ABP  WhatsApp

Diwali Bonus: ఆ ఉద్యోగులకు కేంద్రం గుడ్‌ న్యూస్- దీపావళి కానుకగా 78 రోజుల బోనస్!

ABP Desam Updated at: 12 Oct 2022 04:42 PM (IST)
Edited By: Murali Krishna

Diwali Bonus: రైల్వే ఉద్యోగులకు దీపావళి కానుకగా బోనస్ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం.

ఆ ఉద్యోగులకు కేంద్రం గుడ్‌న్యూస్- దీపావళి కానుకగా 78 రోజుల బోనస్!

NEXT PREV

Diwali Bonus for Railway Employees: రైల్వే ఉద్యోగులకు కేంద్రం తీపి కబురు చెప్పింది. దీపావళి కానుకగా బోనస్ ప్రకటించింది. రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్ ఇస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ బుధవారం సమావేశమై నిర్ణయం తీసుకుంది.


కానీ


బోనస్ విషయంలో కేంద్రం ఓ చిన్న ట్విస్ట్ ఇచ్చింది. ఇది ప్రొడెక్టివిటీ లింక్‌డ్ బోనస్ అని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. మొత్తం 11.27 లక్షల మంది రైల్వే ఉద్యోగులు గరిష్ఠంగా రూ.17,951 పొందుతారని వివరించారు.







11.27 లక్షల మంది రైల్వే ఉద్యోగులకు ప్రొడెక్టివిటీ ఆధారితంగా 78 రోజుల బోనస్ ఇస్తున్నాం. ఇందుకోసం రూ.1,832 కోట్లు కేటాయించాం. ఉద్యోగులు గరిష్ఠంగా రూ. 17,951 పొందే అవకాశం ఉంది.                          - కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్


నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు పెర్ఫామెన్స్ ఆధారిత ఇన్సెంటివ్ ఇవ్వనున్నట్లు కేంద్రం ఎప్పుడో తెలిపింది. అలాగే ఆయిల్ సంస్థలకు రూ.22 వేల గ్రాంట్‌ను మంజూరు చేయనున్నట్లు ఠాకూర్ తెలిపారు.


కేబినెట్ నిర్ణయాలు


ఈ సందర్భంగా కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలను అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా ఎల్‌పీ‌జీ ధరలు పెరుగుతున్న కారణంగా సామాన్యులపై ఆ ప్రభావం పడకుండా పబ్లిక్ సెక్టార్‌లోని  ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు రూ.22 వేల కోట్లు ఒన్ టైమ్ గ్రాంట్‌గా ఇవ్వాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది.



'ప్రైమ్ మినిస్టర్ డెవెలప్‌మెంట్ ఇనీషియేటివ్ ఫర్ నార్త్ ఈస్ట్ రీజియన్' అనే కొత్త పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 2022-23 నుంచి 2025-26 వరకూ పదిహేనో ఆర్ధిక కమిషన్ ప్రకారం ఈ కొత్త పథకం అమలవుతుంది. మల్టీ స్టేట్ కో ఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ 2002ను సవరిస్తూ మల్టీ స్టేట్ కో ఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ 2022కు కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.                                    - అనురాగ్ ఠాకూర్, కేంద్ర మంత్రి


Also Read: Jharkhand Viral News: హనుమంతుడికి రైల్వేశాఖ నోటీసులు- 10 రోజుల్లో ఆలయం ఖాళీ చేయాలట!


Also Read: UIDAI Aadhaar Card Update: ఆధార్ తీసుకుని 10 ఏళ్లు దాటిందా? అర్జెంటుగా ఈ పని చేయండి!


 

Published at: 12 Oct 2022 04:36 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.