డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి కేంద్ర ప్రభుత్వం నిబంధనలని మార్చింది.  కేంద్ర ప్రభుత్వం డ్రైవింగ్ లైసెన్స్‌ను చాలా సులభతరం చేసింది.   డ్రైవింగ్ లైసెన్స్ కోసం ప్రజలు ఇకపై ప్రాంతీయ రవాణా కార్యాలయాన్ని (RTO) సందర్శించాల్సిన అవసరం లేదు.  కొత్త రూల్ ప్రకారం.. ఇప్పుడు ఆర్టీవో ( RTO ) ఆఫీసు వద్దకు వెళ్లి ఎలాంటి డ్రైవింగ్ పరీక్ష చేయవలసిన అవసరం లేదు. ఈ నిబంధనలను కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ నోటిఫై చేసింది. మారిన నిబంధనలు  అమల్లోకి వచ్చాయి. ఈ కొత్త మార్పు వల్ల డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆర్టీఓ వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న కోట్లాది మందికి ఊరట లభించినట్లయింది.


డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి ఆర్టీవో వద్ద పరీక్ష కోసం వేచి ఉన్న దరఖాస్తుదారులందరు ఏదైనా గుర్తింపు పొందిన డ్రైవింగ్ శిక్షణ పాఠశాలలో డ్రైవింగ్ లైసెన్స్ కోసం నమోదు చేసుకోవాలి. అక్కడ డ్రైవింగ్ ట్రైనింగ్ స్కూల్ నుంచి శిక్షణ పొందాలి. పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. అప్పుడు దరఖాస్తుదారులకు డ్రైవింగ్ స్కూల్ ద్వారా సర్టిఫికేట్ అందుతుంది. ఈ సర్టిఫికేట్ ఆధారంగా దరఖాస్తుదారుడికి డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేస్తారు. శిక్షణా కేంద్రాలకు సంబంధించి రోడ్డు, రవాణా మంత్రిత్వ శాఖ నుంచి కొన్ని మార్గదర్శకాలు, షరతులు ఉంటాయి. ఇది శిక్షణా కేంద్రాల ప్రాంతం నుంచి శిక్షకుడి విద్య వరకు ఉంటుంది. నిబంధనల ప్రకారం అన్ని వివరాలు ఉంటేనే కేంద్రం డ్రైవింగ్‌ స్కూల్‌కి అనుమతి ఇస్తుంది.
    
కొత్తగా లైసెన్స్ కోసం అప్లై చేసే లెర్నర్స్ తమ లైసెన్స్ కోసం అర్హత సాధించడానికి ఏదైనా గుర్తింపు పొందిన డ్రైవర్ స్కూల్ కేంద్రాలలో శిక్షణ పొందాలి. మీరు డ్రైవింగ్ స్కూల్ నుండి డ్రైవింగ్ టెస్ట్ ను విజయవంతంగా పూర్తిచేయగాలిగితే, డ్రైవింగ్ లైసెన్స్ కోసం ప్రాంతీయ రవాణా కార్యాలయం నుండి డ్రైవింగ్ టెస్ట్ నుండి మీకు మినహాయింపు ఉంటుంది. అయితే ఇలా లైసెన్సులు జారీ చేసే డ్రైవింగ్స్ స్కూస్‌కు కట్టుదిట్టమైన రూల్స్ పెట్టారు.  


గుర్తింపు పొందిన డ్రైవింగ్ స్కూల్స్ మరియు గుర్తింపు పొందిన ఏజెన్సీలు ద్విచక్ర వాహనాలు, మూడు చక్రాల వాహనాలు మరియు తేలికపాటి మోటారు వాహనాల శిక్షణా కేంద్రాలకు కనీసం ఒక ఎకరం భూమి ఉండేలా చూడాలి. అదేవిధంగా, భారీ వాహనాలు మరియు కార్గో ట్రక్కుల ట్రైనింగ్ స్కూల్స్ కు 2 ఎకరాల స్థలం అవసరం .ఇంకో ముఖ్యమైన అవసరం ఏమిటంటే, ఎగ్జామినర్ కనీసం 12 తరగతి పాస్‌ కలిగి ఉండాలి.  డ్రైవింగ్ శిక్షణా కేంద్రాలు సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత, అది ఆటొమ్యాటిగ్గా సంబంధిత మోటారు వాహన లైసెన్స్ అధికారికి చేరుకుంటుంది.