Apple New Features: కార్‌ ఎక్కి కాసేపు జర్నీ చేయగానే కొంత మందికి కడుపులో తిప్పేస్తుంది. వాంటింగ్ సెన్సేషన్ వచ్చేస్తుంది. బస్‌ జర్నీలోనూ ఇంతే. ఈ సమస్యతో బాధపడే వాళ్లు లాంగ్ ట్రిప్‌లు అనగానే భయపడిపోతుంటారు. కడుపులో వికారం పోగొట్టుకోడానికి లవంగాలు, నిమ్మకాయలు, యాలకులు దగ్గర పెట్టుకుని ప్రయాణిస్తుంటారు. దీన్నే Motion Sickness అంటారు. ఇక మూవింగ్ వెహికిల్‌లో మొబైల్ వాడినప్పుడూ కళ్లు విపరీతంగా నొప్పి పుడతాయి. మనకి తెలియకుండానే ఒక అన్‌ఈజీనెస్ వచ్చేస్తుంది. కార్ కదిలే వేగానికి మన కళ్లు స్క్రీన్‌పై నిలకడగా ఉండలేవు. ఈ కారణంగా కళ్లు తిరుగుతాయి. ఈ సమస్యని తీర్చేందుకు యాపిల్ కంపెనీ Vehicle Motion Cues అనే కొత్త ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకొచ్చింది. iPhones,iPads యూజర్స్ ఈ ఫీచర్‌ని వినియోగించుకోవచ్చు. మోషన్ సిక్‌నెస్‌ని తగ్గించాలన్న లక్ష్యంతో దీన్ని డిజైన్ చేసింది. 


ఈ ఫీచర్ ఎలా పని చేస్తుంది..?


సాధారణంగా కార్‌లో కానీ బస్‌లో కానీ జర్నీ చేసే సమయంలో అటూ ఇటూ ఊగిపోతుంటాం. రోడ్డు బాగోలేని చోట అయితే కుదుపులు తప్పవు. ఆ సమయంలో మొబైల్ వాడితే మన చూపు స్క్రీన్‌పై సరిగ్గా నిలబడదు. మొబైల్ స్క్రీన్‌ కలిదిలినంత వేగంగా మన కళ్లు స్పందించి చూడలేవు. ఈ సింక్‌ మిస్ అవ్వడం వల్లే సమస్య వస్తుంది. అయితే...యాపిల్ తయారు చేసిన  Vehicle Motion Cues ఫీచర్‌ ఈ సమస్యని తీర్చేస్తుంది. ఐఫోన్‌లు, ఐప్యాడ్‌లలో స్క్రీన్‌ ఎడ్జ్‌లకు యానిమేటెడ్ డాట్స్‌ ఉంటాయి. వెహికిల్ కదలికల ఆధారంగా ఆ డాట్స్ కూడా కదులుతాయి. ఈ డాట్స్‌ sensory conflict ని తగ్గించేస్తుంది. అంటే...వాహన కదలికలకు, కళ్ల కదలికలకు మధ్య సింక్‌ కుదురుస్తుంది. అడ్వాన్స్‌డ్ సెన్సార్స్‌తో ఈ ఫీచర్‌ని డిజైన్ చేశారు. కదిలే వాహనంలో కూర్చున్నప్పుడు ఈ సెన్సార్‌లు యాక్టివేట్ అవుతాయి. ఇదంతా ఆటోమెటిక్‌గా జరిగిపోతుంది. ఒకవేళ మాన్యువల్‌గా మార్చుకోవాలన్నా ఆ ఆప్షన్‌ కూడా అందుబాటులో ఉంది. కంట్రోల్ సెంటర్‌లో ఈ ఆప్షన్ కనిపిస్తుంది. 


మోషన్ సిక్‌నెస్ అంటే ఏంటి..?


ఏదైనా దూర ప్రయాణం చేసినప్పుడు మన కళ్లు, చెవిలోపలి భాగాలతో పాటు మొత్తం శరీరం అసౌకర్యానికి గురవుతాయి. కొంత మందిలో ఈ సెన్సేషన్ తక్కువగా ఉంటుంది. మరి కొందరిలో చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఆ సమయంలోనే కళ్లు, చెవులు మెదడుకి కొన్ని సంకేతాలు పంపిస్తాయి. వెంటనే బాడీ అంతా ఆ ప్రభావం పడుతుంది. తలనొప్పి, కళ్లు తిరగడం, ఇరిటేషన్, వాంతులు, సఫకేషన్ లాంటి లక్షణాలు కనిపిస్తాయి. కొంత మందికి విపరీతంగా చెమటలు పడతాయి. వాంతులు అయిపోతాయి. ఇలా పదేపదే వామ్‌టింగ్స్ అవడం వల్ల డీహైడ్రేషన్‌కి గురవుతారు. లోబీపీతో ఇబ్బంది పడతారు. ఈ సమయంలో కాసేపు కళ్లు మూసుకుని రెస్ట్ తీసుకోవడం, ఏదైనా స్వీట్ తినడం, అల్లం టీ తాగడం లాంటివి చేస్తే కొంత వరకూ ఆ చిరాకు నుంచి ఉపశమనం పొందచ్చు. 


Also Read: Swati Maliwal Case: పీరియడ్స్ ఉన్నాయన్నా వినకుండా కడుపులో తన్నాడు, దాడి ఘటనపై స్వాతి మలివాల్‌