పు :  జునైద్ సిద్ధిక్, ఛాయాగ్రహణం : ఎంఎన్ బాల్ రెడ్డి, సాహిత్యం : అనంత శ్రీరామ్


Also Read ఎన్టీఆర్ ఇంట్లో అమెజాన్ స్టూడియోస్ వైస్ ప్రెసిడెంట్ - అసలేం జరిగిందంటే?


నరేష్ విజయకృష్ణ, పవిత్రా లోకేష్ మధ్య  సంబంధం (Pavitra Lokesh Naresh Relationship) ఏమిటో తెలుసుకోవాలని రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకులతో పాటు కన్నడ ప్రజలు సైతం ఆసక్తి చూపిస్తున్నారు. బెంగళూరులో నరేష్, ఆయన మూడో భార్య రమ్య రఘుపతి, పవిత్రా లోకేష్ చేసిన హడావిడి అందరికీ ఇంకా గుర్తే. ఆ తర్వాత న్యూ ఇయర్ సందర్భంగా నరేష్ పోస్ట్ చేసిన లిప్ లాక్ వీడియో అయితే సంచలనం సృష్టించింది. అందువల్ల, 'మళ్ళీ పెళ్లి' సినిమాపై అందరిలో ఆసక్తి నెలకొంది. వీడియో గ్లింప్స్ విడుదల చేయడానికి ముందు అది లీక్ కావడంతో నిజ జీవితంలో నరేష్, పవిత్ర పెళ్లి చేసుకున్నారని చాలా మంది భావించారు. 


త్వరలో ప్రెస్ మీట్ పెడతా - నరేష్! 
ఆ మధ్య జరిగిన 'ఇంటింటి రామాయణం' సినిమా ప్రెస్‌మీట్‌లో 'ఇప్పుడు సల్మాన్ ఖాన్, ప్రభాస్ పెళ్లి గురించి తెలుగు ప్రేక్షకులు మర్చిపోయారు. తెలుగు ప్రజలు అందరూ మీ పెళ్లి ఎప్పుడు అని చూస్తున్నారు. ట్విట్టర్ వేదికగా పెళ్లి అయ్యిందని అనౌన్స్ చేశారు. నెక్స్ట్ ఏంటి?' అని ప్రశ్నించగా... ''నేను త్వరలో ప్రెస్ మీట్ పెడతా'' అని నరేష్ సమాధానం ఇచ్చారు.