Delhi HC Summons BBC:
డాక్యుమెంటరీ వివాదంలో..
ఢిల్లీ హైకోర్టు BBCకి సమన్లు జారీ చేసింది. పరువు నష్టం దావా కేసులో ఈ నోటీసులు ఇచ్చింది. గుజరాత్‌కు చెందిన Justice On Trial NGO ఈ పిటిషన్ వేసింది. ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా గుజరాత్ అల్లర్లపై డాక్యుమెంటరీ చేయడాన్ని వ్యతిరేకిస్తూ కోర్టుని ఆశ్రయించింది. అంతే కాదు. భారత దేశ పరువుని దిగజార్చాలని చూసిందంటూ పిటిషన్‌లో పేర్కొంది. పిటిషనర్‌లు చెప్పినట్టుగానే ఆ డాక్యుమెంటరీ ప్రధాని పరువుకి భంగం కలిగించిందని తేల్చి చెప్పింది న్యాయస్థానం. ఈ మేరకు BBCకి నోటీసులిచ్చింది.
"బీబీసీ డాక్యుమెంటరీ ప్రధాని పరువుకి భంగం కలిగించేలా ఉండడమే కాదు. భారత దేశ ప్రతిష్ఠకూ మచ్చ తెచ్చే విధంగా ఉంది. అన్ని విధాలుగా విచారించి బీబీసీకి నోటీసులు పంపుతున్నాం"
- ఢిల్లీ హైకోర్టు
కించపరిచారంటూ వాదన..
ఎన్‌జీవో తరపున వాదించిన సీనియర్ అడ్వకేట్ హరీష్ సాల్వే కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ డాక్యుమెంటరీ దేశ న్యాయవ్యవస్థనీ కించపరిచిందని మండి పడ్డారు. ఈ నెల 3వ తేదీన ఢిల్లీ ట్రయల్ కోర్టు బీబీసీతో పాటు వికీమీడియా, ఇంటర్నెట్ ఆర్కీవ్ సంస్థలకూ నోటీసులు జారీ చేసింది. ఓ బీజేపీ నేత వేసిన పిటిషన్ ఆధారంగా...విచారించిన ట్రయల్ కోర్టు ఆయా సంస్థలకు సమన్లు జారీ చేసింది. "బీబీసీ డాక్యుమెంటరీ బీజేపీ, ఆర్ఎస్ఎస్, వీహెచ్‌పీ లాంటి ప్రముఖ సంస్థలను కించపరిచింది" అని పిటిషన్‌లో ప్రస్తావించారు ఆ బీజేపీ నేత. ప్రభుత్వం దీనిపై బ్యాన్ విధించినా...వికీపీడియాలో ఇంకా లింక్స్ కనిపిస్తున్నాయని, ఇంటర్నెట్ ఆర్కీవ్స్‌లోనూ వీడియోలు కనిపిస్తున్నాయని చెప్పారు.