Renu Desai: సోషల్ మీడియాలో నటి రేణూ దేశాయ్ కు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు మధ్య మాటల యుద్దం నడుస్తూనే ఉంది. ఇటీవల పవన్-రేణూ దేశాయ్ ల కుమారుడు అకీరానందన్ పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. ఈ సందర్బంగా సోషల్ మీడియాలో అకీరాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు పవన్ అభిమానులు ఈ సందర్భంగా ఓ అభిమాని అకీరాను ‘మా అన్న కొడుకు’ అని కామెంట్ చేశాడు. దీంతో రేణూ దేశాయ్ ఈ కామెంట్ పై సీరియస్ అయింది. ‘మీ అన్న కొడుకు కాదు అకీరా నా కొడుకు. మాట్లాడే పద్దతి మార్చుకో’ అంటూ ఫైర్ అయింది. దీంతో పవన్ అభిమానులంతా షాక్ అయ్యారు. అయితే కొంత మంది మాత్రం రేణూకు కౌంటర్ గా కామెంట్లు చేస్తూ వస్తున్నారు. రేణూ దేశాయ్ కూడా వాటికి కౌంటర్ లు వేస్తూ రిప్లై ఇస్తూనే ఉంది. ఇది గత కొద్ది రోజులుగా నడుస్తూనే ఉంది. తాజాగా మళ్లీ రేణూ దేశాయ్ పవన్ అభిమానులపై ఫైర్ అవుతూ మరో పోస్ట్ చేసింది. ప్రస్తుతం రేణూ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నాయి.  


రేణూ దేశాయ్ పవన్ కళ్యాణ్ అభిమాని వ్యాఖ్యల పట్ల స్పందించిన తీరుపై పలువురు అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ‘తెలుగు రాష్ట్రాల్లో నువ్వు ఎవరి అబ్బాయివి అని అడిగితే తండ్రి పేరే చెప్తారు మేడం’ అని కామెంట్ చేస్తే దానికి కూడా రేణూ స్పందిస్తూ ‘మీ తల్లికి ఇచ్చే గౌరవం అదేనా ఇదేనా మీ సంస్కృతి’ అంటూ రిప్లై ఇచ్చింది. దీంతో కొంతమంది నెటిజన్స్ మీకు నచ్చకపోతే ఇన్స్టాగ్రామ్ సెట్టింగ్స్ మార్చుకోండి లేదా కామెంట్ సెక్షన్ ను ఆఫ్ చేసుకోండి అంటూ సలహాలిస్తున్నారు. అయితే రేణూ దేశాయ్ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. నెటిజన్ల కామెంట్లకు తన స్టైల్ లో రిప్లై ఇస్తూ వార్తల్లో నిలుస్తోంది. అయితే ఇటీవల మళ్లీ ఓ పోస్ట్ ను షేర్ చేసింది రేణూ దేశాయ్. ‘సమాజంతో ఇదే ప్రాబ్లం. ఎవరి కోసమో నేనెందుకు మారాలి. మీకు నచ్చినట్టు ఉండటానికి నేనేమి తప్పు చేశాను’ అంటూ తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్ట్ చేసింది. ప్రస్తుతం రేణూ చేసిన పోస్ట్ లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. 


ఇక పవన్ కళ్యాణ్ రేణూ దేశాయ్ లు సినిమా షూటింగ్ సందర్భంలో ప్రేమలో పడ్డారు. కొన్నాళ్ల సహజీవనం తర్వాత వీరిద్దరూ 2009 లో పెళ్లి చేసుకున్నారు. వీరికి అకీరా, ఆద్య ఇద్దరు సంతానం ఉన్నారు. అయితే కొన్నాళ్ల తర్వాత ఇద్దరికీ మనస్పర్థలు రావడంతో ఒకరి అంగాకారంతో ఒకరు 2012 లో విడిపోయారు. అప్పటి నుంచీ ఎవరి లైఫ్ ను వాళ్లు గడుపుతున్నారు. ఈ మధ్య కాలంలో రేణూ దేశాయ్ మరో పెళ్లి చేసుకుంటుందీ అంటూ వార్తలు వచ్చాయి. అప్పుడు కూడా కొంత మంది ఆమెను సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. మళ్లీ ఇప్పుడు అకీరా విషయంలో రేణూ దేశాయ్ ట్రోల్స్ కు గురి కావాల్సి వచ్చింది. మరి రేణూ పవన్ అభిమానుల మాటల యుద్దం ఎప్పుడు ముగుస్తుందో చూడాలి.


Read Also: ఓటీటీలో విడుదలకు ‘కబ్జా’ రెడీ- ఎప్పుడు, ఎక్కడో తెలుసా?