Telugu News: మహారాష్ట్రలోని థానేలో దారుణం జరిగింది. ఓ 9 ఏళ్ల బాలుడి కాలికి సర్జరీ చేయాల్సింది పోయి మర్మాంగానికి సర్జరీ చేసిన ఘటన సంచలనమైంది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని బాధితుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వీళ్లు చెప్పిన వివరాల ప్రకారం...గత నెల స్నేహితులతో ఆడుకుంటుండగా కాలికి దెబ్బ తగిలింది. వెంటనే బాలుడిని హాస్పిటల్‌లో చేర్చారు. వైద్యులు సర్జరీ చేయాల్సి ఉంటుందని చెప్పారు. జూన్ 15న హాస్పిటల్‌లో చేర్చారు. అప్పటి నుంచి ట్రీట్‌మెంట్ నడుస్తోంది. ఈ మధ్యే సర్జరీ చేయాల్సి ఉండగా కాలికి కాకుండా మర్మాంగానికి చేశారు. తప్పు తెలుసుకున్న వెంటనే కాలికి కూడా సర్జరీ చేశారు వైద్యులు. దీనిపై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపించి తీరాలని డిమాండ్ చేశారు. అయితే..ఈ ఘటనపై ఆ హాస్పిటల్ మెడికల్ ఆఫీసర్ స్పందించారు. కాలితో పాటు మర్మాంగం వద్ద కూడా సమస్య ఉన్నట్టు గుర్తించామని వివరించారు. ఇదే విషయాన్ని వైద్యులతో చెప్పి రెండు సర్జరీలు చేయాలని సూచించినట్టు వెల్లడించారు. అయితే వైద్యులు బాలుడి తల్లిదండ్రులకు ఇదంతా చెప్పలేదు. ఇందులో తమ తప్పు ఏమీ లేదని, సమస్య ఉండబట్టే సర్జరీ చేశామని వైద్యులు తేల్చి చెబుతున్నారు. అటు తల్లిదండ్రులు మాత్రం వైద్యులు ఇచ్చే వివరణను కొట్టి పారేస్తున్నారు. 


Also Read: Arwind Kejriwal: కేజ్రీవాల్‌కి మళ్లీ షాక్‌, 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీ కోరిన సీబీఐ - అంగీకరించిన కోర్టు