మాజీ ప్రధాని దేవేగౌడ ప్రత్యేక విమానానికి ఓనర్ అయ్యారు. ఇష్టపడి కొనుగోలు చేసిన చార్టెడ్ ఫ్లైట్‌ను ముందుగా శ్రీవారి పాదాల ముందు ఉంచి ప్రత్యేక పూజులు చేయించేందుకు తిరుపతికి తీసుకు వచ్చారు. ప్రత్యేక పూజల కోసం ముందుగా ఆ విమానాన్ని తిరుపతికి తీసుకువచ్చారు. ఆ తర్వాత మరో ప్రత్యేక విమానంలో దేవగౌడ కుటుంబం తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు వచ్చారు. అందరూ కలిసి ఇంటర్నేషనల్ టెర్మినల్ లో ఉన్న విమానాన్ని పరిశీలించారు. ఆ తర్వతా ప్రత్యేక పూజల్లో పాల్గోన్నారు.
దేశంలో శ్రీమంతులు ప్రత్యేక విమానాలు కొనుగోలు చేసిన తర్వాత శ్రీవారి చెంతకు తీసుకు వచ్చి ప్రత్యేక పూజలు చేయిస్తారు. విమానయాన సంస్థలు కూడా అదే సెంటిమెంట్ ఫాలో అవుతాయి. దేశంలో ఎవరు ఏ కొత్త విమానం కొన్నా ముందుగా శ్రీవారి చెంత ప్రత్యేక పూజలు చేయాల్సిందే. ఆ సెంటిమెంట్‌నే మాజీ ప్రధాని దేవేగౌడ కూడా ఫాలో అయ్యారు. ప్రత్యేక విమానానికి శ్రీవారి చెంత తొలి పూజ చేశారు.
దేవేగౌడ మాజీ ప్రధాని, ఆయన తన పార్టీ జనతా దళ్ సెక్యూలర్ కీలక నేతగా ఉన్నారు. ఆ పార్టీకి సుప్రీం అయినప్పటికీ.. ఆయన కుమారుడు కుమారస్వామినే పార్టీని నడిపిస్తారు. వయోభారం కారణంగా దేవేగౌడ పార్టీ కార్యక్రమాలను పరిమితంగానే పట్టించుకుంటూ ఉంటారు. అయితే పార్టీ పరమైన విధాన నిర్ణయాల్లో మాత్రం ఇప్పటికీ కీలకంగా ఉంటారు.
దేవేగౌడ విమానాన్ని వ్యక్తిగతంగా కొనుగోలు చేశారా లేదా పార్టీ తరపున కొనుగోలు చేశారా అన్నదానిపై స్పష్టత లేదు. గతంలోనే పార్టీ తరపున ప్రత్యేక విమానాన్ని కోనుగోలు చేయడానికి దేవేగౌడ కుమారుడు కుమారస్వామి ఆసక్తి చూపించారు. ఎన్నికల సమయంలో ప్రయాణాలకు పెద్ద ఎత్తున ఖర్చు పెట్టాల్సి వస్తోందని అందుకే పార్టీకే హెలికాఫ్టర్, విమానాలు ఉంటే ఖర్చు తగ్గుతుందని ఆయన అంచనా వేసినట్లుగా తెలుస్తోంది. చార్టెడ్ ఫ్లైట్ ఖరీదు రూ. రెండు వందల కోట్ల వరకూ ఉంటుందని అంచనా వేస్తున్నారు.
దేశంలో సొంత విమానాలు ఉన్న రాజకీయ నేతలు చాలా పరిమితంగానే ఉన్నారు. కార్పొరేట్ ప్రపంచంలో ఎదిగి రాజకీయాల్లోకి వచ్చిన వారికి స్పెషల్ చార్టెడ్ ఫ్లైట్స్ ఉంటాయేమో కానీ.. రాజకీయాల్లో ఉన్న వారికి దాదాపుగా ఉండవు. ఒక వేళ కొనుగోలు చేస్తే రాజకీయ ప్రత్యర్థులు తీవ్రమైన విమర్శలు చేస్తారు. ఆరోపణలు చేస్తారు. అంత సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నిస్తారు. ఈ క్రమంలో దేవేగౌడ ఆ చార్టెడ్ ఫ్లైట్‌ను ఎలా కొనుగోలు చేశారన్నది కూడా కర్ణాటకలో హాట్ టాపిక్ అయ్యే అవకాశం ఉంది. ఎలా కొనుగోలు చేశారు.. ఎంత మొత్తం పెట్టారన్నదాని సంగతిని పక్కన పెడితే.. దేశంలో ప్రత్యేక విమానం ఉన్న రాజకీయ నేతల్లో దేవే గౌడ ఒకరని ఇక చెప్పుకోవచ్చు.
Devegowda Flight : సొంత విమానం కొన్న మాజీ ప్రధాని.. శ్రీవారి చెంత ప్రత్యేక పూజలు..!
ABP Desam
Updated at:
03 Sep 2021 08:19 PM (IST)
మాజీ ప్రధాని దేవేగౌడ సొంత చార్టెడ్ ఫ్లైట్ కొనుగోలు చేశారు. తొలి ప్రయాణానికి ముందు శ్రీవారి చెంత పూజలు చేశారు.
సొంత విమానానికి తిరుపతిలో దేవేగౌడ పూజలు
NEXT
PREV
Published at:
03 Sep 2021 08:19 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -