హస్త ప్రయోగం, సెక్స్ పై చాలా మందికి అపోహలు ఉంటాయి. కొంతమంది ఎక్కువగా హస్త ప్రయోగం చేయడం వల్ల సెక్స్ సామర్థ్యం తగ్గిపోతుందని అంటుంటారు. అయితే తాజాగా చేసిన ఓ అధ్యయనం షాకింగ్ విషయాలు బయటపెట్టింది. హస్త ప్రయోగం ఎక్కువగా చేయడం లేదా సెక్స్ లో తరుచుగా పాల్గొనడం ద్వారా ప్రోస్టేట్ క్యాన్సర్ ముప్పు తక్కువగా ఉంటుందని ఈ అధ్యయనం వెల్లడించింది.
షాకింగ్ విషయాలు..
వీలైనంత ఎక్కువ సార్లు అంగస్తంభన జరిగితే ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా తక్కువ ఉందని అధ్యయనంలో పేర్కొన్నారు. 1992-2010 వరకు 32 వేల మంది పురుషులపై ఈ అధ్యయనం చేశారు. నెలలో ఏడు లేదా అంతకంటే తక్కువ సార్లు సెక్స్ లేదా హస్తప్రయోగం చేసేవారితో పోలిస్తే 21 సార్లు చేసే వారిలో ఈ క్యాన్సర్ ముప్పు 19 శాతం తక్కువ ఉన్నట్లు గుర్తించారు. అయితే వీరంతా 20వ పడిలో ఉన్నవాళ్లే.
అయితే దీనిపై ఇదే మొదటి పరిశోధన కాదు.. ఇంతకుముందు ఆస్ట్రేలియాలో కూడా ఇలాంటి అధ్యయనం జరిగింది. సగటున 2.3 కన్నా తక్కువ సార్లు హస్తప్రయోగం లేదా సెక్స్ లో పాల్గొనే వారితో పోలిస్తే 4.6- 7 సార్లు పాల్గొనే వారిలో 36 శాతం ఈ క్యాన్సర్ ముప్పు తక్కువ ఉందని ఈ పరిశోధన తేల్చింది.
ఎన్నిసార్లు..?
అయితే ఇన్ని సార్లు పాల్గొంటే ముప్పు తక్కువ అని చెప్పడానికి మ్యాజిక్ నంబర్ ఏం లేదని పరిశోధకులు అన్నారు. అది భాగస్వామిపై కూడా ఆధారపడి ఉందని సూచించారు. అయితే అంగస్తంభనకు, ప్రోస్టేట్ క్యాన్సర్ ముప్పుకు ఉన్న సంబంధాలపై ఇప్పటికీ సరైన ఆధారాలు లేవు. అయితే ఈ రెండింటికి లింకేంటి అనే దానిపై ఇప్పటికీ పరిశోధనలు జరుగుతున్నాయి.
అయితే ఈ పరిశోధన చేసిన శాస్త్రవేత్త రైడర్ మాత్రం ఈ రెండింటికి సంబంధం ఉందంటున్నారు.