Tesla Optimus Robots: 


ఆప్టిమస్ రోబోలు 


ఎలన్‌ మస్క్ పేరు ప్రస్తావించని రోజు గడవదు మీడియాకి. అంతలా ఎప్పుడూ వార్తల్లోనే ఉంటారాయన. ట్విటర్ సీఈవోగా బాధ్యతలు చేపట్టిన తరవాత సంచలన నిర్ణయాలతో ఇంకా ఫేమస్ అయిపోయారు. ఈ సారి కూడా మళ్లీ ట్రెండ్ అవుతున్నారు. కానీ...ఇప్పుడు ట్వీట్‌లతో కాదు. ఫోటోలతో. ఫోటోలతో ట్రెండ్ అయ్యేదేముంది..? అని లైట్ తీస్కోకండి. ఇక్కడే అసలైన ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. ఆయన నలుగురు అమ్మాయిలకు ముద్దులు పెడుతూ ఫోటో షూట్ చేయించుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కానీ...ట్విస్ట్ ఏంటంటే...ఆయన ముద్దాడిన అమ్మాయిలు..నిజమైన అమ్మాయిలు కాదు. కేవలం రోబోలు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్‌తో వీటిని తయారు చేశారు. Daniel Mavern అనే ఓ ట్విటర్ యూజర్ ఈ ఫోటోలను ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. ఎలన్ మస్క్ తన ఫ్యూచర్ వైఫ్‌లను పరిచయం చేశాడంటూ ఫన్నీగా పోస్ట్ పెట్టాడు. తొలి ఫిమేల్ రోబోట్ అని...మస్క్ దగ్గరుండి మరీ తనకు నచ్చిన ఫీచర్‌లతో ఈ రోబోలను తయారు చేయించుకున్నాడని చెప్పాడు ఆ యూజర్. అసలు ఇలాంటి పర్సనాలిటీతో ఈ భూమ్మీద ఏ అమ్మాయి కనిపించదని, అంత యునిక్‌గా వీటిని డిజైన్ చేయించారని వివరించాడు. వీటిలో Catnilla Robot ని సోలార్ పవర్‌తో ఛార్జ్ చేయనున్నట్టు చెప్పాడు. అంతే కాదు. మనుషుల్లాగే వీటికీ ఫీలింగ్స్ ఉండేలా స్పెషల్ సెన్సార్లు కూడా అమర్చారు. టెస్లా కంపెనీ వీటికి "Optimus" అని పేరు పెట్టింది. వీటిని AI Toolతో డిజైన్ చేశారు.