Delhi Liquor Policy Case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు ఆమ్ ఆద్మీ పార్టీని నిందితుల జాబితాలో చేర్చింది ఈడీ. ఇటీవలే మరోసారి ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన అధికారులు తొలిసారి కేజ్రీవాల్ పేరుని నిందితుల జాబితాలో చేర్చడం కీలకంగా మారింది. ఆయన పెద్ద ఎత్తున మనీ లాండరింగ్‌కి పాల్పడినట్టు ఈడీ ఆరోపిస్తోంది. తన అరెస్ట్‌ని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇది అక్రమం అని అందులో పేర్కొన్నారు. అయితే...ఈ పిటిషన్‌పై తీర్పుని కోర్టు రిజర్వ్‌లో ఉంచింది. ఈ క్రమంలోనే ఈడీ ఆయనతో పాటు ఆప్ పేరుని ఛార్జ్‌షీట్‌లో చేర్చడం షాక్ ఇచ్చింది. అరవింద్ కేజ్రీవాల్‌కి, హవాలా ఆపరేటర్‌లకు మధ్యలో ఛాటింగ్ జరిగిందని, ఆ మెసేజ్‌లన్నీ తమ వద్ద ఉన్నాయని ఈడీ కోర్టుకి వెల్లడించింది. కేజ్రీవాల్ తన మొబైల్ పాస్‌వర్డ్‌లు ఇచ్చేందుకు అంగీకరించలేదని వివరించింది. హవాలా ఆపరేటర్స్ డివైజ్‌ల నుంచి ఈ ఛాట్‌ని రికవర్ చేసినట్టు స్పష్టం చేసింది. రౌజ్ అవెన్యూ కోర్టులో ఈ ఛార్జ్‌షీట్‌ని దాఖలు చేసింది. ఈ కేసులో కీలకంగా భావించే కొన్ని డివైజ్‌లను ధ్వంసం చేశారని, హవాలా ఆపరేటర్స్ వద్ద ఉన్న డివైజ్‌ల నుంచే అన్ని వివరాలూ సేకరిస్తున్నామని ఈడీ తెలిపింది.
ఈ స్కామ్ మొత్తం సూత్రధారి కేజ్రీవాలేనని ఇప్పటికే ఈడీ కోర్టులో వాదించింది. ఆయన ద్వారానే పెద్ద ఎత్తున హవాలా లావాదేవీలు జరిగాయని ఆరోపించింది. అయితే...కేజ్రీవాల్ మాత్రం ఇదంతా కుట్ర అని కొట్టి పారేస్తున్నారు. బెయిల్ కోసం ఇటీవల పిటిషన్ వేయగా కోర్టు అందుకు అనుమతినిచ్చింది. జూన్ 2వ తేదీన మళ్లీ ఈడీకి లొంగిపోవాలని ఆదేశించింది. South Group ఇచ్చిన రూ.100 కోట్ల లంచంలో ఆప్ గోవా ఎన్నికల కోసం రూ.45 కోట్లు వినియోగించిందని ఈడీ చేస్తున్న ప్రధాన ఆరోపణ. 2022లో జరిగిన గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నిధులను డబ్బుని ఖర్చు చేసినట్టు చెబుతోంది. అరవింద్ కేజ్రీవాల్‌ని కింగ్‌పిన్‌గా పేర్కొంది. హోల్‌సేలర్స్‌కి లాభాలు వచ్చేలా ఆప్ ప్రభుత్వం ప్రాఫిట్ మార్జిన్‌ని 12%కి పెంచినట్టుగా ఆరోపిస్తోంది. అందులో 6% మేర వాటాని ప్రభుత్వానికి తిరిగి ఇవ్వాలని డీల్ కుదుర్చుకున్నట్టుగా చెబుతోంది. ఈ డీల్ కారణంగా ప్రభుత్వానికి రూ.2,873 కోట్ల నష్టం వాటిల్లిందని ఈడీ స్పష్టం చేసింది. ఆప్ మీడియా హెడ్ విజయ్ నాయర్ సౌత్ గ్రూప్ నుంచి రూ.100 కోట్ల అడ్వాన్స్ తీసుకున్నారని ఆరోపించింది.
Also Read: Motion Sickness: మీకు కార్ జర్నీ పడదా, ప్రయాణంలో మొబైల్ చూసినా తల తిరుగుతోందా - ఈ ఫీచర్ మీ కోసమే