కమలకి ఆడపిల్ల పుడుతుంది. తనని తీసుకుని ముద్దాడినట్టు రుక్మిణి ఊహించుకుంటుంది. కిటిటికిలోనుంచి వాళ్ళని చూసి ఎమోషనల్ అవుతుంది. కడుపుతో ఉన్న బిడ్డని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్లావ్ అని భాషా భాగ్యమ్మని అడుగుతాడు. కమల నీకోసం ఎన్నిసార్లు బాధపడిందో తెలుసా అని అంటాడు. నువ్వు ఎక్కడ ఉన్నావో మాకు ఎవరికి తెలియదు మరి కమలకి బిడ్డ పుట్టినట్టు నీకేలా తెలుసు సీదా దవాఖానాకి వచ్చావ్ అని భాషా అనుమానంగా అడుగుతాడు. ఏం చెప్పాలో తెలియక నీళ్ళు నములుతుంటే.. ఎలాగో వచ్చింది కదా అయినా మన ఇంట్లో బిడ్డ పుట్టిందంటే ఊళ్ళో తెలియకుండా ఎట్లా ఉంటుంది అని ఆదిత్య కవర్ చేసేందుకు ప్రయత్నిస్తాడు. అవును ఆఫీసర్ సార్ ఇంట్లో బిడ్డ పుట్టిందని అనుకుంటుంటే విన్నాను కడుపుతో ఉన్నది కమలే కదా అందుకే సీదా వచ్చినా అని భాగ్యమ్మ చెప్తుంది. ఇక నుంచైనా ఇంటి దగ్గరే ఉంది కమలని చూసుకోమని దేవుడమ్మ భాగమ్మకి చెప్తుంది.


భాగ్యమ్మ ఎవరికి అనుమానం రాకుండా కిటికీ దగ్గరకి బిడ్డని తీసుకొచ్చి రుక్మిణికి చూపిస్తుంది. పసిబిడ్డని చూసి మురిసిపోతుంది. హాల్లో మాధవ కూర్చుని ఉంటాడు చూసినా కూడా పట్టించుకోకుండా రాధ వెళ్లిపోవడంతో పిలుస్తాడు. చెక్ డ్యామ్ ల నేను ఇక్కడే ఉంటే పట్టించుకోకుండా వెళ్లిపోతున్నావ్ ఏంటి అని అడుగుతాడు. వాగులే వరదలైతే డ్యామ్లు కొట్టుకుపోతాయి చెక్ డ్యామ్ ఎంత అని రాధ కౌంటర్ ఇస్తుంది. నువ్వు మాటకి మాట సమాధానం చెప్తే భలే ఉంటుందని మాధవ అంటాడు. మాట దగ్గరే ఆగినా సారు అది దాటినా అంటే నువ్వు తట్టుకోలేవు అని హెచ్చరిస్తుంది. నీకు భయపడే దాన్ని కాదు నేను చిన్నప్పటి నుంచి నా కష్టం మీద బతికినదాన్ని ఊరంతా దేవతగా కొలిచే దేవుడమ్మ కోడలిని ఆఫీసర్ సార్ ఆదిత్య పెళ్ళాన్ని అని రాధ చాలా ధైర్యంగా చెప్తుంది. తెలుసు రాధ నీ కాన్ఫిడెన్స్ నాకు తెలుసు కానీ అదే నన్ను రెచ్చిపోయేలా చేస్తుందని అంటే రెచ్చిపోతే సచ్చిపోతావు సారు అది నీకు తెలియడం లేదని అంటుంది.


Also Read: నేను గెలిచాను వసుధార అన్న ఈగోమాస్టర్, జగతికి బంపర్ ఆఫర్ ఇచ్చిన రిషి


మాధవ: మొన్న నేను ఇచ్చిన షాక్ కి నేనంటే ఎంటో నీకు ఆదిత్యకి అర్థం అయినట్టు లేదు నువు ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నావ్ అంటే నువ్వు ఆదిత్య కలిసి ఏదైనా ప్లాన్ చేశారా? చేసే ఉంటారులే. అదే దేవిని వాళ్ళ నాన్న దగ్గరకి చేర్చేందుకు ఏమి ప్లాన్ చెయ్యలేదా అదే ఇప్పటికే చాలా రోజులు గడిచిపోయాయి కదా


రాధ: మేము ఏం చెయ్యాలో మాకు తెలుసు నువ్వు చెప్తే చేస్తామా


మాధవ: ఇంత జరిగినా మీరు దేవి వైపు చూడటం లేదంటే నాకు తెలియకుండా ఏదో జరుగుతుందని అనిపిస్తుంది


రాధ: నీలెక్క చాటుగా చేస్తామని అనుకుంటున్నావా గసువంటి గలిజ్ పనులు చేసేది నువ్వు.. అయినఅ నా పెనిమిటి దేవమ్మకి నాయన అని ఆ దేవుడు ఎప్పుడో రాశి పెట్టాడు. నీలాంటి వాళ్ళు ఏం చేసినా ఆ రాత మారదు. అయినఅ ఇంట్లో నువ్వు ఏం చేసినా నేను ఎందుకు ఊరుకుంటున్నానో నీకు సమజ్ కాదు


మాధవ: ఊరుకునేలా నేను చేస్తున్న కదా రాధ. నన్ను కాదని నువ్వు ఈ గడప దాటలేవు దేవి ఆదిత్య ఇల్లు చెరలేదు


రాధ: గట్లని నువ్వు కలలు గనకు నువ్వు ఏం చేసినా ఎన్ని ప్రయత్నాలు చేసిన నా బిడ్డని వాళ్ళ నాయన దగ్గరకి పోకుండా ఆపలేవు అనేసి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.


లేక లేక ఈ ఇంట్లో బిడ్డ పుట్టింది అందుకే దానికి ఘనంగా బారసాల చేయించాలని అనుకుంటున్నాను అని దేవుడమ్మ తన భర్తకి చెప్తుంది. మనకి సత్య, కమల ఇద్దరు ఒక్కటే కదా తప్పకుండా చేద్దామని అంటాడు. రాధ ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తుంటే భాగ్యమ్మ అక్కడికి వస్తుంది. కమలవ్వ బిడ్డకి రేపు బారసాల చేస్తున్నారు సొంత అక్క బిడ్డకి నువ్వు లేకపోతే లోటు కదా అని అంటుంది. రావలనుకున్నా ఎలా వస్తాను అని రుక్మిణి బాధపడుతుంది. 'బిడ్డా నేను ఎప్పుడు ఏది అడగలేదు నా కోరిక తీరుస్తావా? నా ముగ్గురు బిడ్డల్ని ఒక చోట చూసి చాలా దినాలు అయినాది నేను పెద్దదాన్ని అవుతున్నా నేను పొయేలోపు మీ ముగ్గుర్ని ఒక చోట చూడాలని ఆశపడుతున్నా. అందుకే ఆ వేడుకలకి నువ్వు వస్తే మంచిగా ఉంటది.. వస్తావా బిడ్డా' అని భాగ్యమ్మ అడుగుతుంది. ఎట్లా వస్తాను రాని చావుని రాసుకుని వాళ్ళందరి ముందు చచ్చిపోయాను ఇప్పుడు వాళ్ళందరి ముంగటకి ఎట్లా రావలే.. అడక్క అడక్క ఒక్కటి అడిగినావ్ దాన్ని తీర్చలేను రాని రుక్మిణి బాధపడుతుంది. అలా అనకు బిడ్డ ఇది నా చివరి కోరిక అనుకో రావలనుకుంటే ఎలాగైనా వస్తావ్ అని భాగ్యమ్మ అంటుంది.


Also Read:  శౌర్యకి వాటర్ బాటిల్ కొనిచ్చిన దీప, ఎంట్రీ ఇచ్చిన డాక్టర్ బాబు -మోనిత కోసం వెయిటింగ్


జానకి దేవి, చిన్మయిలకి అన్నం తినిపిస్తూ ఉంటుంది. అప్పుడే అటుగా రావడం చూసిన మాధవ తల్లి దగ్గరకి వెళ్ళి నాకు కూడా గోరు ముద్దలు పెట్టమ్మా అని అడుగుతాడు. ‘నీ చేతి గోరుముద్ద నన్ను ఎప్పుడు గెలిపిస్తూనే వచ్చింది. పరీక్షలకి వెళ్తా నీ గోరుముద్దలు తిని రాశాను, ఇప్పుడు కూడా ఒక పరీక్ష రాయబోతున్నాను అందులో కూడా పాస్ అవ్వాలని ఆశీర్వదిస్తూ గోరుముద్దలు పెట్టమని అంటాడు. ఇప్పుడు నీకేం పరీక్ష నాన్న అని చిన్మయి అడుగుతుంది. ఒకటి ఉందిలే అని అంటాడు. నాయన చెప్తున్నాడు కదా పాస్ కావాలని ఆశీర్వదిస్తూ ఒక ముద్ద పెట్టరాదు అని దేవి కూడా అడుగుతుంది. అదంతా వింటున్న రుక్మిణి ఈ మాధవ సారు మళ్ళీ ఏం కథ పడుతున్నాడో అని అనుకుంటుంది.