గుప్పెడంతమనసు ఆగస్టు 19 శుక్రవారం ఎపిసోడ్ (Guppedantha Manasu August 19 Episode 533)
ఇకపై తనని సార్ అని పిలవొద్దని రిషి చెప్పడంతో పాటూ.. కాఫీ కావాలని అడిగి తీసుకుంటారు..నాకు మీరు చాలా మేలు చేశారంటూ థ్యాంక్స్ చెబుతాడు. ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్న జగతిని చూసి మహేంద్ర ఆనందంగా కన్నీళ్లు పెట్టుకుంటాడు.
అటు వసుధార తనలో తానే మాట్లాడుకుంటుంది.
వసుధార: సాక్షి వెళ్లిపోయినందుకు సంతోషించాలా అనుకుంటుంది. అయినా నేను సాక్షితో ఎప్పుడో చెప్పాను తనకి రిషి సార్ ని చేరుకునే స్థాయి లేదని అదే జరిగింది. ఈ ఉంగరంపై అనుకోకుండా నా పేరు పెట్టారా, కావాలనే పెట్టించారా. ఈ ఉంగరం నేనెలా పెట్టుకుంటాను..రిషి సార్ పెడితే బంధం అవుతుంది. వి ఒంటరిగా ఎలా ఉంటుంది..ఆర్ చేరితేనే బావుంటుంది. ఓ బుక్ ఓపెన్ చేసి V ఫర్ వసుధార, R ఫర్ రిషి సార్ అని రాస్తుంది. R అక్షరం బంగారంతో చేయించాలంటే చాలా ఖర్చవుతుంది కదా...కనీసం రెండు మూడు గ్రాములైనా పడుతుందేమో..ఎలాగోలా ప్లాన్ చేయాలి. VR రెండు అక్షరాలు కలపిరాసి జంటగా భలే కనిపిస్తున్నాయ్ అనుకుంటుంది...
Also Read: డాక్టర్ బాబుని తీసుకెళ్లిపోయిన మోనిత, మళ్లీ వంటలక్కకు కష్టాలు మొదలు
అటు కాలేజికి బయలుదేరుతారు జగతి,మహేంద్ర.. రిషి నిన్ను సార్ అని పిలవొద్దన్నాడంటే అర్థం ఏంటని మహేంద్ర అంటే.. అస్తమానం సార్ అని పిలుస్తుంటే ఇబ్బందిగా ఉందేమో అందుకే అలా అని ఉంటాడాని క్లారిటీ ఇస్తుంది జగతి. ఇంతలో టైర్ పంచరవడంతో ఏం చేయాలని ఆలోచిస్తారు. కోపంగా చూడకు జగతి అంటూ క్యాబ్ బుక్ చేస్తానంటాడు మహేంద్ర. ఇంతలో రిషి వచ్చి గుడ్ మార్నింగ్ చెబుతాడు. మహేంద్ర వచ్చి ప్రేమగా హగ్ చేసుకుంటాడు. క్యాబ్ బుక్ చేస్తున్నానని మహేంద్ర చెప్పడంతో.. నేను కూడా ఇంట్లో సభ్యుడినే..కారు పాడైపోతే లిఫ్ట్ అడగొచ్చు అంటూ..రండి వెళదాం అని పిలుస్తాడు. వెనుక రిషి కూర్చుంటే ముందు జగతి, మహేంద్ర కూర్చుంటారు.
అటు వసుధార ఆటోకోసం ఎదురుచూస్తుంటుంది..ఇప్పుడు ఆటోలో వెళితే డబ్బులు అనవసరంగా ఖర్చైపోతాయి.. ఇప్పుడు డబ్బులు మిగిల్చితేనే ఆ ఉంగరం కొనేందుకు డబ్బులు మిగులుతాయి అనుకుంటూ నడుస్తుంటుంది. ఇంతలో వసుని చూసి జగతి కారు ఆపుతుంది..రిషి సార్ అనుకుంటూ వసు పరిగెత్తుకు వస్తుంది. మేడం మీరున్నారా ..సార్ కారు మీరు.. సార్ ఏరి అని అడిగితే వెనుక చూడమని సైగ చేస్తుంది జగతి. వసుధార కారెక్కుతుంది.నేను డ్రైవ్ చేస్తానంటూ మహేంద్ర డ్రైవింగ్ సీట్లో కూర్చుంటాడు. రిషి-వసుని దగ్గరచేసేందుకు కావాలని కారుని అడ్డదిడ్డంగా నడుపుతాడు. ఏంటిది డాడ్ అని రిషి.. ఏంటి మహేంద్ర అని జగతి కోప్పడతారు.
Also Read: వసుకి క్యారియర్ పంపించి జగతికి అన్నం తినిపించిన రిషి, దేవయానిలో మొదలైన భయం
క్లాస్ రూమ్ లో కూర్చున్న వసుధార..ఆర్ అనే అక్షరంతో ఉంగరం చేయించడం గురించి ఆలోచిస్తుంది. ఏం ఆలోచిస్తున్నావ్ వసుధారా అని అడిగితే..వంద ఆలోచిస్తుంటాను పుష్ప..ఏం చెబుతాను చెప్పు అని రిప్లై ఇస్తుంది. గ్రాము బంగారం ఎంత, ఉంగరం చేయించడానికి ఎంతవుతుందని లెక్కలేస్తుంటుంది. ఇంతలో రిషి వస్తాడు కానీ వసుధార మాత్రం చూసుకోకుండా బంగారం ఆలోచనల్లోనే ఉంటుంది. వసుధార అని రిషి పిలవడంతో..గ్రాము 4950 రూపాయలు సార్ అంటుంది. గ్రాము ఏంటని అడిగిన రిషితో గుడ్ మార్నింగ్ సార్ అని రిప్లై ఇస్తుంది. వసుధారకి ఏమైందని ఆలోచించిన రిషి..తన దగ్గరకు వెళ్లి నోట్ బుక్ తీసుకుని క్లాస్ ప్రారంభిస్తాడు. రిషి క్లాస్ చెబుతున్నా కానీ వసుమాత్రం బంగారం ఎలా కొనాలా అనే ఆలోచనలోనే ఉంటుంది. వసుధారా ఏం చేస్తున్నావ్ అని మళ్లీ అడిగిన రిషి..ఈ ప్రాబ్లెమ్ కంప్లీట్ చేయి అంటాడు...వసు బోర్డు దగ్గరకు వెళ్లడంతో..రిషి వెళ్లి వసు ప్లేస్ లో కూర్చుంటాడు.
ఎపిసోడ్ ముగిసింది
Also Read: నేను గెలిచాను వసుధార అన్న ఈగోమాస్టర్, జగతికి బంపర్ ఆఫర్ ఇచ్చిన రిషి