Satyendar Jain ED Raids :  ఢిల్లీ మంత్రి, ఆయన అనుచరుల నివాసాల నుండి రెండు కోట్ల నగదు, 1.8 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ  ప్రకటించింది.  మనీలాండరింగ్‌ కేసులో అరెస్ట్‌ అయిన ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్‌ జైన్‌, ఆయన అనుచరుల నివాసాల్లో  సోదాలు నిర్వహించారు.  మనీలాండరింగ్‌ కేసు ఫాలోఅప్‌లో భాగంగా ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కేసులో గత నెల 30న మనీలాండరింగ్‌ నిరోధక చట్టం కింద జైన్‌ను అరెస్టు చేయగా.. జూన్‌ 9 వరకు ఇడి కస్టడీకి తరలించారు. ఆయన్ను, కొంత మంది హవాలా ఆపరేటర్లను విచారించిన తర్వాత.. దీనికి సంబంధించిన లింకులు, ఆధారాలు గుర్తించామని, మరిన్ని వివరాలు సేకరించేందుకు దాడులు నిర్వహించినట్లు ఈడీ ప్రకటించింది. 


 





 
ఈడీ జ‌ప్తు నుంచి త‌ప్పించుకునేందుకు స‌త్యేంద‌ర్ జైన్ కంపెనీకి చెందిన భూమిని నిందితుల్లో ఒక‌రు ఆయ‌న అనుచ‌రుల పేరిట బ‌దిలీ చేశాడ‌ని ఈడీ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. ఇక జైన్ నివాసం నుంచి ప‌లు డాక్యుమెంట్లు, డిజిట‌ల్ రికార్డుల‌ను ఈడీ స్వాధీనం చేసుకుంది. జైన్ నివాసాల నుంచి పెద్ద‌మొత్తంలో లెక్క‌తేల‌ని న‌గ‌దు, బంగారాన్ని పీఎంఎల్ఏ కింద సీజ్ చేశామ‌ని ఈడీ అధికారులు తెలిపారు.


అవినీతి కేసులో మే 30న ఈడీ మంత్రి స‌త్యేంద‌ర్ జైన్‌ను అరెస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. జైన్ ప్ర‌స్తుతం ఈడీ క‌స్ట‌డీలో ఉన్నారు. స‌త్యేంద‌ర్ జైన్ త‌న భార్య‌, కుమార్తెలు, స్నేహితులు, అనుచ‌రుల స‌హ‌కారంతో హ‌వాలా లావాదేవీల ద్వారా రూ 16 కోట్లు దారిమ‌ళ్లించార‌ని ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు.


ఈ దాడులపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మోదీ ప్రభుత్వం తమపై కక్ష కట్టిందన్నారు. తాము అన్నీ చట్ట ప్రకారం ఎదుర్కొంటామని ప్రకటించారు. తమ వైపు దేవుడున్నారని అంటున్నారు. అయితే.. పంజాబ్‌లో మంత్రిని తొలగించినట్లుాగనే ఇక్కడా ఆధారాలతో సహా దొరికినందున సత్యేంజర్ జైన్‌ను కూడా తొలగించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.