అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సైన్స్ విద్యార్థులకు షాకిచ్చింది. ఒక్కసారిగా ఫీజులు డబుల్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆర్థికస్తోమతలేని వారు ఉన్నత విద్య చదివేందుకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఒక మార్గంగా ఉండేది. ఇప్పుడు ఫీజుల డబుల్ బాదుడుతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. అది కూడా డిమాండ్ ఉన్న సైన్స్ కోర్సుల ఫీజులనే పెంచడం విశేషం.



ఏ విద్యాసంస్థ అయిన నోటిఫికేషన్ విడుదల సమయంలో నిర్దేశిత ఫీజులతో బ్రౌచర్ విడుదల చేస్తుంది. అందుకు అనుగుణంగానే విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేస్తుంటాయి. కాని 2021-22 నోటిఫికేషన్‌లో చెప్పిన దానికి భిన్నంగా రెండో సంవత్సరం ఫీజును రెండింతలు చేసింది యూనివర్సిటీ.


 


గతేడాది అడ్మిషన్స్ దరఖాస్తులో ఎం.ఎస్.సీ సైకాలజీతో పాటు ఇతర సైన్స్ కోర్సుల ఫీజు రూ.7,400, రెండవ ఏడాదికి రూ. 7,200 అని క్లియర్ గా మెన్షన్ చేశారు. తొలి ఏడాదిలో చేరి, వార్షిక పరీక్షలు కూడా రాసిన విద్యార్థులకు రెండవ సంవత్సరం వార్షిక ఫీజు రూ.15,200 కట్టాలని యూనివర్సిటీ ఆదేశించింది.


విద్యాసంవత్సరం మొదటి సంవత్సరం ఫీజులను, రెండో సంవత్సరానికి రెట్టింపు చేయడం  నిబంధనలకు విరుద్ధం. అదే విషయాన్ని విద్యార్థులు అడుగుతున్నారు. పెంచిన ఫీజులను తగ్గించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. మొదటి సంవత్సరం ఫీజులనే రెండో సంవత్సరం కూడా కొనసాగించాలని కోరుతున్నారు. ఇప్పటికే ఉపకులపతికి వినతిపత్రం సమర్పించిన ఎలాంటి స్పందన లేకపోయింది. 


ఆర్ధిక స్థోమత అంతంత మాత్రంగా ఉన్న వాళ్లే ఎక్కువగా ఓపెన్ యూనివర్సిటీని ఆశ్రయిస్తారు. అందులోనూ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ పీజీ సైకాలజీ లో చేరి, మొదటి ఏడాది పూర్తి చేసిన విద్యార్థులు  ఇప్పుడు రూ 15,000  ఫీజు కట్టలేని పరిస్థితుల్లో తీవ్ర ఆందోళన లో ఉన్నారు.


 


Also Read: NTR Health University: పారా మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశాలు, చివరితేది ఇదే!



ఫీజుల వివరాలు..
1) ఎంకామ్ - రెండేళ్లు:  మొదటి సంవత్సరం-రూ.7800, రెండో సంవత్సరం-రూ.7,500 (యథాతథం)


2) ఎంఎస్సీ (మ్యాథమెటిక్స్/అప్లైడ్ మ్యాథమెటిక్స్): మొదటి సంవత్సరం-రూ.7800, రెండో సంవత్సరం-రూ.7,500


3) ఎంఎస్సీ (సైకాలజీ/బోటనీ/ఎన్విరాన్‌మెంట్ సైన్స్/జువాలజీ): మొదటి సంవత్సరం-రూ.15,300, రెండో సంవత్సరం-రూ.15000 (రెండింతలు పెంచారు) (2021-22 నోటిఫికేషన్ సమయంలో పేర్కొన్న ఫీజు: మొదటి సంవత్సరం - రూ.7800, రెండో సంవత్సరం - రూ.7,500)


4) ఎంఎస్సీ (కెమిస్ట్రీ): మొదటి సంవత్సరం-రూ.18,300, రెండో సంవత్సరం-రూ.18,000.


 


Also Read:

NTRUHS PG Admissions: పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్‌, చివరితేది ఇదే!
ఏపీలోని మెడికల్, డెంటల్ కళాశాలల్లో కాంపిటెంట్ కోటా కింద పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్  విడుదల చేసింది. దీనిద్వారా ఆయా కళాశాలల్లో పీజీ మెడికల్, పీజీ డెంటల్, పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ఆగస్టు 13న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆగస్టు 23న సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. ఈ కోర్సులకు ఎంబీబీఎస్/బీడీఎస్ డిగ్రీ అర్హతతోపాటు నీట్-పీజీ 2022/ నీట్ ఎండీఎస్ 2022 పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు పీజీ మెడికల్ కోర్సులకు 31.05.2022 నాటికి, పీజీ డెంటల్ కోర్సులకు 31.03.2022 నాటికి ఇంటర్న్‌షిప్ పూర్తిచేసి ఉండాలి. దరఖాస్తు ఫీజుగా అభ్యర్థులు రూ.7,080 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.5,900 చెల్లిస్తే సరిపోతుంది.
కోర్సుకు సంబంధించిన పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


 


Also Read:

CLAT 2023: కామ‌న్ లా అడ్మిష‌న్ టెస్ట్ (క్లాట్)-2023, దరఖాస్తు చేసుకోండి!

దేశవ్యాప్తంగా ఉన్న 22 జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల్లో డిగ్రీ, పీజీ లా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే 'కామ‌న్ లా అడ్మిష‌న్ టెస్ట్ (క్లాట్) - 2023' ప్రవేశ ప్రక‌ట‌న విడుదలైంది. దీనిద్వారా అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ లా డిగ్రీతోపాటు, ఏడాది కాలపరిమితి ఉండే పీజీ (ఎల్‌ఎల్‌ఎం) కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. డిగ్రీ కోర్సుకు ఇంటర్, పీజీ కోర్సులో ప్రవేశానికి లా డిగ్రీతో ఉత్తీర్ణత ఉండాలి. క్లాట్ ప్రవేశ పరీక్షకు సంబంధించి ఆగస్టు 8 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు నవంబరు 13 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. డిసెంబరు 18న ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నారు. ఆఫ్‌లైన్ విధానంలోనే పరీక్ష నిర్వహిస్తారు.
కామ‌న్ లా అడ్మిష‌న్ టెస్ట్ (క్లాట్)-2023 వివరాల కోసం క్లిక్ చేయండి


 


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..