Pakistan Drone:



అమృత్‌సర్‌లో డ్రోన్...


పాకిస్థాన్ మరోసారి భారత్‌పై డ్రోన్‌ దాడి చేసేందుకు కుట్ర పన్నినట్టు  సమాచారం. సరిహద్దుకు సమీపంలో ఉన్న పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో సరిహద్దు భద్రతా బలగాలు (BSF) పాక్‌కు చెందిన ఓ డ్రోన్‌ను గుర్తించారు. షాహ్‌జాదా గ్రామంలో దీన్ని గుర్తించినట్టు వెల్లడించారు. అయితే ఈ డ్రోన్‌ చైనాకు చెందిందన్న అనుమానాలూ వ్యక్తం చేస్తున్నారు అధికారులు. ఇప్పటికే దీనిపై విచారణ మొదలు పెట్టారు. ఈ డ్రోన్ దొరికిన ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్‌ నిర్వహిస్తున్నారు. ఈ మధ్యే పాకిస్థాన్‌కు చెందిన ఓ డ్రోన్‌ను గుర్తించిన BSF సిబ్బంది దాన్ని కాల్చేశారు. 


"ఫిబ్రవరి 2-3వ తేదీల్లో తెల్లవారుజామున 2.30 గంటలకు పాకిస్థాన్‌కు చెందిన డ్రోన్‌ను గుర్తించాం. అమృత్‌సర్ సెక్టార్‌లోని  కక్కర్ బార్డర్ పోస్ట్ ఏరియాలో ఈ డ్రోన్‌ కనిపించింది. గుర్తించిన వెంటనే కాల్చేశాం. ఓ ఎల్లో పాలిథిన్ కవర్‌లో డ్రగ్స్‌ ఉన్నాయి. వాటిని సీజ్ చేశాం. దాదాపు 5 కిలోల హెరాయిన్‌ ఉంది. ఆ డ్రోన్‌పైన చైనా భాషలో రాసుంది. ఇంగ్లీష్ ట్రాన్స్‌లేషన్‌ కూడా ఉంది. మాకు తెలిసి పాకిస్థాన్, చైనా దేశాల్లో దీన్ని అసెంబుల్ చేసి ఉంటారు"
-BSF అధికారులు 


అంతకు ముందు ఫిబ్రవరి 1వ తేదీన 2.6 కిలోల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుంది BSF సిబ్బంది. సరిహద్దు ప్రాంతంలో డ్రోన్‌ నుంచి ఈ పార్సిల్‌ను కింద పడేసినట్టు అనుమానిస్తున్నారు.