Monsoons  Andaman:  నైరుతి రుతుపవనాలు అండమాన్‌ను తాకాయి. ఈ సందర్భంగా భారత వాతావరణ శాఖ (IMD) కీలక సమాచారాన్ని వెల్లడించింది.   మే 13, మంగళవారం మధ్యాహ్నం నాటికి నైరుతి రుతుపవనాలు అండమాన్‌ను తాకాయి. దక్షిణ అండమాన్ సముద్రం, నికోబార్ దీవులు, దక్షిణ బంగాళాఖాతం,  ఉత్తర అండమాన్ సముద్రంలోని కొన్ని భాగాలకు రుతుపవనాలు విస్తరించాయి. రుతుపవనాల చురుగ్గా కదలికకు అనుకూలమైన వాతావరణం ఉందని IMD తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది, ఇది అల్పపీడనంగా మారవచ్చు. 

ఈ సంవత్సరం రుతుపవనాలు అంచనాల కంటే ముందుగా అండమాన్‌ను తాకాయి. 2009లో మే 23న కేరళను తాకిన తర్వాత, ఇది రెండవ ముందస్తు ఆగమనం అనుకోవచ్చు.  గత సంవత్సరం ఎల్‌నినో ప్రభావం వల్ల రుతుపవనాలు ఆలస్యమయ్యాయి, కానీ ఈ సంవత్సరం అనుకూల వాతావరణ పరిస్థితులు ముందస్తు ఆగమనానికి దోహదపడ్డాయి. మే 27 నాటికి నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉంది, ఇది సాధారణంగా జూన్ 1 నాటికి జరుగుతుంది జూన్ 12 నాటికి తెలంగాణను తాకవచ్చని, జూన్ రెండో వారం నుంచి ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు పుంజుకునే అవకాశం ఉందని IMD అంచనా వేసింది.  ఈ సంవత్సరం సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, ఇది జలాశయాల నింపడానికి, విద్యుత్ ఉత్పత్తికి , GDP  పెరుగుదలకు  కి దోహదపడుతుంది .                         నికోబార్ దీవుల్లో   భారీ వర్షాలు కురుస్తున్నాయి. అండమాన్ ,  నికోబార్ దీవుల్లో మే 14 నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు ప్రారంభమయ్యాయి.  భారతదేశంలో 52 శాతం సాగు భూమి వర్షాధారితమై ఉంది, మరియు దేశ వ్యవసాయ ఉత్పత్తిలో 40 శాతం ఈ భూముల నుంచి వస్తుంది. ఈ రుతుపవనాలు సకాలంలో వచ్చినందున వ్యవసాయ రంగానికి ఊతమిచ్చే అవకాశం ఉంది.  

  మే 22 నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది, ఇది మే 24 నాటికి వాయుగుండంగా బలపడవచ్చు. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అండమాన్‌తో పాటు, కోస్తా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD తెలిపింది. నైరుతి రుతుపవనాలు అండమాన్‌ను ముందుగానే తాకడం భారతదేశానికి శుభసూచకం అనుకోవచ్చు.   ఈ సంవత్సరం సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండటం వ్యవసాయ రంగానికి, ఆర్థిక స్థిరత్వానికి ఊతమిస్తుంది.