యసుతో సంబంధం లేకుండా ఇప్పుడు అందరూ కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. ఎక్కువ సేపు నడవలేరు, నిలబడలేరు, కింద కూర్చుని తమ సొంత పనులు కూడా చేసుకోలేకపోతున్నారు. కారణం ఆర్థరైటిస్ వ్యాధి. ఇది ఒకసారి వస్తే తగ్గడం అనేది అసాధ్యమనే చెప్పాలి. రోగి పరస్థితిని బట్టి ఆర్థరైటిస్ రెండు రకాలుగా ఉంటుంది. ఆస్టియా ఆర్థరైటిస్ లేదా రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనే విషయాన్ని వైద్యులు పరిశీలించి చెబుతారు. గతంలో అయితే ఇది ఎక్కువగా వృద్ధాప్యంలో వచ్చేది కానీ ఇప్పుడు ఆహార మార్పులు, అనారోగ్య జీవనశైలి కారణంగా ముందే వచ్చేస్తుంది. ఈ నేపథ్యంలో డాక్టర్ బెజవాడ పాపారావు గారు ఇచ్చిన అమూల్యమైన సూచనలు, విశేషాలు మీ కోసం. 


నిద్రలేమి సమస్య 


ఆర్థరైటిస్ తో బాధపడే వాళ్ళు ఎక్కువగా నిద్రలేమికి గురవుతారు. కీలు కీలు మధ్య వచ్చే ఈ నొప్పులు రోగిని మరింత బాధపెడతాయి. నడిచేటప్పుడు లేదా కూర్చునేటప్పుడు కీలు కీలు మధ్య రాపిడి జరిగి చిన్న శబ్ధం వస్తుంది. ఈ ఆర్థరైటిస్ తో బాధపడుతున్న వారిలో కీళ్ల మధ్య ఉన్న జిగురు వంటి పదార్థం అరిగిపోడం, ఆ ప్రాంతంలో ఎర్రగా అవ్వడం లాంటివి తరుచుగా చూడవచ్చు.  ఆస్టియో ఆర్థరైటిస్ తో బాధపడే వాళ్ళు నొప్పి కారణంగా నడిచేందుకు చాలా ఇబ్బంది పడతారని విజయవాడ కామినేని హాస్పిటల్ డాక్టర్ బెజవాడ పాపారావు గారు చెప్పుకొచ్చారు. ఆర్థరైటిస్ తో బాధపడే వారిలో నిరాశ, నిద్రలేమి కూడా ఎక్కువగా ఉంటుందని అన్నారు. ఇది మానసికంగా కూడా ఇబ్బంది పెట్టే అవకాశం లేకపోలేదని చెప్తున్నారు.


డీజెనరేటివ్ ఆర్థరైటిస్ సాధారణ లక్షణాలు


శరీరంలో వ్యాధి ఎక్కడ అభివృద్ధి చెందుతుంది అనే దానిపై డీజెనరేటివ్ ఆర్థరైటిస్ లక్షణాలు ఆధారపడి ఉంటుంది. ఇది ఒక్కసారిగా దాని ప్రభావం చూపకుండా.. కాలక్రమేణా తీవ్రమవుతుంది. ఆర్థరైటిస్ ప్రభావం కీళ్లపై ఎక్కువగా ఉండి తరుచూ నొప్పికి దారి తీస్తుంటాయి.  ఒక్కోసారి కీ ళ్ల వాపు కూడా గమనించవచ్చు. కీళ్లు మధ్యలో మృదులాస్థి దెబ్బతిన్న ప్రాంతంలో వాపు ఎక్కువగా వస్తుంటుంది. చిన్న చిన్న పనులకు గానూ మనం వంగినప్పుడు కీళ్లు  ఉండే ప్రాంతాల్లో  ఒక రకమైన శబ్దం వస్తుంటుంది. 


ఈ వ్యాధి ప్రభావం అయ్యే శరీర భాగాలు 


నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆర్థరైటిస్ అండ్ మస్క్యులోస్కెలెటల్ అండ్ స్కిన్ డిసీజెస్ ప్రకారం మన శరీరంలోని  బ్రొటన వేళ్లు, మిగతా వేళ్లపై  ఆర్థరైటిస్ ప్రభావం ఉంటుంది. కేవలం వీటిపైనే కాకుండా వీపు భాగం, మోకాలు, నడుము భాగాలపై కూడా దీని ప్రభావం ఉంటుంది.


ఆర్థరైటిస్ రావడానికి కారణాలు ఏంటి..?


ఎముకల మధ్య ఉమ్మడి మృదులాస్థి దెబ్బతిన్నప్పుడు లేదా విరిగిపోయినప్పుడు డీజెనరేటివ్ ఆర్థరైటిస్ వస్తుంది. డ్యామేజ్‌ని రిపేర్ చేయడానికి ప్రయత్నించడానికి, శరీరం తరచుగా రిపేర్ మెకానిజంను యాక్టివేట్ చేస్తుంది. దీని ఫలితంగా ఎముక చివరలో బోన్ స్పర్స్ లేదా ఆస్టియోఫైట్స్ ఏర్పడవచ్చు. ఇవి అప్పుడు కీళ్ల మధ్య ఘర్షణకు కారణమవుతాయి, ఫలితంగా సదరు వ్యక్తి  ఆ శరీర భాగాలను ఉపయోగించినప్పుడు నొప్పి వస్తుంది.


చికిత్స


డిజెనరేటివ్ ఆర్థరైటిస్‌ను వివిధ మార్గాల్లో చికిత్స చేయవచ్చని డా. పాపారావు చెప్తున్నారు. ఈ పరిస్థితి ఉన్న కొందరు రోగులు చికిత్సల నుంచి ప్రయోజనం పొందవచ్చని అంటున్నారు. కీళ్ల వాపు, నొప్పులు వంటి వాటిని చికిత్స ద్వారా తగ్గించవచ్చు. దీనికి చికిత్స తీసుకుంటే గతంలో కంటే పనితీరు మెరుగుపరుస్తుంది. నొప్పి నుంచి కొంతవరకు ఉపశమనం లభిస్తుంది. 


ఆర్థరైటిస్ ను పూర్తిగా నివారించగలమా..?


ఆస్టియో ఆర్థరైటిస్‌ను పూర్తిగా నివారించే మార్గం లేదు. కానీ కీళ్లను రిపేరు చేసి సవరించవచ్చు. కొన్ని మందులు వాడితే తగ్గుతాయి. కనీసం 50 శాతం వరకు మందులతో తగ్గించవచ్చు. మరికొందరులో అయితే మార్పిడి కూడా చేస్తారు.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also read: బిర్యానీ ఆకు రుచే కాదు బోలెడు ఆరోగ్యాన్ని ఇస్తుందండోయ్


Also Read: బరువు తగ్గాలని అనుకుంటున్నారా? ఈ ఐదు ఫుడ్స్ ఎంపిక చేసుకుంటే సరి