Dressed As Bride And Groom Nagpur Couple Dies By Suicide On 28th Anniversary: నాగపూర్‌లో ఓ జంట తమ ఇరవై ఎనిమిదో పెళ్లి రోజును బంధువుల మధ్య ఉత్సాహంగా జరుపుతున్నారు. ఇద్దరూ పెళ్లి సమయంలో వేసుకున్న డ్రెస్‌లు వేసుకున్నారు.కొత్త పెళ్లి జంటలాగే గడిపారు. బంధువులు అందరితోనూ హ్యాపీగా గడిపారు. కానీ వారు అత్యంత కఠినమైన నిర్ణయం తీసుకోబోతున్నారని ఎవరూ ఊహించలేదు. అందరూ వెళ్లిపోయాక.. వారిద్దరూ పెళ్లి డ్రెస్‌లోనే తమ ప్రాణాలు తీసుకున్నారు.
నాగపూర్‌లో నివాసం ఉంటే టోని ఆస్కాం, అన్నీ అనే దంపతులు అందరితోనూ కలుపుగోలుగా ఉంటారు. వారికి పెద్దగా ఆర్థిక సమస్యలు కూడా లేవు. కానీ పిల్లలు లేరు. అయితే పిల్లలు లేరు అన్న బాధ ను వారు ఎప్పుడూ ఇరుగూ పొరుగువారితో వ్యక్తం చేయలేదు. అందరి పిల్లలను ఆదరించేవారు. కానీ వారి మనసులో మాత్రం గూడు కట్టుకుపోయింది. ఇరవై ఎనిమిదో పెళ్లి రోజుకు టోనీ ఆస్కార్‌కు 57 ఏళ్లు వచ్చాయి. అనారోగ్యం చాయలు కనిపిస్తున్నాయి. ఇక తాము ఒంటరి అనే భావన వారిలో పెరిగిపోతోంది. అందుకే వారిద్దరూ ఒకరికొకరు అప్పుడే ప్రాణాలు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. దానికి తమ పెళ్లి రోజునే ముహుర్తం పెట్టుకున్నారు.
తాము ఎందుకు చనిపోతున్నామో వారు వివరిస్తూ బంధుమిత్రుల కోసం ఓ వీడియో కూడా రికార్డు చేశారు. అందులో వారు తాము ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారో వివరించారు. క్రమంగా ఆర్థిక సమస్యలు పెరుగుతున్నాయని అదే సమయంలో పిల్లలు లేని లోటు మానసికంగా వేధిస్తోందని తెలిపారు. రాను రాను తాము ఒంటరి అయిపోతున్న భావనలోకి వెళ్లిపోతున్నామని..రేపు తమలో ఒకరికి ఏదైనా జరిగినా మరొకరు తట్టుకోలమని.. ఇద్దరం కలిసి చనిపోవాలని నిర్ణయించుకున్నామని ఆ వీడియోలో తెలిపారు.
Also Read: ఏమీ దొరకలేదని ఇంటావిడకు ముద్దు పెట్టి వెళ్లిన దొంగోడు - ఆమె కోవై సరళ అవతారమే ఎత్తిందంతే !
వీరు పంపిన వీడియోలు చూసి కాపాడుదామని వచ్చిన బంధువులకు అప్పటికే విగత జీవులుగా కనిపించారు. తాము రాత్రి చేసుకున్న పెళ్లి వేడుకలోని దుస్తులనే ధరించి ప్రాణాలు తీసుకున్నారు. ఈ దంపతులు ప్రపంచంలో పిల్లలు లేకపోవోడం అన్న ప్రధాన కారణంతో ఆత్మహత్య చేసుకున్నారని.. యుక్త వయసులో ఉన్నప్పుడు ధైర్యంగానే ఉన్నా.. వయసు పెరిగే కొద్దీ వారు ఒంటరి తనాన్ని పెంచుకున్నారని అందుకే మానసికంగా బలహీనమయ్యారని భావిస్తున్నారు.